హీరో నిఖిల్ పెళ్లిపై నివేదిక కోరిన కర్ణాటక ప్రభుత్వం...

హీరో నిఖిల్ పెళ్లి వేడుకపై అధికారుల నుంచి కర్ణాటక ప్రభుత్వం నివేదిక కోరింది.

news18-telugu
Updated: April 17, 2020, 1:52 PM IST
హీరో నిఖిల్ పెళ్లిపై నివేదిక కోరిన కర్ణాటక ప్రభుత్వం...
నిఖిల్ గౌడ పెళ్లి వేడుక (Twitter/Photo)
  • Share this:
లాక్‌డౌన్‌ సమయంలోనూ కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి తన కుమారుడు, యంగ్ హీరో నిఖిల్ పెళ్లిని జరిపించారు. కేవలం వందమంది అతిథుల సమక్షంలో ఓ ఫామ్ హౌస్‌లో ఈ పెళ్లి వేడుక జరిగింది. అయితే ఈ వివాహ వేడుకపై కర్ణాటక ప్రభుత్వం నివేదిక కోరింది. ఈ పెళ్లి వేడుకలో సోషల్ డిస్టెన్స్ నిబంధనలు పాటించలేదనే ఆరోపణలు వినిపించాయి. సోషల్ మీడియాలోనూ దీనిపై విమర్శలు వచ్చాయి. దీంతో యడియూరప్ప ప్రభుత్వం రామ్‌నగర్ అధికారుల నుంచి ఈ వివాహ వేడుకపై నివేదిక కోరింది. కరోనా వేళ లాక్‌డౌన్ కొనసాగుతున్న సమయంలో వివాహం జరపడంపై కర్ణాటక డిప్యూటీ సీఎం అశ్వథ్ నారాయణ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోకపోతే వ్యవస్థను అవమానించినట్టు అవుతుందని ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై రామ్‌నగర్ డిప్యూటీ కమిషనర్ నుంచి నివేదిక కోరామని చెప్పారు. జిల్లా ఎస్పీతో కూడా ఈ అంశంపై మాట్లాడామని తెలిపారు. పెళ్లి వేడుకలో లాక్‌డౌన్ నిబంధనలు పాటించలేదని తేలితే చర్యలు తప్పవని అశ్వథ్ నారాయణ్ హెచ్చరించారు. బెంగళూరు రామ్‌నగర్‌ కేతగానహళ్లిలోని ఫాం హౌస్‌లో జరిగిన ఈ వివాహానికి దేవెగౌడ కుటుంబసభ్యులు, పెళ్లి కుమార్తె రేవతి తల్లిదండ్రులు సహా కొద్దిమంది అతిథులు హాజరయ్యారు.

Published by: Kishore Akkaladevi
First published: April 17, 2020, 1:52 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading