Karnataka: ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంక్షేమ పథకాల అమలుకు ఆధార్(Aadhaar Card)ను ప్రామాణికంగా అమలు చేస్తున్నారు. అయితే దీనికి సమాంతరంగా మరో వ్యవస్థను కర్ణాటక ప్రభుత్వం (Karnataka Govt) తీసుకొస్తోంది. ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకోకుండానే నేరుగా అర్హులైన లబ్ధిదారులకు ప్రయోజనాలను అందించేందుకు కర్ణాటక ప్రభుత్వం కుటుంబ ప్రాజెక్ట్(Kutumba project) లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. సోషల్ రిజిస్ట్రీ, ఎన్టైటిల్మెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్‌తో ఇంటిగ్రేటెడ్ సోషల్ ప్రొటెక్షన్ సిస్టమ్ (ISPS)ని రూపొందించడానికి కకాంప్రహెన్సివ్ డేటాబేస్ ఉండాలనే లక్ష్యంతో పని చేస్తోంది. కుటుంబ ప్రాజెక్ట్ణు మొదటగా మాండ్య జిల్లాలోని శ్రీరంగపట్నం తాలూకాలో పైలట్ ప్రాజెక్ట్‌గా 2019 ఆగస్టులో ప్రారంభించారు. అక్కడ ప్రాజెక్ట్ విజయవంతమైన తర్వాత 2020 మేలో రాష్ర్ట వ్యాప్తంగా అమలు చేయాలని నిర్ణయించారు. అయితే ఇప్పుడు బొమ్మై నేతృత్వంలోని గవర్నమెంట్ కుటుంబ ప్రాజెక్ట్‌కు చట్టబద్ధమైన సపోర్ట్ ఇచ్చే చట్టాన్ని రూపొందిస్తోంది. అందరు సిటిజన్ల డేటాతో సోషల్ రిజిస్ట్రీ క్రియేట్ చేసేందుకు మార్గం సుగమం చేయనుంది. కుటుంబ బిల్లును రూపొందించడానికి ప్రభుత్వం న్యాయ విధానం కోసం థింక్‌ట్యాంక్ విధి సెంటర్‌ను ఏర్పాటు చేసింది.
* అన్ని సేవలకు కేంద్రంగా ‘కుటుంబ’
కుటుంబ ప్రాజెక్ట్ కింద 1.6 కోట్ల కుటుంబాలలోని 5.5 కోట్ల మంది పౌరులకు యునిక్ ఐడెంటిఫికేషన్ కేటాయించారు. భవిష్యత్తులో ఈ డేటా ద్వారానే ప్రజలు, ప్రభుత్వం మధ్య సంప్రదింపులు జరుగుతాయి. ప్రతిపాదిత చట్టం పౌరుల డేటాకు తగిన భద్రతను కల్పిస్తుందని ఆశిస్తున్నట్లు టెక్నాలజీ, డేటా పరిశోధకులు చెబుతున్నారు. విద్యా శాఖ విద్యార్థి డేటాబేస్, ఏడు మిలియన్ల రైతుల వివరాలున్న రైతు రిజిస్ట్రేషన్ & యూనిఫైడ్ బెనిఫిషియరీ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (FRUITS)కి కుటుంబ ప్రాజెక్ట్‌ను లింక్ చేశారు. కుటుంబం రేషన్ కార్డ్‌లు, కుల లేదా ఆదాయ ధృవీకరణ పత్రాల డేటాబేస్‌లతో కూడా లింక్ అవుతుంది, డేటా నిధిగా వ్యవహరిస్తుంది.
Shraddha Walkar : శ్రద్ధావాకర్ హత్య కేసులో కొత్త కోణం.. అంతా ప్లాన్ ప్రకారమే
* ప్రభుత్వ పర్యవేక్షణలో పనులు
డాక్యుమెంట్లను సమర్పించాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వ ప్రోగ్రామ్‌కు పౌరుడి అర్హతను నిర్ధారించడానికి, కులం, ఆదాయం, భూమి హోల్డింగ్ తదితర డేటాను పొందేందుకు కుటుంబ IDని ఉపయోగించవచ్చు. కుటుంబ ప్రాజెక్ట్‌కు చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్‌ను అభివృద్ధి చేయడానికి విధి సెంటర్‌ను తీసుకురావడానికి ప్రభుత్వం టెండర్ ప్రక్రియను మినహాయించింది.
* డేటా సెక్యూరిటీపై ఆరోపణలు
ప్రస్తుతం కుటుంబ ప్రాజెక్ట్ ప్రభుత్వ ఆదేశాల ఆధారంగా నడుస్తోంది. దీనికి సపోర్ట్ ఇవ్వడానికి ఎటువంటి చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్ లేదని ఇ-గవర్నెన్స్ విభాగానికి చెందిన ఓ అధికారి డెక్కన్ హెరాల్డ్‌కు తెలిపారు. కుటుంబ మహారాష్ట్ర యూనిఫైడ్ సిటిజన్ డేటా హబ్‌ను పోలి ఉంటుందని, పౌరుడి 360-డిగ్రీల ప్రొఫైలింగ్‌కు సమానమని ఒక టెక్ పాలసీ పరిశోధకులు చెప్పారు. డేటా సెక్యూరిటీకి సంబంధించి ప్రభుత్వ సామాజిక లక్ష్యాలు సమతుల్యంగా ఉండాలని IT ఫర్ చేంజ్‌లో నిపుణులు శ్రీజా సేన్ అన్నారు. సెంట్రలైజ్డ్ డేటాబేస్లు ఎలా హాని కలిగిస్తాయనే దానిపై ఆందోళనలు ఉన్నాయన్నారు. ఆధార్ ద్వారా ఇప్పటికీ సంక్షేమ పథకాలు పంపిణీ చేస్తున్నప్పుడు.. కుటుంబ ప్రాజెక్ట్ అవసరం ఏంటనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Basavaraj Bommai, Karnataka