Home /News /national /

KARNATAKA FORMER CM SIDDARAMAIAH SATIRES ON PRESENT CHIEF MINISTER BASAVARAJ BOMMAI THAT HE IS A LOTTERY BASED CM PRV

Karnataka: ఆయనకు ముఖ్యమంత్రి పదవి లాటరీ ద్వారా వచ్చిందన్న కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య

సిద్ధరామయ్య (ఫైల్​)

సిద్ధరామయ్య (ఫైల్​)

కాంగ్రెస్ నాయకలు​ బీజేపీపై, సీఎం బొమ్మై వ్యవహారాన్ని ఎద్దేవా చేస్తూ మాట్లాడుతున్నారు. అసలు బసవరాజు బొమ్మై ( Basavaraj bommai) సీఎం అభ్యర్థి కానే కాదని, కేవలం లాటరీ ద్వారా సీఎం పీఠం ఎక్కారని అన్నారు కర్ణాటకల మాజీ సీఎం సిద్ధరామయ్య.

    కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై (Karnataka CM Basavaraj bommai)కి సొంత పార్టీలో అసమ్మతి సెగ మొదలైంది. గత 100 రోజుల పరిపాలనలో గొప్ప సాధనలు లేవని, సొంత నిర్ణయాలు శూన్యమని పలువురు నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల సింధగి, హానగల్‌ అసెంబ్లీ సీట్ల ఉప ఎన్నికల (By elections) సమయంలో రాష్ట్రానికి చెందిన ఓ మంత్రి ఢిల్లీకి వెళ్లి పార్టీ పెద్దలకు కూడా ఫిర్యాదు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. కాంగ్రెస్‌ – జేడీఎస్‌ నుంచి వలస వచ్చిన వారికే పెద్ద పీట వేస్తున్నారని మరికొందరు గుర్రుగా ఉన్నారు. బీజేపీ (BJP)లో ఎన్నో ఏళ్లుగా కష్ట పడిన వారిని సీఎం పట్టించుకోవడం లేదంటున్నారు. అయితే ఇదే క్రమంలో కాంగ్రెస్ నాయకలు​ సైతం బీజేపీపై, సీఎం బొమ్మై వ్యవహారాన్ని ఎద్దేవా చేస్తూ మాట్లాడుతున్నారు. అసలు బసవరాజు బొమ్మై ( Basavaraj bommai) సీఎం అభ్యర్థి కానే కాదని, కేవలం లాటరీ ద్వారా సీఎం పీఠం ఎక్కారని అన్నారు కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య (Siddaramaiah).

    సీఎల్పీ నేత సిద్ధరామయ్య (Siddaramaiah)  మాట్లాడుతూ..  సీఎం బొమ్మై ఆర్‌ఎస్‌ఎస్‌ (RSS)కు చెందినవారు కాదు. యడియూరప్పను తొలగించినప్పుడు లాటరీ (lottery) పద్ధతిలో ఆయనకు సీఎం కుర్చీ లభించింది. బొమ్మైను సాగనంపాలని మంత్రి ఈశ్వరప్ప యత్నిస్తున్నారు అని సిద్ధరామయ్య అన్నారు. ఆదివారం బెళగావి జిల్లా రాయదుర్గ తాలూకాలో కాంగ్రెస్‌ భేటీలో మాట్లాడారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ (RSS)వారు గాడ్సే వంశీకులని సిద్ధరామయ్య ఆరోపించారు.

    డబ్బు బలంతో గెలవాలనుకుంటున్నారు..

    ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ (congress party)కి ప్రజాబలం లేకపోవడంతో డబ్బు బలంతో గెలవాలని యత్నిస్తోందని సీఎం బసవరాజు బొమ్మై ఆరోపించారు. ఆదివారం బెంగళూరు శివార్లలోని ఆనేకల్‌ తాలూకా అత్తిబెలె వద్ద బీజేపి అభ్యర్థి గోపినాథ్‌రెడ్డికి మద్దతుగా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. ప్రతిపక్ష నాయకుడు సిద్దరామయ్య పదేపదే బీజేపీ (BJP) డబ్బులతో అధికారంలోకి వస్తోందని ఆరోపిస్తున్నారన్నారు. కాంగ్రెస్‌ నాయకులు కోటీశ్వరులకు టికెట్లు ఇస్తే, బీజేపీ సామాన్యులను పోటీలో నిలిపిందన్నారు.గిపోయాడు.

    మోదీ,  దేవెగౌడల కలయిక సాధారణం..

    కర్ణాటకలో 2023 వరకు సీఎం మార్పు ఉండదని, ముఖ్యమంత్రిగా బొమ్మై కొనసాగుతారని కేంద్రమంత్రి ప్రహ్లాద్‌జోషి (Union minister prahladh joshi) తెలిపారు. హుబ్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... మంత్రి ఈశ్వరప్ప సీఎం మార్పు వ్యాఖ్యలు చేయడం తప్పన్నారు. అదే విధంగా ప్రధాని మోదీ (Pm Narendra modi), మాజీ ప్రధాని దేవెగౌడ (Devegouda)ల కలయిక సాధారణమేనని, హాసన్‌ ఐఐటీ తదితర విషయాలపై మాట్లాడారని అన్నారు. పొత్తు విషయం తనకు తెలియదన్నారు.

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Maharashtra, Murder

    తదుపరి వార్తలు