అసెంబ్లీలో చర్చలు జరుగుతున్నప్పుడు కోట్లమంది ప్రజలు ఆ సభను ఫాలో అవుతారు... అక్కడ ఏం జరిగినా... దాని పరిణామాలు నేరుగా ప్రజల మీద పడతాయి.. అయితే చాలా సార్లు ఆయా రాష్ట్రాల సభల్లో అనుకోకుండా చర్చలో భాగంగా వివాద్పద వ్యాఖ్యలు చేయడం.. ఆ తర్వాత నాలుక కరుచుకోవడం నేతలకు అలవాటుగానే మారిందని చెప్పవచ్చు..
ఇలా తాజాగా మరో సీనియర్ నేత కర్ణాటక మాజీ స్పీకర్, ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే రైతుల సమస్యలపై చర్చించేందుకు అసెంబ్లీలో సమయం ఇవ్వాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే రమేశ్‌కుమార్ డిమాండ్ చేస్తున్న సమయంలోనే ఆయన స్పీకర్‌ను ఉద్దేశించి అంటూ ఓ వ్యాఖ్య చేశారు.. "లైంగిక దాడి అనివార్యమైనప్పుడు ,పడుకుని ఎంజాయ్ చేయాలి " అంటూ ఓ సామేత ఉందంటూ అన్నారు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలపై అక్కడున్న సభ్యులు పగలబడి నవ్వారు. కాని ఒక్కరు కూడా ఆయన వ్యాఖ్యలను వ్యతిరేకించలేదు. దీంతో అసెంబ్లీ వేదికగా ఆ వ్యాఖ్యలు చేయడం దుమారం రేపుతోంది.
TS Omicron : తెలంగాణలో మరో నాలుగు ఒమిక్రాన్ కేసులు .. మొత్తం 7
ఇష్టంగా కలిసి ఉంటే సహజీవనం కాదు..
కొద్ది రోజులు ప్రేమికులు కలిసి ఉంటే దాన్ని సహజీవనం అనలేమని చంఢిఘడ్ హైకోర్టు వ్యాఖ్యానించింది. ఓ కేసుకు సంబంధించింది ఈ వ్యాఖ్యలు చేసింది. ఇద్దరు వ్యక్తులు కొద్ది రోజులు కలిసి ఉన్నంత మాత్రాన దాన్ని సహజీవనం అనలేమని చెప్పింది.వాళ్లిందరు మనస్పూర్తిగా కలిసి ఉంటే దాన్ని వివాహంలో భాగంగా చూడలేమని చెప్పింది. కేసుకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. హర్యానాలో ఉంటున్న యువతి,యువకులు ప్రేమించుకుంటున్నారు. అయితే యువతి ఇంట్లో ఆమెకు పెళ్లి సంబంధాలు చూస్తుండడంతో ఆమె ఇంట్లోనుండి పారిపోయి ప్రియుడి వద్దకు చేరింది. అప్పటి నుండి వారిద్దరు కలిసి జీవిస్తున్నారు. దీంతో అమ్మాయి తల్లిదండ్రుల నుండి తమకు రక్షణ కల్పించాలని కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలోనే కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
TS news : చిన్నపిల్లల చేత పని చేయిస్తే... తల్లిదండ్రులకు శిక్ష... బాల కళాకారులకు ఇదే పరిస్థితి..
Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Karnataka, National News