హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

నలుగురిని నడిపించే నాయకుడిగా ఎదగాలి..

నలుగురిని నడిపించే నాయకుడిగా ఎదగాలి..

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తున్నందున మనమంతా 21 రోజుల పాటు ఇంటికే పరిమితం కావాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో ‘ఈ 21 రోజుల్లో 21 పాఠాలు’ నేర్చుకుందాం అంటూ కర్ణాటకకు చెందిన మాజీ ఐపీఎస్ అధికారి కె. అన్నామలై జీవిత పాఠాలను చెబుతున్నారు.

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తున్నందున మనమంతా 21 రోజుల పాటు ఇంటికే పరిమితం కావాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో ‘ఈ 21 రోజుల్లో 21 పాఠాలు’ నేర్చుకుందాం అంటూ కర్ణాటకకు చెందిన మాజీ ఐపీఎస్ అధికారి కె. అన్నామలై జీవిత పాఠాలను చెబుతున్నారు.

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తున్నందున మనమంతా 21 రోజుల పాటు ఇంటికే పరిమితం కావాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో ‘ఈ 21 రోజుల్లో 21 పాఠాలు’ నేర్చుకుందాం అంటూ కర్ణాటకకు చెందిన మాజీ ఐపీఎస్ అధికారి కె. అన్నామలై జీవిత పాఠాలను చెబుతున్నారు.

  (కె.అన్నామలై, మాజీ ఐపీఎస్ అధికారి, కర్ణాటక)

  దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తున్నందున మనమంతా 21 రోజుల పాటు ఇంటికే పరిమితం కావాల్సిన పరిస్థితి. ఈ క్రమంలో ‘ఈ 21 రోజుల్లో 21 పాఠాలు’ నేర్చుకుందాం అంటూ కర్ణాటకకు చెందిన మాజీ ఐపీఎస్ అధికారి కె. అన్నామలై జీవిత పాఠాలను చెబుతున్నారు. 20 రోజుల పాటు రోజుకో విషయంపై చర్చించిన ఆయన చివరగా ఈ రోజు లీడర్‌షిప్ గురించి వివరించారు. ఆ వివరణ ఆయన మాటల్లోనే తెలుసుకుందాం..

  21 రోజుల పాటు నేను పలు కీలక అంశాలపై చర్చిస్తూ వస్తున్నా. అన్ని కూడా మన జీవితాన్ని మరింత అందంగా మలిచేవే అని నేను నమ్ముతున్నా. ఈ రోజు చివరగా నాయకత్వ లక్షణాలపై, ఆ సుగుణాలపై చర్చించాలనుకుంటున్నా. ఇప్పటి వరకు చర్చించిన అంశాలన్నీ వ్యక్తిగతంగా, సమాజానికి, దేశానికి మంచి చేసేవే.

  ఇక, నాయకత్వం.. ఎంతో మంది నాయకులు మన కోసం పోరాడారు. స్వాతంత్ర్యం తెచ్చారు. మనల్ని ఏలుతున్నారు. ఎలాంటి స్వార్థం లేకుండా ఎంతో మంది సాంకేతికంగా, ఆర్థికంగా దేశం కోసం పనిచేస్తున్నారు. అందుకే మన దేశం ఇప్పుడు దేదీప్యమానంగా వెలుగొందుతోంది. మన దేశానికి స్వాతంత్ర్యం ఇచ్చేప్పుడు అప్పటి బ్రిటిష్ ప్రధాని విన్‌స్టన్ చర్చిల్ ఒక మాట అన్నాడు. భారతదేశం ఒక దేశంగా ఉండలేదు అని. ఆయన ఆ మాట ఎందుకు అన్నారంటే.. మన దేశంలో ఉన్న విభిన్న పద్ధతులు, మతాలు, ప్రాంతానికి ప్రాంతానికి మధ్య ఉన్న విభిన్న సంస్కృతులే. వీటన్నింటినీ ఏకం చేసుకుంటూ దేశం ముందుకు సాగలేదని ఆయన భావన. కానీ, ఆయన భావనను మనం తప్పు అని నిరూపించాం. మన సమస్యలనే మెట్లుగా చేసుకుంటూ పైకి ఎదిగాం. ప్రపంచ దేశాల ముందు సగర్వంగా తలెత్తుకొని తిరుగుతున్నాం. ఇప్పుడు అదే ఐకమత్యంతో కరోనాను దీటుగా ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నాం. క్లిష్ట సమయాలు కూడా నాయకత్వాన్ని తెలియజేస్తాయి. అవును.. అదే నిజం. నా ప్రకారం.. నాయకత్వం అంటే సమాజాన్ని ప్రతిబింబించేలా ఉండేది. అదే సమయంలో పరిపక్వతను చూపేది. ప్రస్తుతం చాలా మంది నాయకులు మనలో ఆశను కల్పించరు. కార్పొరేట్ సంస్థల్లో నాయకత్వం అంతా ఒక్కరి చేతుల్లోనే ఉంటుంది. అధికారం అంతా వాళ్ల చేతుల్లోనే ఉంటుంది. అదే, ఆయా కంపెనీల ఫెయిల్యూర్‌కు కారణం. వాళ్లే కంపెనీలను ఎత్తేసి, పారిపోతుంటారు.

  దేశం, కంపెనీలే కాదు.. మన ఇంట్లోనూ గొడవలు, విడాకులు.. వంటి సమస్యలు ఎందుకు తలెత్తుతాయి? అంటే..ఇంట్లో సరైన నాయకుడు లేడనే అర్థం. నాయకుడు అనే వాడు ‘నేను’ అని కాకుండా ‘మనం’ అనాలి. గాంధీ, మండేలా, మార్టిన్ లూథర్ కింగ్.. వీళ్లంతా మనం అని అనుకున్నారు కాబట్టే గొప్ప సమాజాన్ని సృష్టించగలిగారు. ఇప్పటి జనరేషన్ చూసుకుంటే వ్యాపార రంగం నుంచి రాజకీయం వరకు అంతా కొత్త రక్తమే. నాయకుడు అనే వాడు మనల్ని నడిపించేవాడే కాదు.. తన వ్యక్తిగతాన్ని తర్పణం చేయగలిగేవారై ఉండాలి. తన ఫాలోయర్లకు తన గెలుపులో ఎప్పటికీ స్థానం ఇవ్వాలి. వ్యక్తిగత గౌరవానికి భంగం వాటిల్లుతుందని చూడకుండా సాహసాలకు ముందడుగు వేయాలి. ఇప్పుడు అలా లేదు. అందుకే కొత్త రకం లీడర్ షిప్ ఇప్పుడు కావాలి. ఎందుకంటే.. ముందు తరానికి పెను సవాళ్లు స్వాగతం పలుకుతాయి. గ్లోబల్ వార్మింగ్, ట్రేడ్ పాలసీస్, పెద్ద, పేద మధ్య వ్యత్యాసం, రాజనీతిలో తప్పులు, కృత్రిమంగా సృష్టించే వ్యతిరేకతలు.. ఇలా చాలా రకాల సమస్యలు ఉన్నాయి.

  వీటన్నింటిని ప్రియారిటీని బట్టి సమాధానం వెతుక్కోవాలి. మనలోనే నాయకుడిని పసిగట్టాలి. మనల్ని నడిపించేవాళ్ల కోసం సెర్చ్ చేయాలి. పేదవాళ్లనూ తక్కువ అంచనా వేయకూడదు. మీ ఇంట్లో పనిచేసే డ్రైవర్, పని మనిషి.. ఎవరో ఒకరి వద్ద నాయకత్వ లక్షణాలు ఉంటే వాళ్లను ప్రోత్సహించాలి. అలా చేస్తే వారి జీవితం మారిపోవడమే కాదు.. ఆర్థికంగా ఎదుగుతారు. అందుకే నా వంతుగా నాయకులను వెతికే పనిలో పడ్డాను. ఓ సంస్థను స్థాపించి, నాయకులను తయారు చేస్తున్నా. www.wetheleader.org వెబ్‌సైట్ కూడా ప్రారంభించాం. ఎవరైనా ఉంటే నాకూ చెప్పండి. మీతో కలిసి వాళ్లను నాయకులుగా మల్చుదాం.

  ఇదిలా ఉండగా.. నేను 21 రోజుల పాటు రాస్తున్న ఆర్టికల్స్‌ను వివిధ భాషల్లోకి అనువదించిన జర్నలిస్టులకు వందనాలు. New18-తెలుగు టీమ్‌కు చెందిన బోనేపల్లి అశోక్ కుమార్, బొమ్మకంటి శ్రావణ్ కుమార్, కృష్ణ ఆదిత్యకు కృతజ్ఞతలు. బద్రి(చెన్నై), అఖిల(కోయంబత్తూరు)తో పాటు New18 కన్నడ టీమ్‌కు చెందిన విజయసారథికి హృదయపూర్వక ధన్యవాదాలు. మళ్లీ కలుద్దాం..

  First published: