కరోనా నుంచి కోలుకున్న మాజీ ముఖ్యమంత్రి

కొద్దిరోజుల క్రితం అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన సిద్ధరామయ్యకు ఆగస్టు 3న కరోనా వచ్చినట్టు నిర్ధారణ అయ్యింది.

news18-telugu
Updated: August 13, 2020, 7:53 PM IST
కరోనా నుంచి కోలుకున్న మాజీ ముఖ్యమంత్రి
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కరోనా బారిన పడి చికిత్స తీసుకున్న కర్ణాటక మాజీ సీఎం సిద్ధరామయ్య వైరస్ నుంచి కోలుకున్నారు. కొద్దిరోజుల క్రితం అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిన సిద్ధరామయ్యకు ఆగస్టు 3న కరోనా వచ్చినట్టు నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. తాజాగా గురువారం ఆయన కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈసారి పరీక్షల్లో ఆయనకు నెగిటివ్ వచ్చింది. దీంతో ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా తనకు సేవలందించిన డాక్టర్లు, ఇతర సిబ్బందికి సిద్ధరామయ్య కృతజ్ఞతలు తెలిపారు. సిద్ధరామయ్యతో పాటు ఆయన కుమారుడు యతీంద్ర కూడా కరోనా బారిన పడి కోలుకున్నారు.

Siddaramiah news, karnataka, covid 19, సిద్ధరామయ్య న్యూస్, కర్ణాటక, కరోనా వైరస్
సిద్ధరామయ్య


కాగా, కొద్దిరోజుల క్రితం కరోనా బారిన పడ్డ కర్ణాటక సీఎం యడియూరప్ప మూడు రోజుల క్రితం కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆయన ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో ఉన్నారు. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సిద్ధరామయ్య కూడా వైద్యుల సూచన మేరకు కొద్దిరోజులు హోం క్వారంటైన్‌లో ఉండనున్నారు.
Published by: Kishore Akkaladevi
First published: August 13, 2020, 7:53 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading