హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Alcohol Lovers: మద్యంప్రియుల పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే.. ఆల్కహాల్‌ లవర్స్‌ సంఘం డిమాండ్స్ ఇవే

Alcohol Lovers: మద్యంప్రియుల పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే.. ఆల్కహాల్‌ లవర్స్‌ సంఘం డిమాండ్స్ ఇవే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Liquor Lovers: కర్ణాటకలో మద్యం ప్రియుల సంఘం కొత్తగా ఏర్పాటైంది. లైసెన్స్‌లు ఇచ్చి మద్యం అమ్మి, ట్యాక్స్‌ కలెక్ట్‌ చేస్తున్న ప్రభుత్వం.. మద్యం తాగే వారి రక్షణ కూడా చూసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

Alcohol Lovers:  కర్ణాటక (Karnataka)లో మద్యం ప్రియుల (Liquor lovers) సంఘం కొత్తగా ఏర్పాటైంది. లైసెన్స్‌లు ఇచ్చి మద్యం అమ్మి, ట్యాక్స్‌ కలెక్ట్‌ చేస్తున్న ప్రభుత్వం.. మద్యం తాగే వారి రక్షణ కూడా చూసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. దీనికి సంబంధించి తాజాగా హాసన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కర్ణాటక ప్రభుత్వం మద్యం నిషేధించాలని, లేదా మద్యం ప్రియుల భద్రత, సంక్షేమం కోసం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Coronavirus: వచ్చే 40 రోజులు కీలకం.. కేసులు భారీగా పెరగొచ్చు.. ఐనా ఆందోళన అవసరం లేదు

పూర్తి బాధ్యత ప్రభుత్వానిదే

కొత్తగా ఏర్పాటైన కర్ణాటక మద్యపాన ప్రియుల పోరాట సంఘం(Karnataka Madyapana Priyara Horata Sangha) అధ్యక్షుడు వెంకటేష్ బోరెహళ్లి మాట్లాడుతూ.. మద్యాన్ని నిషేధించండి లేదా మద్యపాన ప్రియులకు సౌకర్యాలు కల్పించండి అని కోరారు. నవంబర్ 8న నమోదైన ఈ సంఘం మద్యపాన ప్రియుల సంక్షేమం కోసం ప్రత్యేక కార్పొరేషన్‌ను కోరుతోంది. అలాగే ఆరోగ్య శిబిరాలు నిర్వహించాలని, కాలేయ వ్యాధి సోకితే వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరించాలని, మరణిస్తే వారి కుటుంబాలకు నష్టపరిహారం అందించాలని సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. బిపిఎల్ కార్డులున్న వారికి ఏటా లక్ష ఇళ్లు, మద్యం తాగి తల్లిదండ్రుల వల్ల చదువుకు ఆటంకం కలిగిన పిల్లలకు ప్రభుత్వ హాస్టళ్లలో రిజర్వేషన్లు, తాగుబోతులు విశ్రాంతి తీసుకునే వరకు బార్‌లు/వైన్‌షాపుల ఆవరణలో పడకలు, ఇతర సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు. అప్పుడే తాగిన తర్వాత క్షేమంగా ఇంటికి డ్రైవ్‌ చేసుకుని వెళ్లగలరని చెబుతున్నారు.

Rahul Gandhi: ఎలాంటి అమ్మాయిని పెళ్లాడతారు ?.. రాహుల్ గాంధీ ఆసక్తికర సమాధానం

ఎక్సైజ్‌ మంత్రికి ఆహ్వానం

రాష్ట్ర ప్రభుత్వానికి మద్యం మంచి ఆదాయాన్ని ఇస్తున్నా మద్యం ప్రియుల సంక్షేమాన్ని విస్మరిస్తున్నారని డీహెచ్‌వో వెంకటేష్‌ అన్నారు. అరసికెరెలో ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎక్సైజ్ మంత్రి కె గోపాలయ్యను అసోసియేషన్ ఆహ్వానించింది. మరో నలుగురు ఎమ్మెల్యేలను కూడా ఆహ్వానించామని తెలిపింది. సురక్షిత మద్యం వినియోగంపై సెమినార్ నిర్వహించేందుకు ఎక్సైజ్ కమిషనర్‌ను కూడా ఆహ్వానిస్తున్నామని చెప్పారు.

వైద్య ఖర్చులు భరించాలి

ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి నవంబర్‌ వరకు మద్యం అమ్మకాల ద్వారా రాష్ట్రానికి రూ.19,540 కోట్ల ఆదాయం వచ్చినట్లు ఎక్సైజ్‌ శాఖ వర్గాలు తెలిపాయి. 2021-22లో ఆదాయం రూ.26,378 కోట్లు. ప్రతి మద్యం బాటిల్‌కు బీమా కల్పించాలని, మద్యం ప్రియులు మరణిస్తే కుటుంబానికి రూ.లక్ష అందించాలని వెంకటేష్‌ కోరుతున్నారు. ఆరోగ్య శాఖ మూడు నెలలకు ఒకసారి స్క్రీనింగ్ క్యాంపులు నిర్వహించాలని, కాలేయం లేదా మరేదైనా శస్త్ర చికిత్స చేయించుకోవాలంటే రూ.6 లక్షల వరకు ప్రభుత్వమే భరించాలని డిమాండ్‌ చేశారు. బార్‌లు మద్యం ధరలను ప్రదర్శించాలని, వినియోగదారులకు ఫిల్టర్ చేసిన నీరు, శుభ్రమైన మరుగుదొడ్లను అందించాలని తెలిపారు.

సభ్యత్వ నమోదు కార్యక్రమం

ఇది రాష్ట్ర స్థాయి సంస్థ కాబట్టి, ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉంటుందని, సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 2 లక్షలకు పైగా మద్యపాన ప్రియుల నుంచి సంప్రదింపులు ఉన్నాయని పేర్కొన్నారు. అసోసియేషన్ డైరెక్టర్ ఎం మధు మాట్లాడుతూ.. మద్యానికి బానిసైన వారి కుటుంబాలను ఆదుకునేందుకు తాను ముందుకొచ్చానని తెలిపారు. ప్రధాన కార్యదర్శి సి రామస్వామి మాట్లాడుతూ.. మద్యం సేవించే ప్రతి బాటిల్‌పై పన్ను వసూలు చేస్తున్నందున వారి సంక్షేమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టాలన్నారు. న్యాయవాది, మానవ హక్కుల కార్యకర్త బాబూరాజ్ పి పి మాట్లాడుతూ.. అసోసియేషన్ డిమాండ్లు న్యాయమైనవి, ప్రభుత్వం లైసెన్స్ ఇచ్చి వారి నుంచి పన్ను పొందినప్పుడు, వారి భద్రతకు చర్యలు తీసుకోవడం విధి అని చెప్పారు.

First published:

Tags: Karnataka, Liquor, Liquor sales

ఉత్తమ కథలు