Yediyurappa resign: కర్ణాటక రాజకీయాలు మరింత హీట్ ఎక్కాయి. సీఎం యడ్యూరప్ప తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మధ్యాహ్న భోజనం తర్వాత... గవర్నర్‌ను కలిసి... తన రాజీనామా పత్రాన్ని సమర్పిస్తానని ప్రకటించారు. తానేమీ బాధతో రాజీనామా చేయట్లేదన్న ఆయన... తనకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా... 2 ఏళ్లపాటూ ముఖ్యమంత్రి పదవిలో కూర్చునే అవకాశం ఇచ్చారని అన్నారు. అందుకు వారికి ధన్యవాదాలు చెబుతున్నాను అన్నారు.
యడ్యూరప్ప పదవికి రాజీనామా చేస్తారని ముందునుంచే ఊహాగానాలు ఉన్నప్పటికీ... మరోవైపు నుంచి ఆయనకు లింగాయత్ వర్గం నుంచి మద్దతు ఉన్నందువల్ల... బీజేపీ హైకమాండ్ ఆయన్నే కొనసాగించే అవకాశాలు ఉన్నాయనే వాదన వినిపించింది. ఐతే... జులై 26న హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకుంటే... దానికి కట్టుబడి ఉంటానని వారం కిందట యడ్యూరప్ప ప్రకటించారు. అదే విధంగా రాజీనామా లేఖ ఇవ్వబోతున్నట్లు తెలిపారు.
ఈ రాజీనామా వార్తల మధ్య రెండు వారాల కిందట యడ్యూరప్ప ఢిల్లీ వెళ్లారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇతర పార్టీ నాయకులను కలిసి వచ్చారు. తర్వాత తన పదవికి ఎలాంటి ముప్పూ లేదనీ... 78 ఏళ్ల యడ్యూరప్ప క్లారిటీగా చెప్పారు. తనను ఎవరూ రాజీనామా చేయమని కోరలేదని అన్నారు. అయితే ఆయనపై పార్టీలో వ్యతిరేకత పెరిగిన మాట వాస్తవం. ఈమధ్య వ్యతిరేక వర్గంలోని కొందరు నాయకులు ఈ విషయంపై అధిష్టానంతో చర్చించినట్లు వార్తలొచ్చాయి. జులై 26న నాటికి యెడ్డీ రెండేళ్ల పాలన పూర్తవుతుందనీ.... ఆ తర్వాత ఆయన కుర్చీ దిగిపోతారని ఆ వర్గం వారు ప్రచారం చేశారు. సరిగ్గా అదే జరుగుతోంది.
బలమైన మద్దతు:
శక్తివంతమైన లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన యడ్యూరప్పకు ఆ వర్గం నుంచి మద్దతు ఉన్నప్పటికీ... ఆయనకు ప్రజాబలం తగ్గిందని హైకమాండ్ భావిస్తున్నట్లు తెలిసింది. ఇంకా ఆయన్నే కొనసాగిస్తే... రాష్ట్రంలో పార్టీ దెబ్బతినే ప్రమాదం ఉందని భావించడం వల్లే... ఆయన్ని తొలగిస్తున్నట్లు సమాచారం. ఇలా పార్టీ, ప్రభుత్వంలో చాలాసార్లు వ్యతిరేకతను ఎదుర్కొన్నారు యడ్యూరప్ప. ప్రతిసారీ ప్రతికూలతలను అధిగమిస్తూ వచ్చారు. ఐతే... బీజేపీలో ఏ నేత అయినా 75 ఏళ్లకు మించి యాక్టివ్ రాజకీయాల్లో ఉండకూడదనే రూల్ ఉంది. ఆ ప్రకారం చూస్తే... యడ్యూరప్పకు 78 ఏళ్లు కావడంతో... హైకమాండ్ ఆల్రెడీ మూడేళ్లు అధిక సమయం ఇచ్చినట్లే. ఆయన్ని తప్పించడం ద్వారా... యువతకు అవకాశం ఇవ్వాలని పార్టీ భావిస్తున్నట్లు తెలిసింది. ఆయనకు గవర్నర్ పదవి ఇస్తారని తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: Business Ideas: పెట్టుబడి రూ.లక్ష... రూ.8 లక్షల ఆదాయం.. ప్రభుత్వ సాయం
2023లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అందుకే హైకమాండ్ ఇప్పుడే యడ్యూరప్పను తొలగించి.. పార్టీని ఎన్నికలకు సన్నద్ధం చెయ్యాలని భావిస్తున్నట్లు తెలిసింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులు బీఎల్ సంతోష్, సీటీ రవి యడ్యూరప్పకు వ్యతిరేకంగా పావులు కదిపారని ఆయన మద్దతుదారులు యబుతున్నారు. వారే నాయకత్వ మార్పును కోరారని అనుమానిస్తున్నారు. మరి నెక్ట్స్ ఎవర్ని సీఎంగా నియమిస్తారన్నదానిపై చర్చ జరుగుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Karnataka, Karnataka bjp, Yediyurappa