Karnataka CM: కర్ణాటకలో బీజేపీ కొత్త శాసనసభాపక్ష నేతగా ఆ రాష్ట్ర ప్రస్తుత హోంమంత్రి బసవరాజ్ బొమ్మై ఎన్నికయ్యారు. నేటి ఉదయం 11 గంటలకు ఆయన కర్ణాటక కొత్త సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. రాజ్‌భవన్‌లో ఈ కార్యక్రమం జరగనుంది. డిప్యూటీ సీఎం రేసులో శ్రీరాములు, అశోక్, కర్జోల్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. బసవరాజ్ బొమ్మై రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు. ఆయన మాజీ ముఖ్యమంత్రి ఎస్ఆర్ బొమ్మై కొడుకు. 2008లో బీజేపీలో చేరారు. 1998, 2004లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత షిగ్గావ్ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ప్రస్తుత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి యడియూరప్పకు ఎస్ఆర్ బొమ్మై అత్యంత సన్నిహితుడు, నమ్మకస్తుడు. యడియూరప్ప కూడా తదుపరి ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మైని ఎంపిక చేయాలని అధిష్టానానికి సూచించారని తెలిసింది. బసవరాజ్ బొమ్మై కూడా యడియూరప్ప లాగే... లింగాయత్ సామాజికవర్గానికి చెందినవారే.
నిజానికి 2008 సంవత్సరం బసవరాజ్ బొమ్మకి క్లిష్టమైన సంవత్సరం. ఆయన తండ్రి, మాజీ ముఖ్యమంత్రి SR బొమ్మై రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. ఆయన పార్టీ జనతాదళ్ యునైటెడ్ దాదాపు చీలిపోయినట్లైంది. అలాంటి పార్టీలోకి బసవరాజ్ వెళ్లే అవకాశం లేకుండా పోయింది. అంతర్గత వర్గాల ప్రకారం... బసవరాజ్.. ఆ సమయంలో కాంగ్రెస్‌లోకి వెళ్లాలనుకున్నారు. ఆ పార్టీ అయితే తన ఆలోచనలు, సిద్ధాంతాలకు అనుకూలంగా ఉందని భావించారు. కానీ అప్పటి కాంగ్రెస్ కర్ణాటక అధ్యక్షడుు మల్లికార్జున ఖర్గే... ఇందుకు ఒప్పుకోలేదని తెలిసింది.
ಇಂದು ನಡೆದ ಭಾರತೀಯ ಜನತಾ ಪಾರ್ಟಿ ಶಾಸಕಾಂಗ ಪಕ್ಷದ ಸಭೆಯಲ್ಲಿ ನನ್ನಮೇಲೆ ವಿಶ್ವಾಸವನ್ನಿಟ್ಟು ಶಾಸಕಾಂಗ ಪಕ್ಷದ ನಾಯಕನಾಗಿ ಆಯ್ಕೆ ಮಾಡಿದ ಪಕ್ಷದ ಎಲ್ಲ ಶಾಸಕರುಗಳಿಗೆ ನನ್ನ ಹೃತ್ಪೂರ್ವಕ ಧನ್ಯವಾದಗಳು. @BJP4Karnataka@BJP4Indiapic.twitter.com/ASGs1mHd0D
ఇలా మథనపడిన బసవరాజ్... బీఎస్ యడియూరప్ప తలుపులు తట్టారు. ఆనందంగా ఆహ్వానించిన యడియూరప్ప... బీజేపీ టికెట్ ఇచ్చి... షిగ్గావ్ నుంచి బరిలో దింపారు. తద్వారా బసవరాజ్ సరైన నిర్ణయమే తీసుకున్నట్లైంది. బీజేపీ అధికారంలోకి వచ్చింది. యడియూరప్ప... బసవరాజ్‌ను నీటి వనరుల శాఖ మంత్రిగా నియమించారు.
యడియూరప్పకు అత్యంత నమ్మకస్తుడిగా మారిన బసవరాజ్... కష్టసమయాల్లో ఆయన వెంటే ఉన్నారు. ఐతే... 2012లో యడియూరప్ప... బీజేపీని వీడి... KJP ని స్థాపించాలనుకున్నప్పుడు... బసవరాజ్ ఆయన వెంట వెళ్లలేదు. ఆ సమయంలో... నమ్మక ద్రోహి అంటూ... యడియూరప్ప మద్దతుదారులు బసవరాజ్‌పై విమర్శలు చేశారు. ఐతే... తెలివైన బసవరాజ్... యడియూరప్ప కొత్త పార్టీ పెట్టినా... అది అంతగా రాణించలేదని అని పసిగట్టారు. బీజేపీతోనే ఉన్న బసవరాజ్ మళ్లీ గెలిచారు. ఓడిపోయిన యడియూరప్ప మళ్లీ బీజేపీలో చేరారు. ఈ క్రమంలో... యడియూరప్ప... బసవరాజ్‌ను దూరం పెడతారని కొందరు భావించారు. కానీ... అంతా శుభమే జరిగింది.
2019లో HD కుమారస్వామి నేతృత్వంలోని JDS - కాంగ్రెస్ కలిసి ఉన్న ప్రభుత్వాన్ని కూలదోయడానికి యడియూరప్ప ప్రయత్నించినప్పుడు బసవరాజ్ ఆయన వెంటే ఉన్నారు. యడియూరప్ప ప్రభుత్వంలో హోంశాఖ మంత్రిగా చేసిన బసవరాజ్... ఆయన నీడలా మెలిగారు. యడ్డీ ఏ నిర్ణయం తీసుకున్నా... బొమ్మైని సంప్రదించేవారు. అంతలా సీఎంతో రాపో ఉన్నప్పటికీ... బొమ్మై మాత్రం లోప్రొఫైల్ మెయింటేన్ చేశారు. దాని అద్భుత ఫలితం ఇప్పుడు కనిపిస్తోంది.
బీజేపీ ప్రభుత్వంలోని చాలా మంది సీఎం పోస్ట్ కోసం లాబీయింగ్ చేశారు. బొమ్మై మాత్రం మౌనంగా ఉండిపోయారు. బహుశా... ఎన్ని చేసినా... యడియూరప్ప ఆశీర్వాదం లేనిదే సీఎం సీటు దక్కదని బొమ్మై భావించి ఉండొచ్చు. తద్వారా మరోసారి బొమ్మై నిర్ణయమే కరెక్ట్ అయ్యింది. స్వయంగా యడియూరప్పే... తన వారసుడిగా బొమ్మైని ఎంపిక చేసినట్లైంది. బొమ్మైకి RSS బ్యాక్ గ్రౌండ్ లేదు. ఇది బీజేపీలో కొత్తదనం. సీఎం సీటును దక్కించుకోవడం ద్వారా ఆయన అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. సమయానుకూల నిర్ణయాలు, కొంత అదృష్టం వంటివి బసవరాజ్‌కు తన 30 ఏళ్ల రాజకీయ జీవితంలో కలిసొచ్చాయి.
1988లో అప్పటి సీఎం రామకృష్ణ హెగ్డే... టెలిఫోన్ ట్యాపింగ్ వివాదంతో సీఎం పదవిని వదులుకున్నారు. ఆయన సీనియర్ మంత్రి S R బొమ్మై... ఇంట్లో ఉండి... సిగరెట్ తాగుతూ... హిందీ సినిమా జంజీర్ చూస్తున్నారు. మిగతా తోటివాళ్లంతా... సీఎం సీటు కోసం లాబీయింగ్ చేస్తున్నారు. ఆ సమయంలో... హెగ్డే... తన వారసుడిగా S R బొమ్మైని సూచించారు. కాకతాళీయంగా... అటు తండ్రి, ఇటు కొడుకూ... ఇద్దరూ... నాటకీయ పరిణామాల మధ్య సీఎంలు అయినట్లైంది. చరిత్ర పునరావృతమవుతోంది.
(D P Satish - News18)
Published by:Krishna Kumar N
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.