హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

షాకింగ్.. బాలుడిపై సలసల కాగుతున్న నీటిని పోసిన ఉపాధ్యాయుడు.. కారణం ఏంటంటే..

షాకింగ్.. బాలుడిపై సలసల కాగుతున్న నీటిని పోసిన ఉపాధ్యాయుడు.. కారణం ఏంటంటే..

ఆస్పత్రిలో ఉన్న గాయపడ్డ బాలుడు

ఆస్పత్రిలో ఉన్న గాయపడ్డ బాలుడు

Karnataka: తరగతిలో ఉపాధ్యాయుడు దారుణంగా ప్రవర్తించాడు. బాలుడి స్కూల్ యూనీఫామ్ మీద వేడినీళ్లను గుమ్మరించాడు. దీంతో అక్కడున్న వారంతా భయంతో వణికిపోయారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Karnataka, India

పిల్లలను మంచిగా విద్యాబుద్ధులు నేర్పిస్తారని తల్లిదండ్రులు పాఠశాలలకు పంపుతుంటారు. కానీ కొంత మంది ఉపాధ్యాయులు పవిత్రమైన తమ వృత్తికే మచ్చతీసుకొచ్చేలా ప్రవర్తిస్తున్నారు. విద్యార్థులను వేధించడం, వారిపై అఘాయిత్యాలకు పాల్పడటం చేస్తున్నారు. మరికొంత మంది తాగి స్కూల్ కు వస్తున్నారు. అంతే కాకుండా... పిల్లలను, తోటి మహిళా ఉపాధ్యాయులను కూడా వేధిస్తున్నారు. ఇలాంటి ఘటనలు అనేక చోట్ల వెలుగులోకి వచ్చారు. తాజాగా, మరో ఘటన వార్తలలో నిలిచింది.

పూర్తి వివరాలు.. కర్ణాటకలోని (karnataka)  రాయచూర్ జిల్లాలో దారుణ ఘటన జరిగింది. సంతే కల్లూరు గ్రామంలోని ఘనమఠేశ్వర గ్రామీణ సంస్థ అనే సంస్థ నిర్వహిస్తున్న ప్రాథమిక పాఠశాలలో గత శుక్రవారం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోనికి వచ్చింది. అఖిత్ అనే 2వ తరగతి చదువుతున్న బాలుడు.. యూనిఫామ్ లోనే మూత్రవిసర్జన చేశాడు. దీంతో ఉపాధ్యాయుడు.. హులిగెప్ప ఆగ్రహానికి గురయ్యాడు. వెంటనే వేడినీళ్ళను తీసుకొచ్చి, బాలుడి మీద గుమ్మరించాడు. దీంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. విద్యార్థులంతా భయంతో పారిపోయాడు.

ఇతర సిబ్బంది బాలుడిని ఆస్పత్రికి తరలించారు. అతనికి 40 శాతం శరీరమంతా కాలిపోయిందిన వైద్యులు తెలిపారు. ఇదిలా ఉండగా ఘటనపై ఫిర్యాదు చేయోద్దని బాధిత కుటుంబాలను కొంతమంది బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఘటనకు సంబంధించిన బాలుడి ఫోటోలు వైరల్ కావడంతో ఈ అమానుషం వెలుగులోనికి వచ్చింది. ఘటన జరిగినప్పటి నుంచి ఉపాధ్యాయుడు హులిగెప్ప పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. దీనిపై సుమోటోగా చర్యలు తీసుకొవాలని స్థానికులు పోలీసులను కోరుతున్నారు. బాధితులు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. బాలుడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్న ఫోటోలు వైరల్‌గా (Viral news)  మారాయి.

ఇదిలా ఉండగా ఒక ఏనుగు (Elephant) అడవికి దగ్గరగా ఉన్న రోడ్డు మీదకు వచ్చింది.

అప్పుడు దానికి దగ్గర నుంచి ఒక వ్యక్తి తన కారును తీసుకొచ్చాడు. ఏనుగును సమీపంలోని దగ్గర నుంచి చూడాలను కున్నాడు. ఇంతలో షాకింగ్ ఘటన జరిగింది. అప్పుడు ఏనుగుకు పిచ్చ కోపం వచ్చింది. వెంటనే కారు మీద తన ప్రతాపం చూపించింది. తన కాలితో కారు టైరు ను బలంగా నొక్కిపడేసింది.

అంతే కాకుండా.. కారును వెనక్కు తోసేసింది. అప్పటికి దాని కోపం చల్లారనట్లుంది.. ఇక లాభంలేదని.. ఏకంగా కారు మీద ఎక్కి.. దాన్ని అద్దాలు పగిలిపోయేలా బలంగా తుండంతో కారు ముందు భాగాన్ని ధ్వంసం చేసింది. దీంతో భయపడిపోయిన డ్రైవర్.. కారును వెనక్కు పోనిచ్చాడు. ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో (Social media)  తెగ వైరల్ గా (Viral video) మారింది.

Published by:Paresh Inamdar
First published:

Tags: Karnataka, VIRAL NEWS

ఉత్తమ కథలు