కాంగ్రెస్‌కు హోం...జేడీఎస్‌కు ఆర్థిక శాఖ..!

Shiva Kumar Addula | news18
Updated: June 6, 2018, 3:06 PM IST
కాంగ్రెస్‌కు హోం...జేడీఎస్‌కు ఆర్థిక శాఖ..!
  • News18
  • Last Updated: June 6, 2018, 3:06 PM IST
  • Share this:
కర్నాటకలో జేడీఎస్-కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి వారం రోజులు గడిచాయి. సీఎంగా కుమారస్వామి ప్రమాణస్వీకారం వేళ... ఆయనతో పాటు డిప్యూటీ సీఎంగా పరమేశ్వర మాత్రమే ప్రమాణం చేశారు. వారం గడిచినా మంత్రి పదవుల పంపకాలపై ఇప్పటికీ క్లారిటీ రాలేదు.

సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో తమకే కీలక మంత్రిత్వశాఖలు కావాలని కాంగ్రెస్ పట్టుబట్టుతోంది. అన్నిముఖ్య శాఖలు మీకే ఇవ్వడం కుదరదని జేడీఎస్ నేతలు నేతలు తేల్చిచెప్పారు. దీంతో పదవులపై వారం రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఇరువర్గాల నేతలు 5 సార్లు సమావేశమయ్యారు. ఇప్పటి వరకు హోంశాఖ, ఆర్థికశాఖ పై మాత్రమే ఓ కొలిక్కివచ్చినట్లు సమాచారం.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం జేడీఎస్‌‌‌కు ఆర్థిక శాఖ ఇచ్చేందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. అటు హోంశాఖను కాంగ్రెస్‌కు ఇచ్చేందుకు కుమారస్వామి సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇక మిగిలిన పోర్ట్ పోలియోలపై రాహుల్ గాంధీ  ఇండియాకు వచ్చాక క్లారిటీ రానుంది.

రాహుల్ గాంధీ ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. సోనియా గాంధీకి వార్షిక ఆరోగ్య చికిత్సలో భాగంగా .. అమెతో పాటు రాహుల్ కూడా అక్కడికి వెళ్లారు. మరో మూడు రోజుల్లో ఢిల్లీకి రానున్నారు. ఇక పదవుల పంపకాలపై జేడీఎస్ సీనియర్ నేత డానిష్ అలీ.. ఇవాల జేడీఎస్ అధినేత దేవె గౌడతో పాటు సీఎం కుమారస్వామితో సమావేశం కానున్నారు.
Published by: Shiva Kumar Addula
First published: May 31, 2018, 9:04 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading