నేడు కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలు...తేలనున్న యెడ్యూరప్ప భవిష్యత్తు

ఉప ఎన్నికల ఫలితాల్లో కనీసం ఆరుగురు ఎమ్మెల్యేలు గెలిస్తేనే బీజేపీకి మెజార్టీ ఉంటుంది. లేదంటే యెడ్యూరప్ప సర్కారు మైనార్టీలో పడిపోతుంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి 66, జేడీఎస్‌కు 34 మంది ఎమ్మెల్యేలున్నారు. ప్రస్తుతం బీజేపీకి 105 మంది ఎమ్మెల్యేల బలం ఉంది.

news18-telugu
Updated: December 9, 2019, 8:35 AM IST
నేడు కర్ణాటక ఉప ఎన్నికల ఫలితాలు...తేలనున్న యెడ్యూరప్ప భవిష్యత్తు
యడ్యూరప్ప
  • Share this:
ఈ నెల ఐదున 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. మొత్తం 66.25 శాతం పోలింగ్ నమోదవ్వగా. ఉప ఎన్నికల ఫలితాల్లో కనీసం ఆరుగురు ఎమ్మెల్యేలు గెలిస్తేనే బీజేపీకి మెజార్టీ ఉంటుంది. లేదంటే యెడ్యూరప్ప సర్కారు మైనార్టీలో పడిపోతుంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి 66, జేడీఎస్‌కు 34 మంది ఎమ్మెల్యేలున్నారు. ప్రస్తుతం బీజేపీకి 105 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. స్పీకర్‌తో పాటు మరో ఇండిపెండెంట్ ఎమ్మెల్యే కూడా బీజేపీకి మద్దతిస్తున్నారు. ఇదిలా ఉంటే 14 మంది కాంగ్రెస్, ముగ్గురు జేడీఎస్ సభ్యుల రాజీనామాలతో ఇటీవలే కాంగ్రెస్- జేడీఎస్ సర్కారు కూలిపోయింది. ఆ వెంటనే రాజీనామాలు చేసిన సభ్యులను స్పీకర్ అనర్హులుగా ప్రకటించారు. దీంతో ఉపఎన్నికలు అనివార్యమయ్యాయి.

First published: December 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>