కర్ణాటకలో మళ్లీ బీజేపీ హవా... ఉప ఎన్నికల్లో 12 స్థానాలు

Karnataka Bypolls Results : కర్ణాటకలో బీజేపీ వేసిన రాజకీయ ఎత్తుగడలు ఆ పార్టీకే కలిసొచ్చాయి. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, జేడీఎస్ చిత్తుగా ఓడిపోగా... బీజేపీ దూసుకెళ్లింది.

news18-telugu
Updated: December 9, 2019, 11:48 AM IST
కర్ణాటకలో మళ్లీ బీజేపీ హవా...  ఉప ఎన్నికల్లో 12 స్థానాలు
కర్ణాటకలో మళ్లీ బీజేపీ హవా... ఉప ఎన్నికల్లో 12 స్థానాలు
  • Share this:
Karnataka Bypolls Results : కర్ణాటకలో బీజేపీ శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నాయి. కమలం పార్టీ నేతలు సీట్లు పంచుకొని, శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు. అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ 12 చోట్ల దూసుకెళ్లగా... కాంగ్రెస్ 2, జేడీఎస్ 0, ఇతరులు ఒక స్థానం (హోస్‌కోట్‌లో స్వతంత్ర అభ్యర్థి శరత్ బచీచ్ గౌడ్ ఆధిక్యం) దక్కించుకున్నట్లుగా ఫలితాలొచ్చాయి. కొన్ని స్థానాల ఫలితం ఇంకా తేలకపోయినా... జరిగిన రౌండ్లలో ఆయా స్థానాల్లో బీజేపీ అభ్యర్థులకు భారీ ఆధిక్యం ఉండటం వల్ల... ఆ స్థానాలు బీజేపీకే దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందువల్ల బీజేపీకి మరోసారి భారీ విజయం దక్కినట్లైంది. కనీసం 6 అసెంబ్లీ స్థానాలు గెలిస్తేనే యడ్యూరప్ప ప్రభుత్వం అధికారంలో కొనసాగే అవకాశాలు ఉన్న సమయంలో... ఏకంగా 12 స్థానాలు దక్కడంతో... ఇక యడ్యూరప్ప కుర్చీకి ఇప్పట్లో కుదుపులు లేనట్లే అనుకోవచ్చు.

మొత్తం 225 స్థానాలున్న కర్ణాటక అసెంబ్లీలో కాంగ్రెస్-జేడీఎస్‌కు చెందిన 17 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ రమేష్ కుమార్ అనర్హత వేటు వేయడంతో సభ్యుల సంఖ్య 208కి చేరింది. దీంతో 105 స్థానాలున్న బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. ప్రస్తుతం బీజేపీ ప్రభుత్వం నిలబడాలంటే ఆ పార్టీ కనీసం 6 స్థానాల్లో తప్పక విజయం సాధించాలి. కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కూలిపోవడానికి పరోక్షంగా బీజేపీకి సహకరించిన రెబల్స్ ప్రస్తుతం బీజేపీ తరఫున ఎన్నికల్లో పోటీచేశారు. 17 స్థానాల్లో రెండు స్థానాలను పక్కన పెట్టి... 15 సీట్లకు పోలింగ్ జరపగా... వాటిలో బీజేపీకి 12 స్థానాలు దక్కుతున్నాయి. అందువల్ల యడ్యూరప్ప నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం పూర్తి మెజార్టీ సాధించినట్లే. ఇప్పుడొచ్చిన ఫలితాల వల్ల అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు కూడా ప్రతిపక్షాలు ఆసక్తి చూపలేని పరిస్థితి ఉంది. ఈ ఫలితాలతో కాంగ్రెస్, జేడీఎస్ కూటమి మరింత డీలా పడినట్లైంది.

 

అక్క శిల్పా శెట్టి బాటలో చెల్లి షమితా శెట్టి


ఇవి కూడా చదవండి :

ఉల్లిపాయల పోరాటంలో ప్రాణాలు విడిచిన వృద్ధుడుడెలివరీ బాయ్స్ కోసం ఫ్రీ ఫుడ్, కూల్‌డ్రింక్స్... వైరల్ వీడియో

కొత్త అవతారం ఎత్తిన అర్ణబ్ గోస్వామి... ఇక ఆపలేంగా...

ఒకేసారి రెండు సెక్స్ రాకెట్ల గుట్టు రట్టు...

సానియా మీర్జా సంచలనం... దుమ్మురేపుతున్న వైరల్ వీడియో
First published: December 9, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>