హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

బుల్​బుల్​ పిట్ట రెక్కలపై కూర్చుని జైలు నుంచి సావర్కర్ మాయమయ్యేవారు..కర్ణాటక 8వ తరగతి పాఠం

బుల్​బుల్​ పిట్ట రెక్కలపై కూర్చుని జైలు నుంచి సావర్కర్ మాయమయ్యేవారు..కర్ణాటక 8వ తరగతి పాఠం

సావర్కర్

సావర్కర్

,Class 8 Kannada Textbook Controversy : కర్ణాటకలో మరో వివాదం ముదురుతోంది. కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం పాఠ్యపుస్తకాల పునఃసమీక్షకు కొంతకాలం క్రితం ఆదేశించింది. రోహిత్ చక్రతీర్థ కమిటీ ఈ ఏడాది ఆ బాధ్యతలు చేపట్టింది.

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad, India

  ,Class 8 Kannada Textbook Controversy : కర్ణాటకలో మరో వివాదం ముదురుతోంది. కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం పాఠ్యపుస్తకాల పునఃసమీక్షకు కొంతకాలం క్రితం ఆదేశించింది. రోహిత్ చక్రతీర్థ కమిటీ ఈ ఏడాది ఆ బాధ్యతలు చేపట్టింది. 8వ తరగతి కన్నడ టెక్స్ట్​ బుక్​(Class 8 kannada Textbook)లో గతంలో విజయమాల రాసిన "బ్లడ్ గ్రూప్​" అనే పాఠం తీసేసి "కాలవను గెద్దవరు(కాలాన్ని గెలిచినవాళ్లు)"పేరిట సరికొత్త పాఠం ప్రవేశపెట్టింది. స్వయంగా అండమాన్ సెల్యూలర్ జైలును చూసొచ్చిన కేకే గట్టి.. తన అనుభవాలను వివరిస్తూ రాసిన పాఠం అది. వీడీ సావర్కర్(Vinayak Damodar Savarkar)జీవితంపై స్కూల్​ బుక్ ​లోని ఈ పాఠం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఆ టెస్ట్ బుక్ పాఠ్యాంశంలో... "అండమాన్ జైలులో ఉన్న సమయంలో సావర్కర్‌ని జైల్లోని చీకటి గదిలో ఉంచారు. గది లోపల వెనుక గోడ చాలా ఎత్తైనది. అక్కడ ఆకాశం కనపడదు, కాంతి దూరేతంటది రంధ్రం కూడా లేదు. అయితే ఎక్కడి నుంచో బుల్ బుల్ పక్షులు ఎగురుతూ సెల్ లోకి వచ్చేవి. వాటి రెక్కల‌పై కూర్చొని సావర్కర్ ప్రతిరోజూ మాతృభూమిని చుట్టి వచ్చేవారు"అని ఉంది. సావర్కర్ మీద ముద్రించిన పాఠం అబద్దాలే కాదు పిల్లల్లో మూఢనమ్మకాలు కలిగించే విధంగా ఉందని మేదావులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్నాటకలోనే కాదు దేశ వ్యాప్తంగా మేధావులు ఈ పాఠ్యాంశాన్ని తీసేయాలని డిమాండ్ చేస్తున్నారు.


  కర్నాటక పాఠ్యపుస్తకాల రివిజన్ కమిటీ అధినేత రోహిత్ చక్రతీర్థ మాత్రం ఈ పాఠాన్ని సమర్దించుకుంటున్నాడు. కావాలనే సావర్కర్ పాఠంపై కొందరు మేధావులు వివాదం సృష్టిస్తున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. తన చుట్టూ ఉన్న ప్రపంచంలో ఏమి జరుగుతుందో చూడలేని సావర్కర్, పక్షి రెక్కపై కూర్చుని మాతృభూమిని చూడడం ఒక రకమైన సాహిత్య అలంకరణ అని ఆయన అన్నారు "సావర్కర్ పక్షి రెక్కలపై కూర్చొని మాతృభూమికి వెళ్లే వాడనే వాక్యంలో, సావర్కర్ స్వయంగా పక్షి రెక్కలపై కూర్చున్నాడని అర్థం కాదు. కానీ అలా అర్దం చేసుకుంటున్న మన మేధావులు అని పిలవబడే వారిలో ఏదో లోపం ఉంది, "అని ఆయన అన్నారు.  ప్రేమకు ఒప్పుకోలేదని..నిద్రిస్తున్న యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన యువకుడు


  రాజకీయంగా కూడా ఇది తీవ్ర వివాదాస్పదమవుతోంది. వర్కర్​ అసలు స్వాతంత్ర్య సమరయోధుడే కాదని వాదించే ప్రతిపక్ష కాంగ్రెస్​ సైతం ఈ వ్యవహారంలో ప్రభుత్వాన్ని తప్పుబట్టింది. కర్ణాటక రాజకీయాలు కొంతకాలంగా సావర్కర్​ చుట్టూ తిరుగుతున్నాయి. కర్ణాటక ప్రభుత్వం ఆగస్టు 14న విడుదల చేసిన హర్ ఘర్ తిరంగా ప్రకటనలోనూ ఆయన ఫొటో ఉన్నది. తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూను మాత్రం తొలగించడం గమనార్హం. ఇటీవల సావర్కర్ ఫొటోలతో రాష్ట్రంలో ఫ్లెక్సీలు పెట్టడం, వాటిని తొలగించడం హింసకు దారితీసింది. మరోవైపు,తుమకూరు విశ్వవిద్యాలయం అంగీకరిస్తే వర్సిటీలో సావర్కర్​ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తామని ఆదివారం కర్ణాటక సీఎం బసవరాజ్​ బొమ్మై ప్రకటించారు.

  Published by:Venkaiah Naidu
  First published:

  Tags: Karnataka, Swatantraveer Savarkar

  ఉత్తమ కథలు