హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

RSS Flag : త్వరలో జాతీయ జెండాగా ఆర్ఎస్ఎస్ జెండా!

RSS Flag : త్వరలో జాతీయ జెండాగా ఆర్ఎస్ఎస్ జెండా!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

KS Eshwarappa : భవిష్యత్తులో ఏదొక రోజున త్రివర్ణ పతాకం స్థానంలో ఆర్ఎస్ఎస్ జెండా.. జాతీయ జెండాగా మారుతుందని. ఇందులో ఎలాంటి అనుమానం లేదని వ్యాఖ్యానించారు.

RSS Flag Will Become National Flag : తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచే కర్ణాటక(Karnataka)మాజీ మంత్రి, బీజేపీ నేత కేఎస్‌ ఈశ్వరప్ప వివాదాస్పద వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లోకి ఎక్కారు. భవిష్యత్తులో ఏదొక రోజున త్రివర్ణ పతాకం స్థానంలో ఆర్ఎస్ఎస్ జెండా.. జాతీయ జెండాగా మారుతుందని. ఇందులో ఎలాంటి అనుమానం లేదని వ్యాఖ్యానించారు. కాషాయ జెండా త్యాగానికి చిహ్నం అని అభివర్ణించారు. కాషాయ జెండాకు దేశంలో చాలా కాలంగా గౌరవం ఉందన్నారు. కాషాయం పట్ల గౌరవం నిన్ననో, ఈరోజునో మొదలైంది కాదు వేల ఏండ్ల చరిత్ర ఉందని ఈశ్వరప్ప తెలిపారు. కాషాయ జెండా స్ఫూర్తి తమలోనూ నిండాలని ఆర్ఎస్ఎస్ లో ప్రార్థిస్తుంటామని వెల్లడించారు.

"వాళ్లు (కాంగ్రెస్) చెప్పినప్పుడల్లా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాల్సిన అవసరం లేదనుకుంటున్నాం. రాజ్యాంగం ప్రకారం త్రివర్ణ పతాకం మన జాతీయ జెండా. కాబట్టి త్రివర్ణ పతాకానికి ఇవ్వాల్సిన మేర గౌరవం ఇస్తాం" అని ఈశ్వరప్ప వివరించారు. పాఠశాల పుస్తకాల్లో ఆర్‌ఎస్‌ఎస్ వ్యవస్థాపకుడు కెబి హెగ్డేవార్ ప్రసంగాన్ని చేర్చడంపై దుమారం రేగుతున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు, కెబి హెగ్డేవార్ ప్రసంగంతో కూడిన పాఠాన్ని చేర్చడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తున్న వ్యక్తులను తీవ్రంగా విమర్శించారు కేఎస్ ఈశ్వరప్ప, ఈశ్వరప్ప గతంలో కూడా జాతీయ జెండా విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలోని ఎర్రకోటతో పాటు దేశంలోని అన్ని ప్రాంతాల్లో కాషాయ జెండా ఎగురవేస్తామని ఫిబ్రవరి 9న ఓ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఇటీవల ఓ కాంట్రాక్టరు మరణం నేపథ్యంలో అవినీతి ఆరోపణలపై ఈశ్వరప్ప కర్ణాటక మంత్రివర్గం నుంచి వైదొలిగారు.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Karnataka, Karnataka bjp, National flag, RSS

ఉత్తమ కథలు