కర్ణాటక కాంగ్రెస్ ట్రబుల్ షూటర్, మాజీ మంత్రి డీకే శివకుమార్ అరెస్టు వెనుక మాజీ సీఎం సీద్ధరామయ్యే కారణమని ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ నళిన్ కుమార్ కతీల్ బాంబు పేల్చాడు. ఇటీవల బాగల్ కోట్ లో పర్యటించిన నళిన్ కుమార్ సిద్ధరామయ్యను టార్గెట్ చేశారు. డీకే శివకుమార్ అరెస్టు వెనుక మాజీ సీఎం సిద్ధరామయ్య హస్తం ఉందని, పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ శివకుమార్ ఎదుగుదల చూసిన ఓర్వలేకనే ఇరికించి ఉంటారని నళిన్ కుమార్ ఆరోపించారు. అంతేకాదు శివకుమార్ గత ప్రభుత్వంలో కీలక భూమిక వహించడం ద్వారా ఆయన ప్రభ పెరిగితే పార్టీలో తన పరపతి తగ్గుతుందనే ఉద్దేశ్యంతోనే సిద్ధరామయ్య కుట్ర పన్ని ఉంటారని నళిన్ కుమార్ ఆరోపించారు. ఇదిలా ఉంటే మనీలాండరింగ్ కేసులో సెప్టెంబర్ 3న డీకే శివకుమార్‌ను ఎన్‌ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ అధికారులు అరెస్టు చేయగా, ఆయనకు ఈ నెల 13 వరకూ కస్టడీ విధిస్తూ న్యాయస్థానం నిర్ణయించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Dk shivakumar, Karnataka, Siddaramaiah