అసెంబ్లీలో ఓ అత్యాచార ఘటనకు సంబంధించి వాడీవేడీ చర్చ జరుగుతుంది. మాజీ ముఖ్యమంత్రి ఆ కేసుకు సంబంధించి పోలీసుల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. సరిగా అదే సమయంలో ఆ మాజీ ముఖ్యమంత్రి వద్దకు వచ్చిన ముఖ్య నేత ఒకరు చెవిలో మీ పంచె జారిపోతోందని చెప్పారు. దీంతో ఆయన అసలు విషయాన్ని గ్రహించి కూర్చీలో కూర్చుండిపోయారు. అనంతరం ఇది అసెంబ్లీలో నవ్వులు పూయించింది. కర్ణాటక అసెంబ్లీలో(Karnataka Assembly) చోటుచేసుకన్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. అసెంబ్లీలో బుధవారం మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సిద్దరామయ్య(former chief minister Siddaramaiah) తన ప్రసంగం కొనసాగిస్తున్నారు. మైసూర్‌లో ఇటీవల జరిగిన అత్యాచార ఘటనపై ఆయన మాట్లాడుతున్నారు. అయితే ఆ సమయంలో సిద్ధరామయ్య ధోతి జారిపోయింది(Siddaramaiah's Dhoti Slips). ఇది గమనించిన కాంగ్రెస్ నేత డీకే శివకుమార్(DK Shivakumar) వెంటనే ఆయన వద్దకు చేరుకున్నారు. ఆయన చెవిలో ఆ విషయం చెప్పాడు. దీంతో సిద్దరామయ్య స్పందిస్తూ.. అయ్యో అవునా అని జాగ్రత్త పడ్డారు. తన ధోతిని సరిచేసుకున్న తర్వాత ప్రసంగాన్ని కొనసాగిస్తానని అసెంబ్లీలో చెప్పారు. వెంటనే తన సీటులో కూర్చుండిపోయారు.
సిద్ధరామయ్య ఆ మాట అనగానే స్పీకర్ స్థానంలో ఉన్న కుమార్ బంగారప్ప స్పందిస్తూ.. ‘సమస్య ఏంటో మీరే చెబితే వినడానికి బాగుంటుంది’ అన్నారు. ఆ తర్వాత ధోతీ బిగించి కట్టుకున్న సిద్ధరామయ్య లేచి మాట్లాడుతూ.. కరోనా నుంచి కోలుకున్న తర్వాత నాలుగైదు కిలోల బరువు పెరిగానని, దీంతో పొట్టపరిమాణం పెరగడంతో పంచె జారిపోతోందని చమత్కారంగా చెప్పారు.
பாவம்யா...
வேஷ்டி அவுந்ததுகூட தெரியாம சின்சியரா பேசுறாரு
காங்கிரஸ் #சித்தராமையா#Siddaramaiah
??
தமிழ் மீடியாக்கள் பிஜேபிக்காரன் வேஷ்டி அவுந்தா மட்டுந்தான் வாய் போடுவான்.??
pic.twitter.com/2stj9MUoZ9
— S R ? (@Scorpion1033) September 23, 2021
దీనిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ కేఆర్ రమేష్ కుమార్(KR Ramesh Kumar) సరదాగా స్పందిస్తూ.. ‘సిద్దరామయ్య ఇమేజ్‌ను, మా పార్టీ ఇమేజ్‌ను కాపాడటం కోసం మా అధ్యక్షుడు డీకే శివకుమార్ చెవిలో గుసగుసలాడారు. కానీ సిద్దరామయ్య దానిని మొత్తం సభలో చెప్పారు. దీంతో బీజేపీకి చెందిన వ్యక్తులు మా ఇమేజ్‌ను దెబ్బతీయడానికి వేచి చూస్తున్నారు’అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన సిద్దరామయ్య.. బీజేపీ వాళ్లు ఎంత ప్రయత్నించిన తమ ఇమేజ్‌ను ఏమీ చేయలేదని చెప్పారు. ఈ ఘటనతో కొద్దిసేపు సభలో నవ్వుల పూసాయి. స్పీకర్ స్థానంలో ఉన్న కుమార్ బంగారప్ప మాత్రం నవ్వును ఆపుకోలేకపోయారు.
కొత్తగా పెళ్లైన జంట ఉండేందుకు ఇళ్లు చూపించిన బంధువు.. అతడు ఇలా చేస్తాడని వాళ్లు ఊహించలేకపోయారు..
ఇక, ఆగస్టు 24న మైసూర్లో చాముండి హిల్స్ సమీపంలో కాలేజ్ విద్యార్థిపై ఆరుగురు సాముహిక అత్యాచారానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఆమె స్నేహితుడిపై కూడా దాడి చేశారు. ఈ అత్యాచార ఘటనకు సంబంధించి పోలీసులు, రాష్ట్ర ప్రభుత్వంపై అసెంబ్లీ వేదికగా సిద్దరామయ్య తీవ్రంగా మండిపడ్డారు. వారు ఘోరంగా విఫలమయ్యారని చెప్పారు. దర్యాప్తు సీరియస్ సాగకపోవడం చాలా బాధకరమని అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Dk shivakumar, Karnataka, Siddaramaiah