కర్నాటకలో ఘోర రోడ్డు ప్రమాదం (Karnataka Road Accident) జరిగింది. అతివేగంతో అదుపుతప్పిన ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 9 మంది మరణించారు. మరో 24 మందికి గాయాలయ్యాయి. హుబ్లి శివారులోని హైవేపై అర్ధరాత్రి తర్వాత ఈ ఘటన (Hubli Accident) చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో బస్సు .. మహారాష్ట్రలోని కొల్హాపూర్ నుంచి బెంగళూరుకు వెళ్తోంది. లారీ ధార్వాడ వైపు వెళ్తోంది. ఐతే బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ముందు వెళ్తున్న ట్రాక్టర్ని ఓవర్ టేక్ చేసే క్రమంలోనే.. ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టిందని చెప్పారు. అర్ధరాత్రి 12.30-1.00 సమయంలో ప్రమాదం జరిగిందని వెల్లడించారు.
Horrible accident claims 8lives in Hubli, Karnataka on monday night. A Private Bus and goods Lorry collided NH4(outskirts)of Hubli. More than 15 injured. #Karnataka pic.twitter.com/iLu1NtHkd3
— Bharathirajan (@bharathircc) May 24, 2022
ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. లారీ, బస్సు డ్రైవర్లు స్పాట్లోనే మరణించారు. గాయపడిన వారిని హుబ్లిలోని కిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రెండు వాహనాలు ముందు భాగాలు నుజ్జునుజ్జయ్యాయి. మృతుల్లో ఎక్కువ మంది మహారాష్ట్ర వారే ఉన్నారు. వారంతా బెంగళూరుకు వెళ్లాల్సి ఉంది. కానీ అంతలోనే ఘోరం జరిగింది. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. దీనిని బట్టి మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశముంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Karnataka, Road accident