హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Terrorists Arrest: పాకిస్తాన్ నుంచి తెలంగాణకు బాంబులు.. నలుగురు ఉగ్రవాదులు అరెస్ట్..

Terrorists Arrest: పాకిస్తాన్ నుంచి తెలంగాణకు బాంబులు.. నలుగురు ఉగ్రవాదులు అరెస్ట్..

బాంబులు దొరికిన వాహనం ఇదే

బాంబులు దొరికిన వాహనం ఇదే

Terrorists Arrest: పాకిస్తాన్ నుంచి డ్రోన్ల సాయంతో పంపిన పేలుడు పదార్థాలను పంజాబ్ సరిహద్దులో అందుకొని.. అక్కడి నుంచి హర్యానా మీదుగా మహారాష్ట్రలోని నాందేడ్, ఆ తర్వాత తెలంగాణలోని ఆదిలాబాద్‌కు తరలించాలన్నది వారి ప్లాన్.! కానీ అంతలోనే పోలీసులకు దొరికిపోయారు.

ఇంకా చదవండి ...

దేశంలో భారీ ఉగ్రకుట్రను హర్యానా పోలీసులు భగ్నం చేశారు. కర్నాల్ జిల్లాలో నలుగురు అనుమానిత ఐఎస్ఐ-ఖలిస్థానీ ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి పెద్ద మొత్తంలో పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఉగ్రవాదులు బాంబులు, బుల్లెట్లు, గన్‌పౌడర్‌లను తరలిస్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న గన్ పౌడర్ ఆర్డీఎక్స్ అయి ఉండవచ్చని పేర్కొన్నారు. పాకిస్తాన్ నుంచి డ్రోన్ల సాయంతో పంపిన పేలుడు పదార్థాలను పంజాబ్ సరిహద్దులో అందుకొని.. అక్కడి నుంచి హర్యానా మీదుగా మహారాష్ట్రలోని నాందేడ్, ఆ తర్వాత తెలంగాణలోని ఆదిలాబాద్‌కు తరలించాలన్నది వారి ప్లాన్.! కానీ అంతలోనే పోలీసులకు దొరికిపోయారు. ఐబీతో పాటు తెలంగాణ, పంజాబ్, హర్యానా పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేసి ఈ ఉగ్రముఠా గుట్టును రట్టుచేశారు.

రైల్లో రామాయణ యాత్ర.. ఇండియాతో పాటు నేపాల్.. 18 రోజుల ట్రిప్.. ధర ఎంతంటే?

కొందరు వ్యక్తులు పేలుడు పదార్థాలను తరలిస్తున్నట్లు ఐబీ నుంచి స్పష్టమైన సమాచారం రావవడంతో.. గురువారం తెల్లవారుజామున 4 గంటలకు బస్తార టోల్‌ప్లాజా వద్ద పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే అటుగా ఓ ఇన్నోవా వాహనం వచ్చింది. ఆ కారులో ఉన్న వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో.. వెంటనే వారిని కిందకు దించారు. అదనంతరం కారులో తనిఖీ చేయగా.. పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు లభించాయి. అనంతరం ఆ వాహనాన్ని సీజ్ చేసి..వారి వద్ద నుంచి మూడు ఐఈడీ బాంబులు, .30 క్యాలిబర్ పిస్టల్‌తో పాటు ఇతర పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. అరెస్టైన వారి పేర్లను గుర్‌ప్రీత్, పర్మీందర్, అమన్‌దీప్, భూపేంద్రగా పోలీసులు పేర్కొన్నారు. ఈ నలుగురు ఫిరోజ్‌పూర్ నుంచి నాందేడ్‌కు పేలుడు పదార్థాలను తీసుకెళ్తున్నట్లు వెల్లడించారు. ఈ నలుగురికి ఖలీస్తాన్ ఉగ్రవాది బబ్బర్ ఖల్సాతో సంబంధాలు ఉన్నాయి.

పెళ్లిలో మందు కొట్టాడు.. కాసేపటికే కంటిచూపు పోయి.. గుడ్డివాడయ్యాడు.. ఏం జరిగింది?

నలుగురు నిందితులు పాకిస్తాన్‌లోని ఓ వ్యక్తితో టచ్‌లో ఉన్నట్లు కర్నాల్ ఎస్పీ వెల్లడించారు. తెలంగాణలోని ఆదిలాబాద్‌కు బాంబులను చేరవేయాల్సిందిగా అతడు ఆదేశించాడు. ఈ వ్యక్తి ఆదేశాల ప్రకారం వీరు నడుచుకున్నారు. పాకిస్తాన్ నుంచి అంతర్జాతీయ సరిహద్దు మీదుగా పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌కు డ్రోన్ల ద్వారా పేలుడు పదార్థాలను తరలిచారు. అక్కడ ఈ నలుగురు వాటిని తీసుకొని, ఇన్నోవా వాహనంలో మహారాష్ట్రలోని నాందేేడ్‌కు తరలిస్తున్నారు. అక్కడి నుంచి ఆదిలాబాద్‌లోని ఓ ప్రాంతానికి చేరవేయాలని అనుకున్నారు. ఈ క్రమంలోనే కర్నాల్ వద్ద వారిని అరెస్ట్ చేసినట్లు హర్యానా పోలీసులు పేర్కొన్నారు.

నలుగురు వ్యక్తులు పేలుడు పదార్థాలతో పట్టుబడ్డారని హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ తెలిపారు. హర్యానా మీదుగా వెళ్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారని వెల్లడించారు. విచారణలో మరిన్ని వివరాలు బయటకొస్తాయని పేర్కొన్నారు.

కాగా, ఇటీవల పంజాబ్‌లో నెలకొన్న పరిణామాల నేపథ్యంలో ఖలిస్తాన్ ఉగ్రవాదులు పాకిస్తాన్ ఐఎస్ఐతో చేతులు కలిపారని నిఘా సంస్థలు హెచ్చరించాయి. ఐఎస్ఐ సహకారంతో భారత్‌లోని పలుప్రాంతాలో పేలుడు జరిపి, విధ్వంసం చేసేందుకు ఖలిస్తాన్ ఉగ్రవాదులు కుట్రపన్నారని పేర్కొన్నాయి. వారు ఇచ్చిన సమాచారంతోనే తాజాగా నలుగురు ఉగ్రవాదులను పోలీసులు అరెస్ట్ చేశారు.

First published:

Tags: Haryana, Punjab, Telangana, Terrorists

ఉత్తమ కథలు