Home /News /national /

KARKARI SWARNAMUKHI RIVER GOLD PARTICLES FLOWS IN THIS INDIAN MYSTERIOUS RIVER KNOW INTERESTING DETAILS HERE SK

Gold River: గోల్డ్ రివర్.. ఈ నదిలో బంగారం ప్రవహిస్తుంది.. ఎక్కడో కాదు.. మన ఇండియాలోనే ఉంది

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Gold River: స్వర్ణరేఖ నది పరివాహక ప్రాంతాల్లో నివసించే ఆదివాసీలు నది నుంచి బంగారం రేణువులను వెలికితీస్తారు. నదిలోని ఇసుకను ఫిల్టర్ చేసి.. ఒక్కొక్కటిగా సేకరిస్తారు.

    మన దేశం ఎన్నో నదులకు పుట్టినిల్లు. ఒక్కో నదికి ఒక్కో ప్రత్యేకత.. చరిత్ర ఉంది. ఈ నదులపైనే ఆధారపడి కోట్లాది మంది జీవిస్తున్నారు. నదుల్లో ప్రవహించే నీటితో  వ్యవసాయం చేస్తూ ప్రజలు జీవనం సాగిస్తున్నారు. మరికొందరు చేపలు పట్టుకొని బతుకు బండి లాగుతున్నారు. మనకు తెలిసి.. నదుల వల్ల మనకు కలిగే ప్రధాన ప్రయోజనాలు ఇవే. కానీ మనదేశంలో ఓ నది ఉంది. ఇది మిగతా వాటితో పోల్చితే పూర్తి భిన్నమైనది. అది సాగు నీరు, చేపలు మాత్రమే కాదు.. బంగారాన్ని కూడా మోసుకొస్తోంది. ఏన్నో ఏళ్లుగా ఇక్కడి నుంచి బంగారం వెలికితీస్తూ ప్రజలు జీవనం సాగిస్తున్నారు. అవునా..? బంగారాన్ని తీసుకొచ్చే నది (Gold River) ఉందా? అది కూడా ఇండియాలోనా? అని ఆశ్చర్యపోకండి. నిజంగానే అలాంటి నది మనదేశంలో ఉంది. అదే సుబర్ణరేఖ నది. దీనినే స్వర్ణరేఖ (Swarnarekha River) అని కూడా పిలుస్తారు.

    OMG:10ఏళ్ల వయసున్న పిల్లలు ఇంట్లోంచి 4లక్షలు ఎత్తుకెళ్లారు..ఎందుకు ఖర్చు చేశారో తెలుసా

    ఝార్ఖండ్‌ (Jharkhand)లోని రత్నగర్భ ప్రాంతంలో స్వర్ణ రేఖ (Subarnarekha River) అనే నది ప్రవహిస్తుంది. ఈ నది నుంచి స్థానికులు బంగారాన్ని తీస్తారు. ఇది ఝర్ఖండ్‌తో పాటు పశ్చిమ బెంగాల్, ఒడిశాలోని కొన్ని ప్రాంతాలలో కూడా ప్రవహిస్తుంది. స్వర్ణరేఖ అంటే బంగారపు గీత అని అర్ధం. పేరులో ఉన్నట్లుగానే.. ఈ నదిలో బంగారం ప్రవహిస్తుంది. స్వర్ణ రేఖ నది నైరుతి దిశలో ఉన్న నాగ్డి గ్రామంలోని రాణి చువాన్ అనే ప్రదేశంలో జన్మించి.. ఝార్ఖండ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ మీదుగా ప్రవహించి.. చివరకు బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ నది మొత్తం పొడవు 474 కి.మీ ఐతే స్వర్ణరేఖతో పాటు దాని ఉపపది కర్కారి (Karkari River)లో బంగారు రేణువులు కనిపిస్తాయి. కర్కారి నదిలో ప్రవహించిన తర్వాత.. స్వర్ణరేఖ నదికి బంగారం రేణువులు చేరుతాయని ఇక్కడి ప్రజలు నమ్ముతారు. కర్కారి నది పొడవు 37 కి.మీ. ఉంటుంది. అసలు ఈ రెండు నదుల్లోకి బంగారు రేణువులు ఎక్కడి నుంచి వస్తున్నాయనేది ఇప్పకిటీ మిస్టరీగానే మిగిలిపోయింది. శాస్త్రవేత్తలు కూడా తేల్చలేకపోయారు

    Video Viral:డ్రైవింగ్‌ రాకపోవడమా లేక సూసైడ్‌ అటెంప్టా ..ఈ వీడియో చూసి చెప్పండి

    స్వర్ణరేఖ నది పరివాహక ప్రాంతాల్లో నివసించే ఆదివాసీలు నది నుంచి బంగారం రేణువులను వెలికితీస్తారు. నదిలోని ఇసుకను ఫిల్టర్ చేసి.. ఒక్కొక్కటిగా సేకరిస్తారు. ఐతే మరీ ఎక్కువగా దొరకవు. ఒక వ్యక్తి ఒక నెలలో  70 నుంచి 80 బంగారు రేణువులను సేకరిస్తారు. ఈ బంగారు రేణువుల పరిమాణం బియ్యం గింజంత సైజులో కూడా ఉంటాయి. ముఖ్యంగా వర్షాకాలం, శీతాకాలంలో ఇక్కడి గిరిజనులు.. నది మొత్తాన్ని జల్లెడ పడతారు. బంగారం రేణువులను దక్కించుకునేందుకు ఎంతో కష్టపడతారు. రోజంతా వెతికినా... ఒక్కోసారి ఒక్క బంగారం రేణువు కూడా దొరకదు. అలాంటప్పుడు ఒట్టి చేతులతోనే ఇంటికి వెళ్లాలి. బంగారం నది పక్కనే ఉన్నా.. ఇక్కడ ప్రజలు స్థితిగతులు ఏమీ మారలేదు. చాలా మంది నెల ఆదాయం రూ.10 వేల లోపే ఉంటుంది. ఇలా బంగారం రేణువులను సేకరించి.. వాటిని పట్టణానికి తీసుకెళ్లి విక్రయిస్తుంటారు. వ్యాపారులు వీరి వద్ద నుంచి తక్కువ ధరకే కొనుగోలు చేస్తుంటారు. అనంతరం వాటిని ప్రాసెస్ చేసి అధిక ధరకు విక్రయిస్తారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Jharkhand, Trending, Trending news, VIRAL NEWS

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు