1999 జులై 26న తొలి కార్గిల్ విజయ్ దినోత్సవం(Kargil Vijay Diwas) జరిగింది. అప్పటి నుంచీ ప్రతీ సంవత్సరం ఈ దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈ విజయం వెనుక ఎంతో మంది సైనికుల ప్రాణ త్యాగం ఉంది. తమ ప్రాణాలను అడ్డుపెట్టి మన దేశాన్ని రక్షించడమే కాదు.. పాక్ కుట్రలను సమర్థవంతంగా తిప్పికొట్టారు. అంతర్జాతీయ స్థాయిలో పాక్ ను ఏకాకి చేశారు. పాకిస్థాన్(Pakistan) వక్రబుద్ధిని భారత వీరులు విజయవంతంగా తిప్పి కొట్టారు. దాయాది దేశం పాకిస్తాన్ కన్ను ఎప్పుడూ భారత్ పైనే.. ముఖ్యంగా కశ్మీర్(Kashmir) మీదే ఉంటుంది. ఏదో ఒక వంకతో స్థానిక యువతను రెచ్చగొడుతూ దేశంలో అలజడి సృష్టిస్తూనే ఉంటుంది. అలాంటి ప్రయత్నమే 1999లో కూడా చేసింది. అందుకు ఉగ్రవాదులతో పాక్ ఆర్మీ చేతులు కలిపింది. సహాజ నిబంధనలు ఉల్లంఘించి నియంత్రణ రేఖ దాటి వచ్చి మన ఆర్మీపై దాడికి తెగబడింది. ఇండియన్ ఆర్మీ ధీటుగా స్పందించింది. ఆపరేషన్ విజయ్ పేరుతో పాక్‌కు బుద్ధి చెప్పింది.
ఇంతకీ ఆ యుద్ధం ఎలా జరిగింది..?
తాశి నామ్ గ్యాల్ అనే వ్యక్తి.. తన గొర్రెలను మేపేందుకు పర్వత లోయల్లోకి వెళ్లాడు. అయితే అక్కడ జనసంచారం ఉందని తాశి నామ్‌గ్యాల్. వెంటనే గుర్తించాడు. అలాగే ఆ ప్రాంతంలో పఠాన్ దుస్తుల్లో కొందరు వ్యక్తులు రాళ్లతో మంచులో ఏదో పని చేస్తుండటం చూశాడు. అనుమానం వచ్చి క్షుణ్ణంగా చూస్తే వారి దుస్తుల్లో ఆయుధాలు కనిపించాయి. క్షణం ఆలస్యం చేయకుండా భారత ఆర్మీకి విషయం చేరవేశాడు నామ్‌గ్యాల్. నామ్‌గ్యాల్ ఇచ్చిన సమాచారంతో పర్వతాల్లోకి వెళ్లిన ఇండియన్ ఆర్మీ ట్రూప్‌పై అనుమానిత వ్యక్తులు దాడి చేశారు. ఐదుగురు భారత సైనికులను పట్టుకుని అత్యంత క్రూరంగా హత్య చేశారు. ఊహించని విధంగా జరిగిన దాడితో భారత ఆర్మీ మొదటి తీవ్రంగా నష్టపోయింది. పాక్ దళాల సాయంతో టెర్రరిస్టులు చేసిన దాడిలో కార్గిల్ ఆయుధగారం ధ్వంసమైంది. మన ఆర్మీ తేరుకునే లోపే ద్రాస్, కక్సర్, ముస్తో సెక్టార్లలో శత్రువులు తిష్ట వేశారనే సమాచారం అందింది.
దొంగచాటుగా పాక్ ఆర్మీ కొండల పైకి చేరుకుని బంకర్లు నిర్మించుకోవడంతో ఈ పోరాటంలో తొలుత భారత సైనికులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. పై నుంచి పాక్ సైనికులు, టెర్రరిస్టులు తేలికగా దాడి చేస్తూ తూటాలు, బాంబుల వర్షం కురిసిస్తుండగా.. వాటిని కాచుకుంటూ మన సైనికులు వీరోచితంగా పోరాటం చేయాల్సి వచ్చింది. మే 26న వాయుసేన రంగంలోకి దించింది ఇండియా ప్రభుత్వం. మొదటి వారంలోనే రెండు మిగ్ విమానాలు, ఒక ఆర్మీ హెలికాప్టర్లను మన ఆర్మీ నష్టపోయింది. రోజులు గడుస్తున్నా... రణ క్షేత్రంలో భారత దళాలలకు పట్టు దొరకడం లేదు. దాడి చేస్తున్నది పాకిస్తానే అని తెలిసినా సరైన ఆధారాలు లభించడం లేదు.
కార్గిల్ చొరబాటులో కీలకమైన ప్రాంతం టైగర్ హిల్స్. వాటిపై తిష్ట వేసిన పాక్ దళాలు భౌగోళిక పరిస్థితులు ఆసరాగా చేసుకుని దాడులకు తెగబడుతున్నాయి. భారత దళాలు జూన్ 29న టైగర్ హిల్స్ పర్వత పాదాల వద్దకు చేరుకున్నాయి. యుద్ధంలో కీలక ఘట్టం మొదలైంది. వారం రోజుల పాటు హోరాహోరీ పోరు జరిగింది. జులై 4వ తేదిన కీలకమైన టైగర్ హిల్స్‌ని భారత్ స్వాధీనం చేసుకుంది. దీంతో పాక్ ఆర్మీకి దిక్కు తోచని పరిస్థితి ఎదురైంది. తెలుగు వాడైన మేజర్ పద్మఫణి ఆచార్య ఈ యుద్ధ క్షేత్రంలోనే అమరులయ్యారు. కార్గిల్ చొరబాటులో కీలకమైన ప్రాంతం టైగర్ హిల్స్. వాటిపై తిష్ట వేసిన పాక్ దళాలు భౌగోళిక పరిస్థితులు ఆసరాగా చేసుకుని దాడులకు తెగబడుతున్నాయి. భారత దళాలు జూన్ 29న టైగర్ హిల్స్ పర్వత పాదాల వద్దకు చేరుకున్నాయి. యుద్ధంలో కీలక ఘట్టం మొదలైంది. వారం రోజుల పాటు హోరాహోరీ పోరు జరిగింది. జులై 4వ తేదిన కీలకమైన టైగర్ హిల్స్‌ని భారత్ స్వాధీనం చేసుకుంది. దీంతో పాక్ ఆర్మీకి దిక్కు తోచని పరిస్థితి ఎదురైంది. తెలుగు వాడైన మేజర్ పద్మఫణి ఆచార్య ఈ యుద్ధ క్షేత్రంలోనే అమరులయ్యారు.
టైగర్ హిల్స్ పైకి చేరిన తరువాత.. భారత దళాలకు ఎదురే లేకుండా పోయింది. నియంత్రణ రేఖ దాటి చొరబాటు దారులు ఆక్రమించుకున్న స్థలాలను వేగంగా తిరిగి స్వాధీనం చేసుకున్నారు. అప్పటికే ఇటు రణక్షేత్రం, అటు అంతర్జాతీయ సమాజంలో పాకిస్తాన్ ఏకాకిగా నిలిచింది. ముషారఫ్ కుట్రలు, కుతంత్రాలు పారలేదు. అతని అండతో అతిక్రమణకు పాల్పడిన ఆర్మీ, టెర్రరిస్టులు తోక ముడిచారు. జులై 14 నాటికి అన్ని శత్రు మూకలను తరిమి కొట్టారు. పాక్‌తో చర్చల అనంతరం జులై 26న అధికారికంగా యుద్ధాన్ని ముగిసినట్టు భారత ప్రభుత్వం ప్రకటించింది. పాకిస్తాన్లో ప్రధానులెక్కువగా కీలుబొమ్మలే అయ్యారు. ఆర్మీ అధికారులే నిజమైన అధికారం చెలాయించారు. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌కి చెప్పకుండా అప్పటీ ఆర్మీ చీఫ్ జనరల్ పర్వేజ్ ముషారఫ్ కశ్మీర్‌పై కుయుక్తి పన్నాడు. దొంగచాటుకా భారత భూభాగంలోకి తన సైన్యాన్ని పంపించాడు.
Draupadi Murmu : మన రాష్ట్రపతి అసలు పేరు ద్రౌపది ముర్ము కాదు..ఆ పేరు ఎలా వచ్చిందంటే
దేశంలోనే తొలిసారి.. కరోనాతో చనిపోయిన వారిని ఈ రూపంలో చూసుకోవచ్చు.. ఎక్కడంటే..
హిమాలయాల్లో దట్టంగా మంచు పేరుకుపోయే కాలంలో పర్వత శ్రేణుల నుంచి ఇరు దేశాల భద్రతా దళాలు వెనక్కి వస్తాయి. చాన్నాళ్లుగా ఇదే పద్దతి అమలవుతోంది. అయితే దీన్ని తుంగలో తొక్కి భారత దళాలు గస్తీలో లేని సమయం చూసి ముషారఫ్ ఆదేశాలతో పాక్ ఆర్మీతో కూడిన టెర్రరిస్టు మూకలు పాక్ గుండా భారత భూభాగంలో అడుగుపెట్టి కీలక స్థావరాలను ఆక్రమించుకున్నారు. ఫలితంగా యుద్ధం అనివార్యమైంది. దాదాపు రెండు నెలల పాటు కొనసాగిన ఈ యుద్ధంలో భారత్ వైపు 527 మంది జవాన్లు అమరులయ్యారు. పాకిస్తాన్ వైపు 453 మంది వరకు చనిపోయినట్టు సమాచారం. ఈ చొరబాట్లలో పాకిస్తాన్‌కి చెందిన స్పెషల్ సర్వీసెస్ గ్రూప్, నార్తర్న్ లైట్‌ఇన్‌ఫాంట్రీ చెందిన సైనికులు పాల్గొన్నట్టు తేలింది. వీరికి కశ్మీరీ తీవ్రవాదులు, ఆఫ్ఘానిస్థాన్‌కి చెందిన కిరాయి మూకలు సహాకరించినట్టు తేలింది.
కార్గిల్ విజయ దినోత్సవాన్ని ప్రతీ ఏటా జూలై 26న దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. దేశవ్యాప్తంగా వివిధ ప్రదేశాలలో ప్రజలు సైతం సైనికుల త్యాగాలకు గుర్తుగా క్యాండిల్స్ వెలిగించి నివాళులు అర్పించడం ఆనవాయితీగా వస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Kargil Vijay Diwas