కాన్పూర్ సుగంధ ద్రవ్యాల వ్యాపారి కేసు (Kanpur IT raid) దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు, కేజీల కొద్ది బంగారం బయటపడడంతో అందరూ దీని గురించే చర్చించుకుంటున్నారు. ఆ డబ్బును లెక్కల పెట్టడానికి అధికారుల తల ప్రాణం తోకకొచ్చింది. ఐతే ఈ కేసులో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. కాన్పూర్‌కు చెందిన పీయుష్ జైన్ (Piyush Jain) అనే సుగంధ ద్రవ్యాల వ్యాపారి ఇంట్లో పెద్ద మొత్తంలో అక్రమాస్తులు బయటపడ్డాయి. ఆయన నివాసంతో పాటు ఫ్యాక్టరీల నుంచి ఇప్పటి వరకు రూ.200 కోట్ల నగదు, 23 కేజీల బంగారం, 600 కేజీల గంధం తైలం స్వాధీనం చేసున్నారు ఐటీ అధికారులు. దాదాపు 120 గంటలు తర్వాత వాటి లెక్క తేలింది.
టీవీ సీరియల్లో మునిగిపోయిన మహిళలు.. అదే టైమ్‌లో దొంగల ఎంట్రీ.. రూ.19 లక్షలు చోరీ
పీయుష్ జైన్ ఎవరు?
పీయుష్ పూర్వీకులు ఎన్నో తరాలుగా కన్నోజ్లో నివసించారు. కానీ పీయుష్ మాత్రం కాన్పూర్‌లో సెటిలయ్యారు. పెద్ద బంగళా, కోట్లు కురిపించే వ్యాపారం ఉన్నప్పటికీ.. పీయుష్ జైన్ చాలా సాదాసీదా జీవితాన్ని గడుపుతున్నారు. విలాసవంతమైన కార్లు కొనే స్తోమత ఉన్నా.. ఆయన మాత్రం పాత స్కూటర్‌పైనే ప్రయాణించేవాడు. తాను వ్యాపారంలోకి దిగేటప్పుడు ఆ స్కూటర్‌పైనే తిరిగేవాడు. అందుకే సెంటిమెంట్‌గా భావించి.. ఇప్పుడు కూడా దానినే వాడుతున్నాడు. పీయుష్ జైన్ చాలా సింపుల్ ఉంటారు. పెళ్లిళ్లకు లేదా మరేదైనా కార్యక్రమాలకు వెళ్లినా.. పైజామాలు, రబ్బరు చెప్పులు ధరించి వెళ్లేవారు. ఎంతో డబ్బు ఉన్నప్పటికీ.. ఆయన అలా కనిపించే వారు. చాలా సాధారణమైన మనిషిలా ఉండేవారు. ఖరీదైన వాహనాలకు బదులు పాత వాహనాలను నడపడానికే ప్రాధాన్యత ఇచ్చేవారని తెలిసిన వారు చెబుతున్నారు.
నన్ను పెళ్లి చేసుకో ప్లీజ్.. వెంట పడిన యువతి.. అతడు వినలేదు.. తిక్కరేగి ఆమె ఏం చేసిందంటే..
చదువులో మేటి
పీయూష్ జైన్ చదువుల్లో కూడా నెంబర్ వన్. ఐఐటీ నుంచి ఎస్ఎస్సీ వరకు టాపర్‌గా ఉన్నారు. హోమియోపతిలో కూడా ఆయనకు మంచి పరిజ్ఞానం ఉందని చెబుతున్నారు. జిల్లాలోని చుపట్టి ప్రాంతంలో పీయూష్ జైన్‌కు ఇల్లు ఉంది. దీనికి కూతవేటు దూరంలో ఇంటి వెనుక 3 ఇళ్లు, పెద్ద గోదాం నిర్మించారు. అక్కడ రసాయనాలతో పలు రకాల సుగంధ ద్రవ్యాలు తయారు చేస్తున్నారు. పీయూష్ తండ్రి మహేష్ చంద్ర జైన్ వృత్తిరీత్యా రసాయన శాస్త్రవేత్త అని జనాలు అంటున్నారు. మహేష్ భార్య రెండేళ్ల క్రితం మరణించారు. సుగంధ ద్రవ్యాలు, ఆహార పదార్థాలకు కలిపే ఎసెన్స్‌లను ఎలా తయారు చేయాలో మహేష్ నుంచి ఆయన కుమారులు పీయుష్, అంబరీష్ నేర్చుకున్నారు.
గత 15 ఏళ్లలో పీయుష్ కుటుంబ ఆర్థిక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అంతకు ముందు జైన్ స్ట్రీట్‌లో ఉన్న ఇంట్లో కొద్ది భాగం మాత్రమే ఆ కుటుంబానికి ఉండేది. ఆ తర్వాత ఆర్థికంగా బాగా నిలదొక్కుకోవడంతో.. తన ఇంటి సమీపంలో రెండు ఇళ్లు కొని వాటిని ఒకటిగా చేశారు. దాదాపు 700 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న ఈ ఇంటిని నిర్మించేందుకు జైపూర్ నుంచి కళాకారులను పిలిపించినట్లు సమాచారం. మందపాటి గోడలు, ఖరీదైన ఎయిర్ కండీషనర్లు, బాల్కనీలు, స్టీల్ తలుపులతో చాలా అద్భుతంగా ఇంటిని నిర్మించకున్నారు పీయుష్. ఇంత భారీ వ్యాపారం, రిస్క్ ఉన్నా ఇంటి బయటి భాగంలో ఒక్క సీసీ కెమెరా కూడా అక్కడ ఉండదు. ఒక్క బాల్కనీ తప్ప మిగతా ఇళ్లకు ఏమీ కనిపించని విధంగా ఇల్లును కట్టుకున్నారు.
Omicron Tension: మెట్రో, సిటీ బస్సుల్లో కొత్త రూల్స్.. మళ్లీ కఠిన ఆంక్షలు
చుట్టుపక్కల వారు చెప్పిన సమాచారం ప్రకారం.. వీరి కుటుంబం చాలా మర్యాదపూర్వకంగా ఉంటుంది. ఐతే బయట ఏ కార్యక్రమాలు జరిగినా వారు పెద్దగా పాల్గొనరు. పీయూష్, అంబరీష్లకు 6 మంది కొడుకులు, కుమార్తెలు ఉన్నారు. అందరూ కాన్పూర్‌లో చదువుకుంటారు. వీరంతా చాలా అరుదుగా కన్నౌజ్ని సందర్శించేవారు. పైకి సాదాసీదా జీవనం సాగించే వీరిని చూసి పోలీసులే ఖంగుతిన్నారు. ఏంటి వీరికి ఇన్ని కోట్ల ఆసక్తి ఉందా? అని నోరెళ్లబెడుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: IT raids, Up news, Uttar pradesh