కన్నయ్య కుమార్ కాన్వాయ్‌పై రాళ్ల దాడి.. వాహనాలు ధ్వంసం

సుపౌల్ జిల్లాలోని బహిరంగ సభ ముగించుకొని సహార్సా ప్రాంతంలో CAAకి వ్యతిరేకంగా చేపట్టిన కార్యక్రమంలో పాల్గొనేందుకు కన్నయ్య కుమార్ వెళ్తుండగా ఈ దాడి జరిగింది.


Updated: February 5, 2020, 10:18 PM IST
కన్నయ్య కుమార్ కాన్వాయ్‌పై రాళ్ల దాడి.. వాహనాలు ధ్వంసం
కన్నయ్ కుమార్ కాన్వాయ్‌పై రాళ్ల దాడి
  • Share this:
జేఎన్‌యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు, సీపీఐ నేత కన్నయ్య కుమార్ కాన్వాయ్‌పై రాళ్ల దాడి జరిగింది. కొందరు ఆందోళనకారులు ఆయన కాన్వాయ్‌లోని వాహనాలపై రాళ్లు విసిరారు. ఈ ఘటనలో పలు వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. ఓ వ్యాన్ డ్రైవర్‌కు గాయాలయ్యాయి. బీహార్లోని సుపౌల్‌లో ఈ ఘటన జరిగింది. సుపౌల్ జిల్లాలోని బహిరంగ సభ ముగించుకొని సహార్సా ప్రాంతంలో CAAకి వ్యతిరేకంగా చేపట్టిన కార్యక్రమంలో పాల్గొనేందుకు కన్నయ్య కుమార్ వెళ్తుండగా ఈ దాడి జరిగింది. రాళ్ల దాడిలో కన్నయ్యకు స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది.

గత శనివారం కూడా ఇలాంటి ఘటనే జరిగింది. సరన్‌ జిల్లాలో కన్నయ్య కుమార్‌ కాన్వాయ్‌పై కొంతమంది వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. ఆ ఘటనలో రెండు వాహనాలు ధ్వంసమయ్యాయి. కాగా, లోక్‌సభ ఎన్నికల్లో కన్నయ్య కుమార్‌ సీపీఐ పార్టీ తరఫున బీహార్‌లోని బెగూసరాయ్‌ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కేంద్ర ప్రభుత్వ, బీజేపీకి వ్యతిరేకంగా కన్నయ్య కుమార్ విమర్శలు సంధిస్తుంటారు. ఇక ప్రస్తుతం CAA, NRC, NPRని కన్నయ్య ఆయన తీవ్రంగా తప్పుబడుతున్నారు. ప్రతి బహిరంగ సభల్లోనూ మోదీ తీరుపై మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే CAA వ్యతిరేక కార్యక్రమానికి వెళ్తుండగా ఆయన కాన్వాయ్‌పై దాడి జరిగింది.

First published: February 5, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు