సెలబ్రిటీ వార్‌లో మోదీకి మద్దుతుగా నిలిచిన బాలీవుడ్ భామ కంగనా రనౌత్...

కంగన రనౌత్ (ఇన్‌స్టాగ్రామ్ ఫోటో)

బాలివుడ్ భామ కంగనా రనౌత్ సైతం బీజేపీ ప్రభుత్వానికి మద్దతుగా ట్విట్టర్ వేదికగా ట్వీట్ల పరంపర ప్రారంభించింది. ఇందులో భాగంగా జై శ్రీరామ్ అనేది మెజారిటీ ప్రజలకు పవిత్రమైంది, అవమానపర్చకండి. అని అందులో చెప్పుకొచ్చారు.

  • Share this:
    దేశవ్యాప్తంగా జరుగుతున్న అల్లరిమూకల దాడులపై బాలివుడ్ సెలబ్రిటీలు, రచయితలు, కళాకారుల మధ్య సోషల్ మీడియా వేదికగా మాటల యుద్ధం నడుస్తోంది. వీరిలో కొందరు మోదీ ప్రభుత్వ తీరును నిరసించగా, కొందరు మద్దతుగా నిలుస్తున్నారు. కాగా తాజాగా బాలివుడ్ భామ కంగనా రనౌత్ సైతం బీజేపీ ప్రభుత్వానికి మద్దతుగా ట్విట్టర్ వేదికగా ట్వీట్ల పరంపర ప్రారంభించింది. ఇందులో భాగంగా జై శ్రీరామ్ అనేది మెజారిటీ ప్రజలకు పవిత్రమైంది, అవమానపర్చకండి. అని అందులో చెప్పుకొచ్చారు. దీనిపై కంగన మాట్లాడుతూ.. కొందరు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, మోదీ ప్రభుత్వంలో అభివృద్ధి సాగుతోందని, ప్రజాతీర్పును గౌరవించలేని వాళ్లు ప్రజాస్వామ్యం గురించి ఎలా మాట్లాడతారని ఆవిడ ఎద్దేవా చేశారు.

    ఇదిలా ఉంటే దేశంలోని మైనారిటీలు, దళితులు, ఇతర అణగారిన వర్గాలపై జరుగుతున్న దాడులను అడ్డుకోడానికి ప్రధాని మోదీ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ మణిరత్నం, అపర్ణ సేన్ సహా 49 మంది ప్రముఖులు ఈ నెల 23న రాసిన బహిరంగ లేఖ కలకలం రేపింది. అయితే దానికి ప్రతిగా మోడీ ప్రభుత్వానికి మద్దతుగా మరో 61 మంది సెలబ్రిటీలు లేఖ రాశారు. వీరిలో ప్రముఖ నటి కంగనా రౌనత్, దర్శకుడు మధుర్ భండార్కర్ తదితరులు ఉన్నారు. దేశాన్ని ముక్కలు ముక్కలు చేస్తామని నినాదాలు చేసినప్పుడు మీరెందుకు మౌనంగా ఉన్నారు? కశ్మీర్ పండిట్లను తరిమేస్తుంటే ఎందుకు స్పందించలేదని వీరంతా లేఖలో పేర్కొన్నారు.

         First published: