KANGANA RANAUT MEETS DEFENCE MINISTER RAJNATH SINGH MNJ
Kangana meets Rajnath Singh: రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ని కలిసిన కంగనా .. అసలు కారణం ఇదే
రాజ్‌నాథ్‌ని కలిసిన కంగనా
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ (Kangana Ranaut) ప్రతిష్టాత్మక తేజస్(Tejas) చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. భారత వైమానిక దళం నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కనుంది
Kangana Ranaut Tejas: బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ప్రతిష్టాత్మక తేజస్ చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. భారత వైమానిక దళం నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇందులో కంగనా యుద్ధ పైలెట్‌గా కనిపించనున్నారు. ఇందుకోసం ఆమె ప్రత్యేక శిక్షణను కూడా తీసుకున్నారు. కాగా త్వరలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానున్న నేపథ్యంలో కంగనా.. భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ని కలిశారు. ఈ సందర్భంగా ఆయన ఆశీస్సులతో పాటు షూటింగ్‌కి సంబంధించిన అనుమతులను తీసుకున్నారు. ఈ విషయాన్ని కంగనా రనౌత్ తన సోషల్ మీడియాలో వెల్లడించారు.
మా తేజస్ టీమ్ గౌరవనీయులైన రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ని కలిసింది. ఈ సందర్భంగా ఆయన ఆశీస్సులను తీసుకున్నాము. తేజస్ స్క్రిప్ట్‌ని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అధికారులకు వివరించాము. అలాగే షూటింగ్‌కి సంబంధించిన అనుమతులను తీసుకున్నాము అని కంగనా ట్విట్టర్లో వెల్లడించారు. ఈ సందర్భంగా కొన్ని ఫొటోలను కూడా ఆమె షేర్ చేశారు.
Today team #Tejas met honourable defence minister Shri @rajnathsingh ji for his blessings, we shared the script of our film Tejas with @IAF_MCC as well and seeked few permissions, Jai Hind 🙏 pic.twitter.com/7eoVN1Lidj
కాగా ఈ సినిమాను సర్వేస్ మెవారా తెరకెక్కిస్తుండగా... రొన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీ గురించి గతంలో మాట్లాడిన కంగనా రనౌత్.. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో భాగం అవ్వడం చాలా ఆనందాన్ని ఇచ్చిందని అన్నారు. భారత వైమానిక దళ గొప్పదనాన్ని తమ చిత్రంలో చూపిస్తామని కంగనా వివరించారు.