KANGANA RANAUT CONGRESS MLA CONTROVERSY COMMENTS ON KANGANA RANAUT CHEEK EVK
Kangana Ranaut: కంగానా రనౌత్ చెంపలపై.. కాంగ్రెస్ ఎమ్మెల్యే వ్యాఖ్యలు
కంగనా రనౌత్
Kangana Ranaut | బాలీవుడ్ హీరోయిన్లపై ఇప్పటికే పలువురు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. డాక్టర్ ఇర్ఫాన్ అన్సారీ జార్ఖండ్‌లోని తన నియోజకవర్గం జమ్తారాలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ చెంపల కంటే రోడ్లు సాఫీగా ఉంటాయని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి.
మహారాష్ట్ర (Maharashtra) మంత్రి, శివసేన నాయకుడు గులాబ్ రావ్ పాటిల్ తన నియోజకవర్గంలోని రోడ్లు బీజేపీ ఎంపీ హేమమాలినీ బుగ్గల్లా ఉన్నాయంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మహారాష్ట్ర మంత్రి తనపై చేసిన వ్యాఖ్యలపై నటి, ఎంపీ హేమమాలిని స్పందించారు. ఈ సందర్భంగా ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్, 2013లో అప్పటి యూపీ ఖాదీ, గ్రామీణ పరిశ్రమల మంత్రి రాజారామ్ పాండె ఇలాగే అన్నారని గుర్తు చేశారు. రోడ్లను నటీమణుల బుగ్గలతో పోల్చే సంప్రదాయాన్ని లాలూ ప్రసాద్ మొదలు పెట్టారన్నారు ఆమె. ఇప్పుడు అదే సాంప్రదాయాన్ని అందరూ అనుసరిస్తున్నారన్నారు. అయితే ఇలాంటి కామెంట్స్ (Comments) సరైనవి కావని హేమమాలిని పేర్కొన్నారు. సాధారణ ప్రజలు ఇలాంటి కామెంట్స్ చేస్తే పెద్దగా తప్పుపట్టాల్సిన అవసరం లేదు కానీ, గౌరవ హోదాల్లో ఉన్నవాళ్లు, ప్రజాప్రతినిధులు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మంచిది కాదన్నారు.
#WATCH | Jharkhand: I assure you that roads of Jamtara "will be smoother than cheeks of film actress Kangana Ranaut"; construction of 14 world-class roads will begin soon..: Dr Irfan Ansari, Congress MLA, Jamtara
ఇప్పుడు ఈ వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. ఆయన శుక్రవారం ఒక సెల్ఫీ వీడియోని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. పైగా ఆ వీడియోలో సినీ నటి కంగనా రనౌత్ చెంపల కంటే రోడ్లు సున్నితంగా ఉంటాయని నేను మీకు హామీ ఇస్తున్నాను అంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వారం ప్రారంభంలోనే కరోనా ఉధృతి సమయంలో మాస్క్‌లు ఎక్కువ సేపు ధరించకూడదని, హానికరం అంటూ చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదానికి తెరలేపాయి. ఆ వివాదం సద్దుమణిగిపోక మునుపే తాజాగా మళ్లీ ఇలాంటి వివాదస్పద వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచాడు.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.