news18-telugu
Updated: October 13, 2020, 6:44 PM IST
ఉద్దవ్ థాక్రే, కంగనా రౌత్ (Image: File)
బాలివుడ్ తార కంగనా రనౌత్ మరోసారి మహారాష్ట్ర సర్కారుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కంగనా మహారాష్ట్రలోని ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వాన్ని గుండా ప్రభుత్వం అని అభివర్ణిస్తూ ట్వీట్ చేశారు. అంతేకాదు సోనియా ఆర్మీ కూడా బాబర్ ఆర్మీతో కలిసి తప్పుగా ప్రవర్తిస్తోందని అన్నారు. అంతేకాదు కంగనా ట్వీట్ చేస్తూ, 'గౌరవ గవర్నర్ గుండా ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు ఆనందంగా ఉందన్నారు. గూండాలు బార్లు, రెస్టారెంట్లు తెరిచారు, కానీ దేవాలయాలను మూసివేశారు. సోనియా ఆర్మీ, బాబర్ సైన్యాన్ని మరింత దారుణంగా వ్యవహరిస్తున్నారని విమర్శించింది.
సీఎం ఉద్ధవ్‌కు గవర్నర్ కొషియారీ ఘాటైన లేఖ...
ఇదిలా ఉంటే ముంబైలోని ప్రసిద్ధ సిద్ధి వినాయక్ ఆలయం తెరవాలని బిజెపి కార్యకర్తలు ఆలయం ముందు ప్రదర్శన చేశారు. ఈ నేపథ్యంలో గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ కూడా మూసివేసిన పుణ్యక్షేత్రాలను తెరవాలని సిఎం ఉద్ధవ్ ఠాక్రేకు లేఖ రాశారు. కోషియారీ తన లేఖలో ఇలా వ్రాశారు, 'దురదృష్టవశాత్తు, నాలుగు నెలలు గడిచినప్పటికీ, ప్రభుత్వం మరోసారి ప్రార్థనా స్థలాల దర్శనాలపై నిషేధ గడువు పెంచారని పేర్కొన్నారు. మరోవైపు ప్రభుత్వం బార్లు, రెస్టారెంట్లు, సముద్ర బీచ్ లు తెరిచింది, మరోవైపు దేవాలయాల్లోని దేవతలు లాక్డౌన్లో ఉండటానికి శపించబడ్డారు. అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోషియారీ, కంగనా (Twitter/Photo)
కోషియారీ తన లేఖలో సీఎం ఉద్ధవ్ థాక్రేను ఉద్దేశిస్తూ..ఇలా వ్రాశారు, 'మీరు హిందుత్వానికి బలమైనవాదిగా ఉన్నారు. ముఖ్యమంత్రి అయిన తరువాత, అయోధ్యకు వెళ్లి శ్రీ రామ్ పట్ల మీ అంకితభావాన్ని బహిరంగపరిచారు. సతీసమేతంగా ఏకాదశిలోని పండరీపూర్‌లోని విఠల్ రుక్మిణి ఆలయానికి వెళ్లి పూజలు చేశారు. మరి పుణ్యక్షేత్రాల దర్శనాలను వాయిదా వేయడం పట్ల ఆశ్చర్యపోతున్నాను... మీకు ఏదైనా దైవ ఆదేశం ఉందా...లేదా మీరు అకస్మాత్తుగా 'లౌకిక' వాది అయ్యారా, అది మీరు అసహ్యించుకున్న పదం కదా అని గుర్తుచేశారు.
ఉద్ధవ్ బదులు ఇలా ఇచ్చారు...
దీనికి మహారాష్ట్ర సిఎం ఉద్ధవ్ థాకరే బదులిచ్చారు, లాక్డౌన్ పూర్తిగా పెట్టడం సరైనది కానందున, అదే విధంగా దానిని పూర్తిగా తొలగించడం సరైనది కాదు. ఒకేసారి పూర్తిగా రద్దు చేయడం కూడా మంచి విషయం కాదు. తనను లౌకికమని పిలిచినందుకు ఉద్ధవ్ గవర్నర్‌పై తిరిగి కొట్టాడు మరియు "అవును, నేను హిందుత్వాన్ని అనుసరిస్తున్నాను, నా హిందుత్వానికి మీ నుండి ధృవీకరణ అవసరం లేదు" అని అన్నారు.
ఇదిలా ఉంటే బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్య తరువాత మహారాష్ట్ర ప్రభుత్వంపై కంగనా రనౌత్ తీవ్ర విమర్శలు చేస్తోంది. ట్విట్టర్ వేదికగా ముంబైని పాక్ ఆక్రమిత కాశ్మీర్‌తో కంగనా పోల్చింది. ఈ క్రమంలో శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కంగనా పైన మండిపడ్డారు. దీనితో మహారాష్ట్ర ప్రభుత్వం, కంగనా మధ్య మాటల యుద్ధం పెరిగింది. ఈ క్రమంలోని సెప్టెంబర్ 9 న ముంబైలోని ఆమె కార్యాలయాన్ని అక్రమంగా ఉందంటూ బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ (BMC) అధికారులు కొంత భాగాన్ని కూల్చి వేశారు. దీంతో అదే రోజున కంగనా ముంబై హైకోర్టును ఆశ్రయించగా, ధర్మాసనం కూల్చివేతను నిలిపివేసింది. ఇక ఈ పిటిషన్ లో కంగనా తన కార్యాలయాన్ని కూల్చివేసినందుకు గాను బీఎంసీ తనకు రెండు కోట్ల రూపాయల పరిహారాన్ని చెల్లించాలని తన పిటిషన్ లో కోరింది.
Published by:
Krishna Adithya
First published:
October 13, 2020, 6:44 PM IST