Home /News /national /

KAMALNATH MANISH TWARI AND SOME MORE LEADERS ARE IN CONGRESS PRESIDENT RACE HERE ARE THE LIST SK

Congress: మేమూ ఉన్నాం.. కాంగ్రెస్‌ అధ్యక్ష రేసులో మరికొందరు నేతలు.. కావాలనే చేస్తున్నారా?

Competition in Congress

Competition in Congress

Rahul Gandhi: రాహుల్ గాంధీ అధ్యక్ష పదవి చేపట్టేందుకు ఒప్పుకుంటే.. ఈ ఎన్నిక ఏకగ్రీవమవుతుంది. పోటీలో ఎవరూ ఉండరు. కానీ ఆయన అనాసక్తిగా ఉండడంతో.. ఇతర నేతలు కూడా తమలోని కోరికను బయటపెడుతున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు (Congress President Elections)  రసవత్తరంగా మారుతున్నాయి. రాహుల్ గాంధీ (Rahul Gandhi) పోటీ నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత ప్రధానంగా వినిపిస్తున్న పేరు రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోత్ (Ashok Gelhot). మరి ఈయనైనా ఏకగ్రీవంగా ఎన్నికవుతారా?.. అంటే ఆ పరిస్థితులు కనిపించడం లేదు. అశోక్ గహ్లోత్‌తో పాటు మరికొందరు నేతలు కూడా అధ్యక్ష రేసులో ఉన్నారు. శశిథరూర్ (Sashi Tharoor), దిగ్విజయ్ సింగ్ (Digvijay Singh) కూడా ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్నారు. తాజాగా మరికొందరు పేర్లు తెరపైకి వచ్చాయి. ఆశావహుల జాబితా అంతకంతకూ పెరుగుతోంది. మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్, సీనియర్ నేత మనీశ్ తివారి కూడా పోటీలో ఉండవచ్చని ప్రచారం జరుగుతోంది. ఈ జాబితా ఇంతటితో ఆగలేదు. ఇంకా మరికొందరు నాయకులు ఉన్నారు. పృథ్విరాజ్‌ చవాన్‌, ముకుల్‌ వాస్నిక్‌, మల్లిఖార్జున ఖర్లే, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కూడా అధ్యక్ష పదవికి పోటీ చేయవచ్చనే ప్రచారం జరుగుతోంది. దాదాపు రెండు దశాబ్ధాల తర్వాత కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నిక అనివార్యంగా కనిపిస్తోంది. అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ ఆసక్తి చూపకపోవడంతో.. మొదట అశోక్ గహ్లోత్ పేరు వినిపించింది. గాంధీ కుటుంబానికి ఆయన అత్యంత నమ్మకమైన వ్యక్తి. ఈ క్రమంలోనే ఆయనే ఏకగ్రీవమవుతారని అంతా అనుకున్నారు. కానీ ఆ తర్వాత శశిథరూర్ పేరు తెరమీదకు వచ్చింది. ఇప్పుడు ఆ జాబితా పెరుగుతూ పోతుంది. ఐతే అధ్యక్ష బాధ్యతలు చేపట్టాల్సిందిగా.. రాహుల్ గాంధీని ఒప్పించేందుకు ప్రయత్నిస్తానని.. అయినా అంగీకరించకుంటే.. తాను పోటీచేస్తానని అశోక్ గహ్లోత్ తెలిపారు. ఐతే ఒక వ్యక్తికి ఒకే పదవి నిబంధన ఉండడంతో.. ఒకవేళ ఆయన కాంగ్రెస్ అధ్యక్షుడయితే.. రాజస్థాన్ సీఎం పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. Congress: కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆ సీనియర్ నేత.. ఒకే దెబ్బకు రెండు పిట్టలు.. అసలు వ్యూహం అదేనా ?
    రాహుల్ గాంధీ అధ్యక్ష పదవి చేపట్టేందుకు ఒప్పుకుంటే.. ఈ ఎన్నిక ఏకగ్రీవమవుతుంది. పోటీలో ఎవరూ ఉండరు. కానీ ఆయన అనాసక్తిగా ఉండడంతో.. ఇతర నేతలు కూడా తమలోని కోరికను బయటపెడుతున్నారు. అధ్యక్ష పీఠంలో కూర్చునేందుకు ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు అశోక్ గహ్లోత్‌ను అధ్యక్షుడిని చేసేందుకు సోనియా గాంధీ ప్రయత్నిస్తున్నారని.. ఐతే అది పార్టీలో కొందరికి నచ్చడం లేదని తెలుస్తోంది. ఈ క్రమంలో కావాలనే.. ఎన్నికల్లో పోటీచేసేందుకు వారంతా ముందుకొస్తున్నారని సమాచారం. అందువల్ల కాంగ్రెస్ అధ్యక్షుడి ఎన్నికకు పోలింగ్ అనివార్యంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికకు ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలయింది. సెప్టెంబరు 24 నుంచి సెప్టెంబరు 30 వరకు కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో నామినేషన్లను స్వీకరిస్తారు. నామినేషన్లను విత్ డ్రా చేసుకునేందుకు అక్టోబరు 8 మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు ఉంటుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. పోలింగ్ నిర్వహించాల్సి వస్తే.. అక్టోబరు 17న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఏఐసీసీ కార్యాలయంలో నిర్వహిస్తారు. ఆ తర్వాత అక్టోబరు 19న ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. కౌంటింగ్ పూర్తైన వెంటనే.. కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిని ప్రకటిస్తారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Aicc, Congress, Rahul Gandhi, Sonia Gandhi

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు