భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ (Narendra Modi) అమెరికాలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా అ దేశ ఉపాధ్యక్షురాలు, భారత సంతతి మహిళ అయిన కమలా హారిస్ (Kamala Harris) ను శ్వేత సౌధంలో కలిశారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల గురించి చర్చించారు. ముఖ్యంగా ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాకిస్థాన్(Pakistan) రూపాన్ని అంతర్జాతీయ సమాజం గుర్తించే ప్రయత్నం చేశారు. ఈ విషయంపై కమలా హారిస్‌తో మోదీ చర్చించారు. ఉగ్రవాదంలో పాకిస్థాన్ పాత్రను సుమోటోగా(కోర్టు లేదా ప్రభుత్వ సంస్థ ఇచ్చే ఆదేశం) తీసుకుంటామని కమలా చెప్పినట్లు సమాచారం. ఈ విషయాన్ని భారత విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ ష్రింగ్లా తెలిపారు. పాకిస్థాన్‌లో టెర్రరిజం గ్రూపులు పనిచేస్తున్నట్లు గుర్తించామని కమలా తెలిపినట్లు ఆయన వివరించారు.
"పాకిస్థాన్ పాత్రను సుమోటోగా తీసుకుంటాం. అక్కడ టెర్రర్ గ్రూపులు పనిచేస్తున్నాయని గుర్తించాం. అమెరికా, భారత్ భద్రతపై ప్రభావం పడకుండా ఈ అంశంపై తగిన చర్య తీసుకుంటాం" అని ఈ సమావేశంలో కమలా హారిస్ చెప్పినట్లు హర్షవర్ధన్ ష్రింగ్లా తెలిపారు. ప్రజాస్వామ్యాల పరిరక్షణే ధ్యేయంగా ఇరు దేశాలు కలిసి పనిచేస్తాయని చెప్పారు.
Modi in US: అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌తో మోదీ ఏం చర్చించారు?
పాక్‌పై అమెరికా చురకలు..
ఉగ్రవాదం విషయంలో పాకిస్థాన్‌పై అమెరికా మాటల దాడి చేయడం మొదటి సారి కాదు. ఆఫ్గాన్ నుంచి అగ్రరాజ్యం తన బలగాల నుంచి ఉపసంహరించుకునే సమయంలో ఆ దేశంలో ఆధిపత్య ధోరణిని ప్రదర్శిస్తున్న పాక్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని యూఎస్ చట్టసభ సభ్యులు డిమాండ్ చేశారు. పాకిస్థాన్ ద్వంద్వ వైఖరిని ప్రదర్శిస్తుందని, తాలిబన్లకు అనుకూలంగా ప్రవర్తిస్తుందని మండిపడ్డారు. ఈ వ్యవహారంలో పాక్ పూర్తి పాత్ర తెలుసుకోవడం కొంచెం కష్టమైనప్పటికీ ఇది చాలా కీలకమైన అంశమని యూఎస్ సెనెటర్ మార్కో రూబియో అన్నారు.
Modi US Tour: 5జీ నుంచి డ్రోన్ పాలసీ వరకు.. క్వాల్కామ్ సీఈవోతో ప్రధాని మోదీ చర్చించిన అంశాలు ఇవే
ఆఫ్గాన్‌లో పాక్ పావులు..
ఆఫ్గానిస్థాన్ నుంచి యూఎస్ నిష్క్రమణ తర్వాత.. ఆ దేశంతో పాక్ దశాబ్దాల నాటి ద్వైపాక్షిక సంబంధాల్లో నూతన మార్పులు వచ్చాయి. పాక్‌ను తాలిబన్లకు మధ్యవర్తిగా అమెరికా చూసింది. కానీ ఆఫ్గాన్ నుంచి బలగాల నిష్క్రమణ తర్వాత తాలిబన్లు దేశాన్ని ఆక్రమించుకోవడానికి పాక్ కారణమని గ్రహించింది. అంతేకాకుండా తాలిబన్ల పాలనా వ్యవహారాల్లో పాక్ నియంత్రించాలని చూస్తోంది. దీన్ని బట్టి చూస్తే పాక్‌తో అమెరికాతో సంబంధాలు తగ్గుముఖం పట్టాయని తెలుస్తుంది. భౌగోళిక, రాజకీయ కారణాల దృష్ట్యా దాయాది దేశం కూడా అమెరికాతో కాకుండా చైనా, తాలిబన్ల పక్షాన ఉన్నట్లు కనిపిస్తోంది.
Narendra Modi: అమెరికాలో అగ్రనేతలకు మోదీ అందించిన బహుమతులు ఇవే.. ఏమేం ఉన్నాయంటే..
* ప్రజాస్వామ్య పరిరక్షణే ధ్యేయం..
కమలా హారిస్‌తో ప్రధాని మోదీ భేటీ సందర్భంగా ప్రజాస్వామ్య పరిరక్షణ విషయంలో ఇరు దేశాలు ఉమ్మడి నిర్ణయం తీసుకున్నాయి. ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించాలని, ప్రపంచ వ్యాప్తంగా డెమోక్రసీని బలపరచాలని ఇరు దేశాల నాయకులు స్పష్టం చేశారు. అమెరికాకు భారత్ ప్రత్యేక భాగస్వామి అని, కరోనా వ్యాప్తి పతాక స్థాయిలో ఉన్నప్పుడు భారత్.. ప్రపంచానికి ఎంతో సాయం చేసిందని కమల గుర్తు చేశారు. కరోనాపై పోరాటం కోసం భారత్- అమెరికా కలిసి కట్టుగా పనిచేశాయని తెలిపారు. ఇండో- పసిఫిక్ దేశాల్లో భారత్ తమకు కీలకమైన భాగస్వామి అని చెప్పారు. అమెరికా ఉపాధ్యక్షురాలిగా కమలా హారిస్ గెలవడం చరిత్రాత్మకమని.. ప్రపంచానికి ఆమె స్ఫూర్తిగా నిలిచారని మోదీ కొనియాడారు. ఈ సందర్భంగా మోదీ ఆమెను భారత పర్యటకు ఆహ్వానించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: America, Indian Army, Kamala Harris, Pakistan, PM Narendra Modi