మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ వశమైన కీలక రాష్ట్రం మధ్యప్రదేశ్‌కి ముఖ్యమంత్రిగా ఆ పార్టీ సీనియర్ నేత కమల్‌నాథ్ ప్రమాణ స్వీకారం చేశారు. మధ్యప్రదేశ్ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, కమల్‌నాథ్‌తో ప్రమాణం చేయించారు. భోపాల్‌లో జరిగిన ఈ కార్యక్రమం అట్టహాసంగా సాగింది. ప్రమాణస్వీకార కార్యక్రమంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, టీడీపీ అధినేత చంద్రబాబు, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, నేషనల్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, రాజస్థాన్ డిప్యూటీ సీఎం సచిన్ పైలట్, కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ తదితరులు పాల్గొన్నారు.
#WATCH Madhya Pradesh: Former CM Shivraj Singh Chouhan, Jyotiraditya Scindia and Kamal Nath at Nath's swearing-in ceremony in Bhopal. pic.twitter.com/KrTz5RB5JT
— ANI (@ANI) December 17, 2018
Bhopal: Opposition leaders at the swearing-in ceremony of Madhya Pradesh CM Kamal Nath. pic.twitter.com/kA2HnfXykD
— ANI (@ANI) December 17, 2018
Bhopal: Kamal Nath takes oath as the Chief Minister of Madhya Pradesh. pic.twitter.com/3OyyFymcXK
— ANI (@ANI) December 17, 2018
Madhya Pradesh: Former CM Shivraj Singh Chouhan and other leaders at the swearing-in ceremony of CM designate Kamal Nath, in Bhopal. pic.twitter.com/53HxMd5ktB
— ANI (@ANI) December 17, 2018
Madhya Pradesh: National Conference President Farooq Abdullah, Congress leader Digvijaya Singh and Mallikarjun Kharge, Andhra Pradesh CM & TDP Chief N Chandrababu Naidu, NCP chief Sharad Pawar and other leaders at the swearing-in ceremony of CM designate Kamal Nath, in Bhopal. pic.twitter.com/q4UcVtHpLo
— ANI (@ANI) December 17, 2018
అధికారానికి కాస్త దూరంలో:
మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 114 సీట్లు సాధించి సాధారణ ఆధిక్యానికి రెండు స్థానాల దూరంలో ఆగిపోయినప్పటికీ బీఎస్పీ, ఎస్పీల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మధ్యప్రదేశ్‌లో కొత్త సీఎం ఎవరన్న విషయంలో రెండ్రోజులపాటూ సస్పెన్స్ కొనసాగింది. ముఖ్యమంత్రి పీఠం కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్‌ను వరించింది. అనుభవం, యువతరం మధ్య జరిగిన పోటీలో అనుభవం వైపే మొగ్గుచూపింది కాంగ్రెస్ హైకమాండ్. మధ్యప్రదేశ్ సీఎం పదవి కోసం కమల్‌నాథ్, యువనేత జ్యోతిరాధిత్య సింథియాల మధ్య తీవ్ర పోటీ ఏర్పడింది. తీవ్ర తర్జన భర్జనల తర్వాత మధ్యప్రదేశ్ శాసనసభా పక్ష నేతగా కమల్‌నాథ్ పేరును కాంగ్రెస్ అధిష్టానం అధికారికంగా ప్రకటించింది. డిప్యూటీ సీఎం కూడా ఎవరూ ఉండబోరని స్పష్టంచేసింది. మొన్నటి ఎన్నికల్లో చింద్వారా నియోజకవర్గం నుంచి కమల్‌నాథ్ పోటీచేసి గెలిచారు. మధ్యప్రదేశ్‌లో 15 ఏళ్ల బీజేపీ పాలనకు తెరదించుతూ, కమల్ నాథ్ సీఎం పీఠాన్ని అధిరోహించారు.
Madhya Pradesh: Rajasthan CM Ashok Gehlot, Deputy CM Sachin Pilot and Congress leader Navjot Singh Sidhu at the swearing-in ceremony of CM Kamal Nath, in Bhopal. pic.twitter.com/yBk7kZUAT0
— ANI (@ANI) December 17, 2018
కమల్‌నాథ్ ప్రొఫైల్:
1979లో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి ఇందిరా గాంధీకి ఎంతగానో సహకరించిన కమల్‌నాథ్ దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత మధ్యప్రదేశ్‌లో బీజేపీ సర్కారును ఎదుర్కోవడానికి ఆ ఇందిరా గాంధీ మనుమడు రాహుల్ గాంధీకి అండగా నిలవడం విశేషం. ఉత్తర ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో మహేంద్రనాథ్, లీనా నాథ్ దంపతులకు జన్మించిన కమల్‌నాథ్ డూన్ స్కూల్లో చదివారు. కోల్‌కతా యూనివర్సిటీ కాలేజీలో బీకాం చేశారు. కమల్ సతీమణి అల్కానాథ్. వీరికి ఇద్దరు కొడుకులు. 1968లో కాంగ్రెస్ పార్టీలో చేరిన కమల్‌నాథ్ అనతికాలంలోనే పార్టీ పెద్దలకు సన్నిహితుడయ్యారు. కమల్‌కు డూన్ స్కూల్లో ఇందిర కొడుకు సంజయ్ ఆప్తమిత్రుడు. తద్వారా గాంధీ కుటుంబానికి సన్నిహితుడయ్యారు. సంజయ్ గాంధీ కోటరీలో ముఖ్యుడిగా పేరు పొందారు. 2009–11 మధ్య కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. లోక్‌సభలో సీనియర్ మోస్ట్ సభ్యుడైన కమల్ నాథ్ ఇందిర కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. సంజయ్‌గాంధీ, కమల్‌నాథ్‌లు ఇందిరా గాంధీకి రెండు చేతులని అప్పట్లో పార్టీ నేతలు అభివర్ణించేవారు. కమల్‌నాథ్‌ను ఇందిరాగాంధీ తన మూడో కుమారుడని చెప్పేవాడని చెప్పుకుంటుంటారు. 1980లో మొదటి సారి చింద్వారా లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎన్నికయిన కమల్‌నాథ్ ఇంతవరకు 9 సార్లు ఇదే నియోజకవర్గం నుంచి లోక్‌సభకు వెళ్లారు. యూపీఏ హయాంలో మంత్రిగా పని చేశారు. కేంద్రంలో యూపీఏ సర్కారు నిలదొక్కుకోవడానికి ప్రధాన శక్తిగా వ్యవహరించారు.
రాజస్థాన్ సీఎంగా అశోక్ గెహ్లాట్:
రాజస్థాన్ సీఎంగా అశోక్ గెహ్లాట్ ఇవాళ ఉదయం ప్రమాణస్వీకారం చేశారు. జైపూర్‌లో జరిగిన కార్యక్రమంలో రాజస్థాన్ సీఎంగా అశోక్ గెహ్లాట్, డిప్యూటీ సీఎంగా సచిన్ పైలట్ ప్రమాణస్వీకారం చేశారు. సీఎం పదవి కోసం అశోక్ గెహ్లాట్‌తో పాటు సచిన్ పైలట్ కూడా చివరి వరకు పోటీపడ్డారు. చివరకు డిప్యూటీ సీఎం పదవితో సంతృప్తి చెందారు. సోమవారం ఉదయం జైపూర్‌లోని చారిత్రక ఆల్బర్ట్ హాల్‌లో వారి చేత ఆ రాష్ట్ర గవర్నర్ కల్యాణ్ సింగ్ ప్రమాణం చేయించారు. ఐదేళ్ల విరామం తర్వాత అక్కడ అధికార పగ్గాలను కాంగ్రెస్ హస్తగతం చేసుకుంది. రాజస్థాన్ సీఎంగా అశోక్ గెహ్లాట్ ప్రమాణస్వీకారం చేయడం ఇది మూడోసారి.
Former PM Dr. Manmohan Singh, Congress President @RahulGandhi & opposition leaders from across the country gather in Rajasthan for the swearing in ceremony of CM @ashokgehlot51 & Deputy CM @SachinPilot #IndiaTrustsCongress pic.twitter.com/BRFShH4fkF
— Congress (@INCIndia) December 17, 2018
LIVE: Swearing in ceremony of CM @ashokgehlot51 & Deputy CM @SachinPilot from Jaipur. #IndiaTrustsCongress https://t.co/DcpI0AwHYT
— Congress (@INCIndia) December 17, 2018
कांग्रेस पार्टी पर विश्वास करने के लिए राजस्थान वासियों का हृदय से आभार।
कांग्रेस के कार्यकर्ताओं और नेताओं को उनके संघर्ष के सफल होने पर हार्दिक बधाई|
राजस्थान की सेवा करना कांग्रेस पार्टी के लिए गौरव की बात है| हम अपनी ज़िम्मेदारी पूरी तरह निभाएंगे|#IndiaTrustsCongress pic.twitter.com/hAWwBf572m
— Rahul Gandhi (@RahulGandhi) December 17, 2018
అశోక్ గెహ్లాట్ ప్రొఫైల్:
రాజస్థాన్ ముఖ్యమంత్రిగా అశోక్ గెహ్లాట్ ఇప్పుడు మూడోసారి ప్రమాణస్వీకారం చేశారు. 67 ఏళ్ల గెహ్లాట్ తొలిసారిగా 1998లో రాజస్థాన్ సీఎంగా తొలిసారి బాధ్యతలు చేపట్టారు. రెండోసారి 2008-2013 వరకు రాజస్థాన్ సీఎంగా పనిచేశారు. గతంలో రెండుసార్లు రాజస్థాన్ సీఎంగా పనిచేయడంతో పాటు పలుసార్లు రాజస్థాన్ నుంచి లోక్‌సభ సభ్యుడిగా, అసెంబ్లీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. 1980లో తొలిసారి లోక్‌సభకు ఎన్నికైన గెహ్లాట్...ఆ తర్వాత మరో నాలుగుసార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారు. 1999 నుంచి సర్దార్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వరుసగా ఐదుసార్లు ఎన్నికయ్యారు. కేంద్ర మంత్రిగానూ ఆయన పనిచేశారు. ఏఐసీసీలో పలు హోదాల్లో పనిచేశారు. సైన్స్‌లో గ్రాడ్యుయేట్, ఎకనామిక్స్‌లో పోస్ట్ గ్యాడ్యుయేట్ అయిన గెహ్లాట్ ‘లా’ కూడా చదివారు. సునితా గెహ్లాట్‌ను ఆయన పెళ్లాడారు. వారికి ఓ కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు.
మాయావతి, అఖిలేష్, మమత డుమ్మా :
కర్ణాటక సీఎం కుమారస్వామి ప్రమాణస్వీకార కార్యక్రమం తరహాలోనే...ఈ ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని విపక్షాల ఐక్య వేదికగా చూపేందుకు కాంగ్రెస్ ప్రయత్నించింది. ఇందులో భాగంగా పలువురు విపక్ష నేతలను ఆహ్వానించింది. అయితే బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్, ప.బంగ సీఎం మమతా బెనర్జీ ఈ ప్రమాణస్వీకార కార్యక్రమాలకు గైర్హాజరయ్యారు. యూపీలో వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల పంపకాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీతో నెలకొన్న విభేదాల కారణంగానే మాయావతి, అఖిలేష్ యాదవ్ ఈ కార్యక్రమాలకు హాజరుకాలేదని సమాచారం. కాంగ్రెస్‌తో సీట్ల సర్దుబాటు కుదరని పక్షంలో తామిద్దరూ కలిసి యూపీలో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని బీఎస్పీ, ఎస్పీ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
తదుపరి కార్యక్రమాలు:
ఛత్తీస్‌గఢ్ పీసీసీ చీఫ్ భూపేశ్ బాగల్ రాయ్‌పూర్‌లోని బల్బీర్ సింగ్ జునేజా ఇండోర్ స్టేడియలో సాయంత్రం 4 గంలలకు ఆ రాష్ట్ర సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారు. ఛత్తీస్‌గఢ్‌లో ఉన్న 90 నియోజకవర్గాలకు నవంబర్ 12, నవంబర్ 20న రెండు దశల్లో పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. హస్తం పార్టీ 68 సీట్లు గెలుచుకుంది. బీజేపీ కేవలం 15 సీట్లు మాత్రమే దక్కించుకుంది.
భూపేష్ బాగల్ ప్రొఫైల్:
భూపేష్ బాగల్ ఆగస్టు 23, 1961లో జన్మించారు. ఈ ఏడాది అక్టోబరు 24 నుంచీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బాగల్ రాష్ట్రంలోని పటాన్ నియోజక వర్గం నుంచీ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. బాగల్ 1980లో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. చందులాల్ చంద్రకర్ మార్గదర్శకత్వంలో ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమయ్యింది. 1994-95 సంవత్సరంలో బాగల్ మధ్యప్రదేశ్ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. 1998 డిసెంబరులో దిగ్విజరు సింగ్ మంత్రి వర్గంలో ప్రజా పనుల శాఖ సహాయ మంత్రిగా నియమితులై సేవలందించారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం ఏర్పడిన తరువాత రెవెన్యూ, ప్రజా ఆరోగ్య ఇంజనీరింగ్, పునరావాస పనుల శాఖకు తొలి మంత్రిగా 2003 వరకు పనిచేశారు. తర్వాత ప్రతిపక్ష ఉపనేతగా బాధ్యతలు నిర్వర్తించారు. 2008 ఎన్నికల్లో పటాన్ నియోజకవర్గం నుంచీ శాసనసభకు పోటీ చేసి ఓడిపోయారు. 2004, 2009 సంవత్సరాలలో జరిగిన పార్లమెంటు ఎన్నికలలో కూడా ఆయన ఓటమిపాలయ్యారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ashok Gehlet, Chhattisgarh, Kamal Nath, Madhya pradesh, Rajasthan