హిందీని రుద్దాలని చూస్తే మరో జల్లికట్టు ఉద్యమమే...కమల్ హాసన్

జాతీయ గీతం బెంగాలీలో ఉన్నప్పటికీ ప్రజలంతా ఎంతో గౌరవంగా ఆలపిస్తారని, అందుకు కారణం అన్ని భాషలను, సంస్కృతులను అందులో గౌరవించడమేనని కమల్ హాసన్ తెలిపారు. భారతదేశాన్ని భాషాపరంగా చీల్చేందుకు ప్రయత్నించవద్దని, ఆయన అభిప్రాయపడ్డారు.

Krishna Adithya | news18-telugu
Updated: September 16, 2019, 11:10 PM IST
హిందీని రుద్దాలని చూస్తే మరో జల్లికట్టు ఉద్యమమే...కమల్ హాసన్
కమల్ హాసన్
  • Share this:
హిందీ భాషను తమపై రుద్దడానికి ప్రయత్నించవద్దని మక్కళ్ నీది మయ్యం పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. హిందీ భాషను తమిళ ప్రజలపై రుద్దితే మాత్రం జల్లికట్టును మించిన ఉద్యమం చూడాల్సి వస్తుందని ఆయన కమల్ అన్నారు. అన్ని భాషలను గౌరవిస్తామని అయితే తమ మాతృభాష ఎప్పటికీ తమిళమే అని అన్నారు. జల్లికట్టు కోసం జరిగింది కేవలం ఒక నిరసన మాత్రమే అని. అయితే భాషను కాపాడుకునేందుకు మహా ఉద్యమమే జరుగుతుందని అని హెచ్చరించారు. తమ భాష, సంస్కృతి, ఉనికిని కాపాడుకునేందుకు ఎంతకైనా తెగిస్తామని ఆయన గుర్తు చేశారు.

అలాగే జాతీయ గీతం బెంగాలీలో ఉన్నప్పటికీ ప్రజలంతా ఎంతో గౌరవంగా ఆలపిస్తారని, అందుకు కారణం అన్ని భాషలను, సంస్కృతులను అందులో గౌరవించడమేనని కమల్ హాసన్ తెలిపారు. భారతదేశాన్ని భాషాపరంగా చీల్చేందుకు ప్రయత్నించవద్దని, ఆయన అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన ఒక వీడియో సందేశాన్ని సోసల్ మీడియా ద్వారా విడుదల చేశారు.


First published: September 16, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading