హిందూ అనే పదం విదేశీయులది...కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలు

పురాణాల్లో కూడా హిందు అనే పదం కనిపించదని అన్నారు. అయితే హిందూ అనే పదం పర్షియా పదమని, విదేశీ రాజులైన మొఘల్ చక్రవర్తులు, అలాగే బ్రిటిష్ వారు హిందు అనే పదం విరివిగా వాడారని అన్నారు.

news18-telugu
Updated: May 18, 2019, 9:05 PM IST
హిందూ అనే పదం విదేశీయులది...కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలు
కమల్ హాసన్ (File Image)
  • Share this:
వరుస వివాదాల్లో తలదూరుస్తున్న కమల్ హాసన్ తాజాగా మరో సంచలన వ్యాఖ్య చేశారు. పురాణాలు, ఇతిహాసాలు, శాస్త్రాల్లో హిందూ జాతి అనే పదమే లేదని అన్నారు. అంతే కాదు 12 మంది ఆళ్వార్లు, నాయనార్లలో ఎవరూ కూడా తమ కీర్తనల్లో హిందూ అనే పదం ఉచ్చరించలేదని అన్నారు. అలాగే పురాణాల్లో కూడా హిందు అనే పదం కనిపించదని అన్నారు. అయితే హిందూ అనే పదం పర్షియా పదమని, విదేశీ రాజులైన మొఘల్ చక్రవర్తులు, అలాగే బ్రిటిష్ వారు హిందు అనే పదం విరివిగా వాడారని అన్నారు. అప్పుడే దానికి అధికారిక గుర్తింపు లభించిందని అన్నారు. మన జాతికి ఎంతో గుర్తింపు ఉందని అలాంటప్పుడు, విదేశీయులు ఇచ్చిన పదాన్ని మతంగా వాడాల్సిన అవసరం ఏముందని అన్నారు. అలాగే అందరం హిందువులు అని పిలిపించుకోవడం కంటే భారతీయులం అని గుర్తింపు పొందితేనే బాగుంటుందని అన్నారు.

ఇదిలా ఉంటే ఇప్పటికే దేశంలో తొలి తీవ్రవాది హిందువే అని నాథూరాం గాడ్సేను ఉద్దేశించి కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. కాగా కమల్ హాసన్ ఆధ్వర్యంలోని ఎంఎన్ఎం పార్టీ పార్లమెంటు ఎన్నికల్లో తమిళనాడు వ్యాప్తంగా 38 స్థానాల్లో పోటీ చేస్తోంది. అలాగే పాండిచ్చేరి నుంచి సైతం 1 అభ్యర్థిని పోటీలో నిలిపింది.

First published: May 18, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>