మోదీ ప్రమాణ స్వీకారానికి హాజరైన కళ్యాణ్ జ్యువెలర్స్ ఛైర్మన్

కళ్యాణరమన్‌తో పాటు ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్స్ రాజేష్, రమేష్ కళ్యాణరమన్, కళ్యాణ్ డెవలపర్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్.కార్తీక్ హాజరైనవారిలో ఉన్నారు. ప్రమాణ స్వీకారం తర్వాత ప్రత్యేక విందులో పాల్గొన్నారు.

news18-telugu
Updated: May 31, 2019, 5:19 PM IST
మోదీ ప్రమాణ స్వీకారానికి హాజరైన కళ్యాణ్ జ్యువెలర్స్ ఛైర్మన్
File Photo: ప్రధాని నరేంద్ర మోదీతో కళ్యాణ్ జ్యువెలర్స్ ప్రమోటర్స్
  • Share this:
దేశ రాజధానిలో అంగరంగవైభవంగా జరిగిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారానికి కళ్యాణ్ జ్యువెలర్స్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ టీ.ఎస్.కళ్యాణరమన్ హాజరయ్యారు. రాష్ట్రపతి భవన్‌లో ప్రధాని మోదీ ప్రమాణ స్వీకార వేడుకకు కళ్యాణ్ జ్యువెలర్స్‌కు కూడా ఆహ్వానం అందింది. కళ్యాణ్ జ్యువెలర్స్‌ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ కళ్యాణరమన్ కుటుంబ సమేతంగా ఈ వేడుకకు హాజరయ్యారు. కళ్యాణరమన్‌తో పాటు ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్స్ రాజేష్, రమేష్ కళ్యాణరమన్, కళ్యాణ్ డెవలపర్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్.కార్తీక్ హాజరైనవారిలో ఉన్నారు. ప్రమాణ స్వీకారం తర్వాత ప్రత్యేక విందులో పాల్గొన్నారు. కళ్యాణరమన్ గతంలో ప్రధాని నరేంద్ర మోదీని పలు సందర్భాల్లో కలిశారు. త్రిస్సూర్‌లో జరిగిన ఓ సమావేశంలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రతిష్టాత్మక పథకం 'హౌజింగ్ ఫర్ ఆల్: మిషన్ 2022' ప్రోగ్రామ్‌కు మద్దతు కూడా తెలిపారు.

ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. గురువారం రెండోసారి ప్రధానిగా మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ వేడుకకు దేశ విదేశాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. బిమ్‌స్టెక్ దేశాధినేతలతో పాటు భారతదేశానికి చెందిన పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, రాజకీయ పార్టీల అగ్రనేతలు, పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. ప్రమాణ స్వీకారానికి సుమారు 8,000 మందికి పైగా అతిథులు రావడం విశేషం.

Black Shark 2: గేమింగ్ ఫోన్ 'బ్లాక్ షార్క్ 2' ఎలా ఉందో చూశారా?ఇవి కూడా చదవండి:

Online Shopping: ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారా? ఈ టిప్స్ మీకోసమే

Tata Sky: టాటా స్కై రీజనల్ ప్యాక్స్ ధరలు మారాయిCredit Card: క్రెడిట్ కార్డ్ వాడట్లేదా? క్యాన్సిల్ చేయండి ఇలా
First published: May 31, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading