కైలాస మానసరోవరానికి కొత్త మార్గం ప్రారంభం.. ఇకపై వారంలోనే..

కొత్త మార్గం అందుబాటులోకి భక్తుల కష్టాలు తీరుతాయని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఇంతకు ముందు మూడు వారాలు పట్టే మానసరోవర యాత్ర.. ఇకపై వారం రోజుల్లోనే పూర్తి చేయవచ్చని చెప్పారు.

news18-telugu
Updated: May 8, 2020, 4:04 PM IST
కైలాస మానసరోవరానికి కొత్త మార్గం ప్రారంభం.. ఇకపై వారంలోనే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
కైలాసుడి భక్తుల దశాబ్ధాల కల నెరవేరింది. కైలాస మానసరోవర యాత్రలో నవ శకం ప్రారంభమైంది. భారత్ నుంచి వెళ్తే భక్తులు త్వరగా చేరుకునేందుకు కొత్త మార్గాన్ని ఇవాళ ప్రారంభించారు. ఉత్తరాఖండ్‌లోని దార్చుల్లా నుంచి చైనా సరిహద్దులోని లిపులేక్ పాస్ వేరకు ఈ రహదారిని వేశారు. దాదాపు 90 కిలోమీటర్ల కొత్త మార్గాన్ని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. కొత్త మార్గం అందుబాటులోకి రావడంతో కైలాస మానసరోవర యాత్రా సమయం భారీగా తగ్గనుంది.

టిబెట్‌లోని కైలాస మానససరోవరానికి భారత్ నుంచి ప్రతి ఏడాది వేలాది మంది భక్తులు వెళ్తుంటారు. ఇప్పటి వరకు సిక్కిం, నేపాల్ మార్గాల్లో లిపులేక్ పాస్ వరకు వెళ్లేవారు. అక్కడి నుంచి మానస సరోవర్ చేరుకునేవారు. ఐతే ఇకపై ఉత్తరాఖండ్‌లోని పిత్తోర్‌గఢ్ నుంచి దార్చుల్లా, గూంజీ మీదుగా నేరుగా లిపులేక్ పాస్ వరకు ప్రయాణించవచ్చు. కైలాస మాసరోవర్ యాత్రకు లిపులేక్‌ను గేట్‌ వేగా పిలుస్తారు. అక్కడి నుంచి 80 కి.మీ. ప్రయానిస్తే కైలాస మాససరోవరం వస్తుంది.

ఈ కొత్త మార్గం అందుబాటులోకి భక్తుల కష్టాలు తీరుతాయని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. ఇంతకు ముందు మూడు వారాలు పట్టే మానసరోవర యాత్ర.. ఇకపై వారం రోజుల్లోనే పూర్తి చేయవచ్చని చెప్పారు. అంతేకాదు పర్వత ప్రాంతాల్లో రవాణా పెరిగి.. వాణిజ్యం కూడా అభివృద్ధి చెందుతుదని వెల్లడించారు. చైనా సరిహద్దుకు సైనిక బలగాల తరలింపులోనూ వ్యూహాత్మంగా పనిచేస్తుందని మిలటరీ అధికారులు చెప్పారు.
Published by: Shiva Kumar Addula
First published: May 8, 2020, 4:00 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading