కాంగ్రెస్‌కు బిగ్ షాక్...మోదీ నిర్ణయానికి సింధియా మద్దతు

కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి రాహుల్ గాంధీ తప్పుకుంటానని ప్రకటించడంతో..ఆ రేస్‌లో ఉన్నవారి జాబితాలో జ్యోతిరాదిత్య సింధియా పేరు కూడా ఉంది. మరి అలాంటి నేత కాంగ్రెస్ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

news18-telugu
Updated: August 6, 2019, 7:44 PM IST
కాంగ్రెస్‌కు బిగ్ షాక్...మోదీ నిర్ణయానికి సింధియా మద్దతు
జ్యోతిరాధిత్య సింధియా(File)
  • Share this:
జమ్మూకాశ్మీర్ విభజన వేళ కాంగ్రెస్‌కు బిగ్ షాక్ తగిలింది. కేంద్ర నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పార్టీకి సొంత పార్టీ నేతలే ఝలకిస్తున్నారు. ఆర్టికల్ 370 రద్దు, జమ్మూ కాశ్మీర్ విభజనను సమర్థిస్తూ బాహాటంగానే వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా ఏఐసీసీ అధ్యక్ష రేసులో ఉన్న జ్యోతిరాదిత్య సింధియా సైతం రాహుల్ గాంధీతో విభేదించారు. ఎన్డీయే ప్రభుత్వ నిర్ణయానికి మద్దతిచ్చారు. జమ్మూ కాశ్మీర్ విభజనను తాను సమర్థిస్తున్నట్లు ట్విటర్‌లో పేర్కొన్నారు.

కశ్మీర్‌ను పూర్తిస్థాయిలో భారత్‌లో విలీనం చేయడాన్ని, కశ్మీర్ విభజనకు నేను మద్దతు తెలుపుతున్నా. ఐతే రాజ్యాంగ ప్రక్రియను అనుసరించి ఉంటే బాగుండేది. అప్పుడు ఎలాంటి ప్రశ్నలు ఉత్పన్నమయ్యేవి కావు. ఏదేమైనా.. దేశం కోరుకుంటున్నది ఇదే. అందుకే నేను మద్దతు ఇస్తున్నా.
జ్యోతిరాదిత్య సింధియా, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ


నిన్న కాంగ్రెస్ రాజ్యసభ చీఫ్ విప్ భువనేశ్వర్ కలిటా సైతం పార్టీ స్టాండ్‌ను తప్పుబట్టారు. అంతేకాదు చీఫ్ విప్‌ పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్‌కు షాకిచ్చారు. ఇప్పుడు ఏకంగా పార్టీ అధ్యక్ష రేసులో ఉన్న సింధియానే పార్టీ అధ్యక్షుడు రాహుల్‌తో విబేధించడం దేశ రాజకీయాల్లో సంచలనం రేపుతోంది.

జ్యోతిరాదిత్య సింధియా మధ్యప్రదేశ్ రాజకీయాల్లో కీలకమైన నేత. ప్రస్తుతం గుణ అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఉన్నారు. అంతేకాదు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు కూడా నిర్వర్తిస్తున్నారు. గత ఏడాది జరిగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో ఆయనే సీఎం అవుతారని ప్రచారం జరిగింది. కానీ సీనియారిటీ దృష్ట్యా కమల్‌నాథ్‌ను ఆ పదవి కట్టబెట్టారు ఏఐసీసీ పెద్దలు. ఇక కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి రాహుల్ గాంధీ తప్పుకుంటానని ప్రకటించడంతో..ఆ రేస్‌లో ఉన్నవారి జాబితాలో జ్యోతిరాదిత్య సింధియా పేరు కూడా ఉంది. మరి అలాంటి నేత కాంగ్రెస్ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
First published: August 6, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు