Home /News /national /

JUSTICE SIKRI WITHDRAWS CONSENT TO GOVERNMENT OFFER TO NOMINATE HIM TO CSAT

జస్టిస్ సిక్రీ సంచలన నిర్ణయం : సీఎస్ఏటీ అధ్యక్ష పదవికి 'నో'

జస్టిస్ సిక్రీ(File)

జస్టిస్ సిక్రీ(File)

సీబీఐ డైరెక్టర్‌గా అలోక్ వర్మను తప్పించిన మోదీ నేత్రుత్వంలోని హైపవర్ కమిటీలో సిక్రీ కూడా ఒకరు. అలోక్ వర్మను తప్పించిన రెండు రోజులకే సిక్రీ ఈ నిర్ణయం తీసుకోవడం రెండింటిని ముడిపెట్టి చూడటానికి ఆస్కారం కల్పించింది.

    లండన్‌లోని కామన్‌వెల్త్ సెక్రటేరియట్ ఆర్బిటల్ ట్రిబ్యునల్(సీఎస్ఏటీ)కి ఇండియా తరుపున అధ్యక్షుడిగా కొనసాగడానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఏకే సిక్రీ తిరస్కరించారు. సీబీఐ డైరెక్టర్‌గా అలోక్ వర్మను తప్పించిన వ్యవహారంలో సిక్రీపై వచ్చిన ఆరోపణలు ఆయన్ను మనస్తాపానికి గురిచేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సీఎస్ఏటీ అధ్యక్ష పదవిని సిక్రీ తిరస్కరించినట్టు చర్చ జరుగుతోంది.

    సీఎస్ఏటీ అధ్యక్షుడిగా కొనసాగడానికి గత ఏడాది డిసెంబర్‌లో సిక్రీ అంగీకారం తీసుకున్న తర్వాతే ఆయన్ను ప్రభుత్వం ఈ పదవికి నామినేట్ చేసింది. అయితే తాజా సీబీఐ వ్యవహారంలో ఆయనపై విమర్శలు రావడంతో సిక్రీ నిర్ణయం మార్చుకున్నట్టు చెబుతున్నారు. ఈ మేరకు సీఎస్ఏటీ అధ్యక్ష పదవికి తన అంగీకారాన్ని ఉపసంహరించుకుంటున్నట్టు న్యాయ మంత్రిత్వ శాఖకు సిక్రీ ఆదివారం లేఖ రాశారు.


    కాగా, సీబీఐ డైరెక్టర్‌గా అలోక్ వర్మను తప్పించిన మోదీ నేత్రుత్వంలోని హైపవర్ కమిటీలో సిక్రీ కూడా ఒకరు. అలోక్ వర్మను తప్పించిన రెండు రోజులకే సిక్రీ ఈ నిర్ణయం తీసుకోవడం రెండింటిని ముడిపెట్టి చూడటానికి ఆస్కారం కల్పించింది. అయితే సిక్రీ తరుపు వర్గాలు మాత్రం రెండింటిని ముడిపెట్టి చూడాల్సిన అవసరం లేదని చెబుతున్నాయి. సీఎస్ఏటీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోవడానికి సీబీఐ వ్యవహారానికి ఏమాత్రం సంబంధం లేదని అంటున్నాయి. రిటైర్మెంట్‌కు ముందు పూర్తి స్థాయి బాధ్యతల్లో కొనసాగే పదవులను నిర్వర్తించడానికి ఆయన సుముఖంగా లేరని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు.




    First published:

    Tags: CBI, Narendra modi, Supreme Court

    తదుపరి వార్తలు