సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా బాబ్డే ప్రమాణస్వీకారం...

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా బాబ్డే ప్రమాణస్వీకారం...

Justice SA Bobde : జస్టిస్ రంజన్ గొగోయ్... ఆదివారం రిటైర్మెంట్ తీసుకున్నారు. ఇవాళ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయిన శరద్ అరవింద్ బాబ్డే ముందున్న కేసులేంటి?

 • Share this:
  CJI Sharad Arvind Bobde : జస్టిస్ శరద్ అరవింద్ బాబ్డే...  సుప్రీంకోర్టు 47వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉదయం 9.30కి రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ దగ్గరుండి జరిపించారు. సుప్రీంకోర్టులో ఎంతో మంది జడ్జిలు ఉన్నా... బాబ్డేను తన వారసుడిగా చేయమని ప్రతిపాదించారు నిన్నటి వరకూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఉన్న రంజన్ గొగోయ్. ఎందుకంటే... గొగోయ్ తర్వాత... బాబ్డేనే... సుప్రీంకోర్టులో సీనియర్ మోస్ట్ జడ్జి. CJIగా బాబ్డే... 18 నెలలు పనిచేసి... ఏప్రిల్ 23, 2021లో రిటైర్మెంట్ తీసుకుంటారు.

  1956 ఏప్రిల్ 24న నాగపూర్‌లో జన్మించిన జస్టిస్ బాబ్డే (63)... గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి... నాగపూర్ యూనివర్శిటీ నుంచీ లా డిగ్రీ తీసుకున్నారు. 1978లో ఆయన మహారాష్ట్ర బార్ కౌన్సిల్‌లో సభ్యుడయ్యారు. 1998లో సీనియర్ అడ్వకేట్‌గా గుర్తింపు పొందారు.

  justice s a bobde, supreme court cji, telugu varthalu, news updates, breaking news, telugu news, news today, daily news, news online, national news, india news, జస్టిస్ట్ బాబ్డే, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, నేషనల్ న్యూస్, న్యూస్ అప్ డేట్స్, తెలుగు వార్తలు, తెలుగు న్యూస్, న్యూస్ అప్ డేట్, బ్రేకింగ్ న్యూస్, వైరల్ న్యూస్,
  సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌ బాబ్డే


  2000 మార్చి 29న జడ్జిగా కెరీర్ మొదలుపెట్టారు బాబ్డే. బాంబే హైకోర్టులో అదనపు జడ్జిగా నియమితులయ్యారు. 2012 అక్టోబర్ 16న మధ్యప్రదేశ్ హైకోర్టులో చీఫ్ జస్టిస్ అయ్యారు.

  2013 ఏప్రిల్ 12న బాబ్డే... సుప్రీంకోర్టులో జడ్జిగా నియమితులయ్యారు. అయోధ్య కేసులో తీర్పు ఇచ్చిన ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో జస్టిస్ బాబ్డే కూడా ఉన్నారు.

  Pics : క్యూట్ స్మైల్‌తో కట్టిపడేస్తున్న సుష్మరాజ్



  ఇవి కూడా చదవండి :

  నేడు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం... ఇవీ ప్రత్యేకతలు

  Health Tips : గొంతు గరగరగా ఉందా... ఇలా చెయ్యండి చాలు... సమస్య పరార్

  వేడి నీరు, నిమ్మరసంతో అద్భుతమైన 9 ప్రయోజనాలు

  ఒక్క తులసి మొక్కను పెంచినా చాలు... ఆరోగ్యమే ఆరోగ్యం


  Health Tips : తరచుగా అంజీర్ తింటున్నారా... కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవీ...


  Published by:Krishna Kumar N
  First published: