హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Hemanth soren : నేను కూాడా ఆర్యన్ ఖాన్ లాంటి బాధితుడినే

Hemanth soren : నేను కూాడా ఆర్యన్ ఖాన్ లాంటి బాధితుడినే

తండ్రితో జార్ఖండ్ సీఎం(ఫైల్ ఫొటో)

తండ్రితో జార్ఖండ్ సీఎం(ఫైల్ ఫొటో)

Jakanikattu CM :గత సంవత్సరం అక్టోబరు 2న ముంబైలో ఓ క్రూయిజ్ షిప్‌పై నిర్వహించిన దాడుల్లో డ్రగ్స్ దొరికిన కేసులో బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్(Shah Rukh Khan)కుమారుడు ఆర్యన్ ఖాన్‌ (Aryan Khan)కు నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) మే 27న క్లీన్ చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే.

ఇంకా చదవండి ...

Jakanikattu CM :గత సంవత్సరం అక్టోబరు 2న ముంబైలో ఓ క్రూయిజ్ షిప్‌పై నిర్వహించిన దాడుల్లో డ్రగ్స్ దొరికిన కేసులో బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్(Shah Rukh Khan)కుమారుడు ఆర్యన్ ఖాన్‌ (Aryan Khan)కు నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) మే 27న క్లీన్ చిట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఆర్యన్ ఖాన్, మరో ఐదుగురిపై నమోదైన ఆరోపణలను రుజువు చేసేందుకు తగిన సాక్ష్యాధారాలు లేవని తెలిపింది. అయితే కొంత మంది దురుద్దేశంతో తప్పుడు కేసు రూపొందించి షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్‌(Aryan Khan)ను డ్రగ్స్ కేసులో ఇరికించారని, తాను కూడా తాను కూడా ఆర్యన్ ఖాన్ లాంటి బాధితుడినేనని జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్(Hemanth Soren)అన్నారు. తనపై నమోదైన బొగ్గు కుంభకోణం కేసును సీఎం హేమంత్ సోరెన్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. తాజాగా మహాత్మగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం(MGNREGA) పనిలో అవకతవకలు జరిగినట్లు, అలాగే మైనింగ్‌‌ లీజుల్లో అవినీతి జరిగినట్లు ఆరోపణలు రావడంతో హేమంత్ సోరెన్‌పై ఈడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులను ఆర్యన్ ఖాన్‌పై వచ్చిన డ్రగ్స్ కేసులతో పోల్చుతూ పై విధంగా పోల్చారు సోరెన్.

ఆదివారం ఢిల్లీకి వచ్చిన ఆయన కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీని కలిశారు. రాజ్యసభ ఎన్నికల్లో పోటీపై ఆమెతో గంటకుపైగా చర్చించారు. అనంతరం మీడియాతో హేమంత్‌ సోరెన్‌ మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీతో ఎలాంటి విభేదాలు లేవని చెప్పారు. రాజ్యసభ ఎన్నికలకు సంబంధించిన రెండు సీట్లలో అభ్యర్థులను పరస్పర అవగాహనతో ప్రకటిస్తామని అన్నారు. ఈ సందర్భంగా తనపై ఈడీ నమోదచేసిన కేసుపై హేమంత్ సోరెన్ మాట్లాడుతూ..."MGNREGA కుంభకోణంపై రాష్ట్రంలోని రెండు జిల్లాల్లో ఈడీ అధికారులు విచారణ చేస్తున్నారు. అయితే స్థానిక అధికారులను ఏమాత్రం సంప్రదించకుండానే విచారణ చేపట్టారు. దీన్నిబట్టి మనం అర్థం చేసుకోవచ్చు. నిజంగా కుంభకోణంపై లోతుగా విచారణ చేపట్టేందుకు ఈడీ సిద్ధంగా లేదు. కేవలం వారికి కేటాయించిన పని పూర్తి చేసే పనిలో ఉన్నారని స్పష్టమవుతోంది" అని అన్నారు. కల్పిత కేసులో ఆర్యన్‌ ఖాన్‌ బాధితుడైన మాదిరిగా, తనపై కూడా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కేసు నమోదు చేసిందన్నారు. తనపై ఈడీ కేసు కూడా ఇలాంటిదేనని తెలిపారు. ఈ ఆరోపణల్లో ఏం గుర్తించారు లేదా కేసు పురోగతిపై ఈడీ ఇప్పటి వరకు ఎలాంటి బహిరంగ ప్రకటన చేయలేదన్నారు.

ALSO READ  India-Bangladesh Bus Service : భారత్‌ -బంగ్లాదేశ్‌ మధ్య బస్సు..జూన్ 10 నుంచి సర్వీసులు పునరుద్ధరణ


మొహెంజొదారోలో తవ్వకాల మాదిరిగానే దేవాలయాలు, మసీదుల తవ్వకాలపై బీజేపీ ఆసక్తి చూపుతుందని సోరెన్ మండిపడ్డారు. అలాగే తనపై ఈడీ పెట్టిన ఈ కేసు 14 ఏళ్ల క్రితందని చెప్పిన ఆయన ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ బీజేపీపై విమర్శలు గుప్పించారు. ప్రస్తుతం ఈడీ విచారణ చేస్తున్న కేసు 14 ఏళ్ల క్రితం నాటిది. బీజేపీకి ఇలాంటివి అలవాటే. అవసరమైతే 500 ఏళ్ల క్రితం నాటి కేసులైనా తీస్తారు. వందల ఏళ్ల గుడులు, మసీదులపై వాళ్లు చేస్తున్న దాడి అలాంటిదే అని హేమంత్ సోరెన్ అన్నారు.

అలాగే ఉపాధి హామీ నిధుల వ్యవహారంపై జార్ఖండ్‌లోని రెండు రాష్ట్రాల్లో ఈడీ జరుపుతున్న దర్యాప్తుపైనా హేమంత్‌ సోరెన్‌ మాట్లాడారు. ఆ ప్రాంతాలను సందర్శించకుండా, సంబంధిత అధికారులను ప్రశ్నించకుండా ఈడీ దీనిపై ఎలా కేసు నమోదు చేసిందో తనకు అర్థం కావడం లేదన్నారు. కేసును లోతుగా దర్యాప్తు చేయడం వారికి అవసరం లేదు. తమ ప్రయోజనాలకు మాత్రమే ఉపయోగించుకోవాలనుకుంటున్నారు అని విమర్శించారు. మొహెంజొదారోలో తవ్వకాల మాదిరిగానే దేవాలయాలు, మసీదుల తవ్వకాలపై బీజేపీ ఆసక్తి చూపుతుందని సోరెన్ మండిపడ్డారు.

Published by:Venkaiah Naidu
First published:

Tags: Bihar News, Jharkhand

ఉత్తమ కథలు