బెంగాల్‌లో జూనియర్ డాక్టర్ల ఆందోళన... దాడిని నిరసిస్తూ ధర్నా

మరోవైపు ఆస్పత్రిలో వైద్య సేవలు నిలిచిపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వైద్య సేవలు అకస్మాత్తుగా నిలిచిపోవడంతో రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు

news18-telugu
Updated: June 14, 2019, 2:52 PM IST
బెంగాల్‌లో జూనియర్ డాక్టర్ల ఆందోళన... దాడిని నిరసిస్తూ ధర్నా
బెంగాల్‌లో జూడాల ధర్నా
news18-telugu
Updated: June 14, 2019, 2:52 PM IST
పశ్చిమబెంగాల్‌లో జూనియర్ డాక్టర్ల ఆందోళనకు దిగారు. ఎన్ఆర్ఎస్ మెడికల్ కాలేజీలో ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్లపై దాడిని నిరసిస్తూ నిరసనకు దిగారు. వారికి మద్దతుగా డాక్టర్లంతా అన్ని ప్రధాన నగరాల్లోని వైద్యులు శుక్రవారం సమ్మెకు దిగారు. ఎయిమ్స్‌ రెసిడెంట్‌ వైద్యుల సంఘం పిలుపు మేరకు డాక్టర్లు ఈ సమ్మె చేపట్టారు. ఢిల్లీ సహా ముంబయి, బెంగళూరు, హైదరాబాద్‌ తదితర ప్రధాన నగరాల్లో వైద్యులు విధులు బహిష్కరించి ఆందోళన చేస్తున్నారు. డాక్టర్ల ఆందోళన నాలుగోరోజుకు చేరింది. కోల్‌కతాలోని ఎన్ఆర్ఎస్ మెడికల్ కాలేజీలో రోగి బంధువులు ఓ వైద్యుడిపై దాడి చేశారు.తమ బంధువు వైద్యుల నిర్లక్ష్యంగా మరణించాడంటూ సోమవారం డాక్టర్లపై దాడికి దిగారు. దాదాపు 200మంది ఒకేసారి డాక్టర్లపై దాడి చేశారు. ఈఘటనలో తీవ్రంగా గాయపడిన వైద్యుడు తీవ్రగాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు.

బెంగాల్‌లో జూనియర్ డాక్టర్ల ఆందోళన... దాడిని నిరసిస్తూ ధర్నా


డాక్టర్లపై దాడిని నిరసిస్తూ... బెంగాల్‌ ఎస్ఆర్ఎస్ మెడికల్ కాలేజ్ విద్యార్థులు, డాక్టర్లు ఆందోళనకు దిగారు. కోల్ కతా డాక్టర్లపై దాడికి నిరసనగా ఢిల్లీలోని ఎయిమ్స్ సహా పాట్నా, రాయ్‌పూర్, రాజస్థాన్, పంజాబ్ వైద్యులు సంఘీభావం ప్రకటించారు. ముంబైలోని సియాన్ ఆసుపత్రి వైద్యులు కూడా సేవలు నిలిపివేసి ఆందోళనకు దిగారు. దేశ రాజధానిలో పలువురు రెసిడెంట్‌ వైద్యులు జంతర్‌ మంతర్‌ వద్దకు చేరి నిరసన చేపట్టారు. సమ్మె విరమించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి మమతాబెనర్జీ హెచ్చరించినప్పటికీ వాటిని వైద్యులు పట్టించుకోలేదు.. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకునేంతవరకు విధుల్లో చేరేది లేదని తేల్చి చెప్పారు.

Junior doctors of Nil Ratan Sircar (NRS) Medical College in Kolkata, బెంగాల్‌లో జూనియర్ డాక్టర్ల ఆందోళన... దాడిని నిరసిస్తూ ధర్నా
మరోవైపు ఆస్పత్రిలో వైద్య సేవలు నిలిచిపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వైద్య సేవలు అకస్మాత్తుగా నిలిచిపోవడంతో రోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దూరం నుంచి వచ్చిన వైద్యం కోసం ఆస్పత్రికి వచ్చిన రోగులు వైద్య అందక నానా అవస్థలు పడుతున్నారు.
First published: June 14, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...