• Home
  • »
  • News
  • »
  • national
  • »
  • JUNA AKHARA CHIEF CALLS OFF KUMBH MELA HOURS AFTER PM MODIS APPEAL AMID WORSENING COVID CRISIS SK

ముగిసిన కుంభమేళా.. గడువు కంటే ముందే సమాప్తం.. మోదీ విజ్ఞప్తితో జునా అఖాడా నిర్ణయం

కుంభ మేళా

ఏప్రిల్ 1న హరిద్వార్‌లో కుంభమేళా ప్రారంభమయింది. ఏప్రిల్ 30న ముగియాల్సి ఉంది. ఇప్పటి వరకు రెండు షాహి స్నాన్ (పవిత్ర స్నాన కార్యక్రమాలు) జరిగాయి.

  • Share this:
    హరిద్వార్‌లో జరుగుతున్న కుంభ మేళా కొన్ని రోజులుగా మనదేశంలో చర్చ జరుగుతోంది. కుంభ మేళా తర్వాత భారీగా కరోనా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో విమర్శలు వెల్లవెత్తాయి. ప్రధాని మోదీ సైతం కుంభ మేళాపై దృష్టి సారించారు. ఇప్పటికే రెండు పుణ్యాస్నానాలు ముగిసినందున ఇక నుంచి ప్రతీకాత్మకంగానే నిర్వహించాలని జునా అఖాడాకు విజ్ఞప్తి చేశారు ప్రధాని మోదీ. ఆయన ట్వీట్ చేసిన కొన్ని గంటల్లోనే జునా అఖాడా అధిపతి ఆచార్య మహా మండలేశ్వర్ అవధేశానంద గిరి స్వామీజీ కీలక ప్రకటన చేశారు. కుంభమేళా ముగిసిందని ఆయన ట్వీట్ చేశారు. ''భారత ప్రజలు, వారి ప్రాణాలు అన్నింటి కంటే ముఖ్యం. కరోనా విజృంభణ నేపథ్యంలో కుంభ్‌కు సంబంధించిన అన్ని దేవతా విగ్రహాలను నిమజ్జనం చేశాం. ఇది జునా అఖాడాకు కుంభ్ ముగిసింది.'' అని ట్వీట్ చేశారు అవధేశానంద.




    అంతకు ముందు కుంభమేళాను ఉద్దేశించి ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. జునా అఖాడా అధిపతి అవధేశానంద స్వామీజితో మాట్లాడానని.. సాధువుల ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నానని చెప్పారు. ఇప్పటి వరకు కుంభమేళాలో రెండు పుణ్యస్నానాలు ఆచరించారని.. ఇకపై కుంభమేళాలో జరిగే క్రతువులను ప్రతీకాత్మకంగానే నిర్వహించుదామని పేర్కొన్నారు. తద్వారా కరోనాపై మరింత బలంగా పోరాటం చేయగలమని అన్నారు. కుంభమేళాను ముగించాలని పరోక్షంగా సూచించారు ప్రధాని. ఆయన ట్వీట్ చేసిన కొన్ని గంటల్లోనే జునా అఖాడా స్పందించింది. కుంభమేళాను ముగిస్తున్నట్లు ప్రకటించింది.


    ఏప్రిల్ 1న హరిద్వార్‌లో కుంభమేళా ప్రారంభమయింది. ఏప్రిల్ 30న ముగియాల్సి ఉంది. ఇప్పటి వరకు రెండు షాహి స్నాన్ (పవిత్ర స్నాన కార్యక్రమాలు) జరిగాయి. ఏప్రిల్ 12న సోమ్వాతి అమావాస్య మొదటి షాహి స్నాన్, ఏప్రిల్ 14న మేష సంక్రాంతి సందర్భంగా లక్షలాది మంది భక్తులు పుణ్యా స్నానాలు చేశారు. దాదాపు 50 లక్షల మంది ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు తెలిసింది. ఐతే ఇక్కడ కోవిడ్ నిబంధనలను ఎవరూ పట్టించుకోకపోవడంతో కరోనా విజృంభించింది. సాధువులతో పాటు సాధారణ ప్రజలకు కరోనా సోకింది. కరోనాతో మహమండలేశ్వర్‌ కపిల్‌ దేవ్‌దాస్‌ ఏప్రిల్‌ 15న కరోనాతో మరణించడంతో అందరిలోనూ ఆందోళన నెలకొంది. కుంభ మేళాపై విమర్శలు వెల్లువెత్తడంతో.. ప్రధాని మోదీ విజ్ఞప్తి మేరకు కుంభ్‌ ముగిసినట్లు జునా అఖాడా ప్రకటించింది.


    భారత్‌లో కొత్తగా 2,34,692 కరోనా కేసులొచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 1,45,26,609కి చేరింది. కొత్తగా 1,341 మంది చనిపోవడంతో... మొత్తం మరణాల సంఖ్య 1,75,649కి చేరింది. దేశంలో మరణాల రేటు 1.2 శాతానికి పెరిగింది. తాజాగా 1,23,354 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 1,26,71,220కి చేరింది. రికవరీ రేటు 87.2 శాతానికి పడిపోయింది. ప్రస్తుతం దేశంలో 16,79,740 యాక్టివ్ కేసులు ఉన్నాయి
    Published by:Shiva Kumar Addula
    First published: