CAAకి బాలీవుడ్ బ్యూటీ మద్దతు.. దీపికా పదుకొణెకి గట్టి కౌంటర్

ఇటీవల చపాక్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో CAA వ్యతిరేక ఆందోళనలపై దీపికా పదుకొణె మాట్లాడారు. ఆందోళనలు చేస్తున్న వారిని చూసి గర్వంగా ఉందని.. పరోక్షంగా CAAని తప్పుబట్టారు. తమ గళాన్ని గట్టిగా వినిపిస్తున్నారని కొనియాడింది.

news18-telugu
Updated: January 9, 2020, 5:48 PM IST
CAAకి బాలీవుడ్ బ్యూటీ మద్దతు.. దీపికా పదుకొణెకి గట్టి కౌంటర్
జుహి చావ్లా
  • Share this:
పౌరసత్వ సవరణ చట్టం (CAA)కి వ్యతిరేకంగా దేశంలో దుమారం కొనసాగుతోంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో బాలీవుడ్ సెలబ్రిటీలు ఇప్పుడిప్పుడే CAA, NRC అంశాలపై మాట్లాడుతున్నారు. ఇప్పటికే దీపికా పదుకొణె CAAకి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలను సమర్థించింది. తాజాగా జుహి చావ్లా సైతం దీనిపై నోరు విప్పారు. దీపికా వ్యతిరేకిస్తే.. జుహి చావ్లా మాత్రం CAA, NRCకి అనుకూలంగా మాట్లాడారు. ప్రభుత్వాన్ని విమర్శించే బదులు.. అసలు ఎందుకు ఇలాంటి చట్టాలు తెస్తున్నారో క్షుణ్ణంగా తెలుసుకోవాలని సూచించారు.

NRC అంటే ఏంటి? CAA అంటే ఏంటో ముందు ప్రజలను తెలుసుకోనీయండి. అది దేని గురించి? ఎందుకు తెస్తున్నారో చర్చించుకోనీయండి. అందరూ విభజన గురించే మాట్లాడుతున్నారు. ఐక్యత గురించి ఎందుకు మాట్లాడరు? మీరు ఒకరి వైపు వేలు చూపిస్తే.. మీ వైపు మూడు వేళ్లు చూపిస్తారు. ప్రశాంతంగా ఉండండి. పరిస్థితులను అర్థం చేసుకోండి.
జుహి చావ్లా
కాగా, ఇటీవల చపాక్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో CAA వ్యతిరేక ఆందోళనలపై దీపికా పదుకొణె మాట్లాడారు. ఆందోళనలు చేస్తున్న వారిని చూసి గర్వంగా ఉందని.. పరోక్షంగా CAAని తప్పుబట్టారు. తమ గళాన్ని గట్టిగా వినిపిస్తున్నారని కొనియాడింది. సమాజంలో, జీవితంలో మార్పులు రావాలంటే అన్ని కోణాలు, అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాలని అభిప్రాయపడింది. దీపిక వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున దుమారం రేగిన విషయం తెలిసిందే. బీజేపీ #BanChhapaak హ్యాష్ ట్యాగ్‌ను వైరల్ చేసింది. దీపిక కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించగా...జుహి బాసటగా నిలిచిందని బీజేపీ సానుభూతిపరులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు.
First published: January 9, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు