హోమ్ /వార్తలు /జాతీయం /

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్‌ లైంగిక వేధింపులకు పాల్పడ్డారా... నిజానిజాలేంటి...

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్‌ లైంగిక వేధింపులకు పాల్పడ్డారా... నిజానిజాలేంటి...

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ (ఫైల్)

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ (ఫైల్)

Ranjan Gogoi : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ పై ఆరోపణలు రావడంతో తీవ్ర కలకలం రేగుతోంది. న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని ఇది సవాలు చేస్తోందా...

    సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ ఓ మహిళపై లైంగిక వేధింపులకు పాల్డడ్డారనే ఆరోపణలు దుమారం రేపుతున్నాయి. సుప్రీంకోర్టు మాజీ ఉద్యోగిని ఒకరు ఈ ఆరోపణలు చేశారు. ఛీఫ్

    జస్టిస్ రంజన్ గొగోయ్ ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ఇది సవాలు లాంటిదన్న ఆయన... న్యాయ వ్యవస్థను అస్థిరపరిచే కుట్ర జరుగుతోందని మండిపడ్డారు. నిజానికి శనివారం సెలవైనప్పటికీ... చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ అధ్యక్షనత ముగ్గురు సభ్యుల బెంచ్ ఈ అంశాన్ని పరిశీలించింది. కంప్లైంట్ వెనక కుట్ర ఉందన్న గొగోయ్... ఆ మహిళ వెనక ఏదో బలమైన శక్తి ఉందని ఆరోపించారు. ఇది దేశ ప్రజలకు సంబంధించిన ముఖ్యమైన విషయమని చెప్పిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా... దీనిపై విచారణ జరపాలని కోరారు.


    జస్టిస్ గొగోయ్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనీ, తనను, తన భర్తను, ఇతర కుటుంబ సభ్యుల్నీ బాధితులుగా చేశారని ఆమె తన కంప్లైంట్‌లో తెలిపారు. మొత్తం 22 మంది సుప్రీంకోర్టు జడ్జిలకు ఆమె లేఖ రాశారు. 2014 మే 1 నుంచి 2018 డిసెంబరు 21 వరకు సుప్రీంకోర్టులో జూనియర్ కోర్టు అసిస్టెంట్‌గా పనిచేసినట్లు ఆమె లేఖలో తెలిపారు. ఆమెకు నేర చరిత్ర ఉందన్న రంజన్ గొగోయ్... ఆమె 4 రోజులు జైల్లో ఉన్నారని గుర్తుచేశారు.


    "2018 డిసెంబరులో నన్ను ఉద్యోగంలోంచి తీసేశారు. ఢిల్లీ పోలీసు విభాగంలో హెడ్‌కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్న నా భర్త, ఆయన సోదరుణ్ని సస్పెండ్ చేశారు. మార్చి 3న నాపై ఓ తప్పుడు FIR నమోదైంది. సుప్రీంకోర్టులో ఉద్యోగం ఇప్పించేందుకు 2017లో హర్యానాకు చెందిన నవీన్ నుంచీ నేను రూ.50,000 అడ్వాన్స్ తీసుకున్నాననే ఆరోపణపై ఆ కేసు నమోదు చేశారు. అదే రోజు రాత్రి నన్ను అరెస్టు చేశారు. నా భర్తను పోలీసు కస్టడీకి తీసుకొని కొట్టారు. నన్ను ఒక రోజు పోలీసు కస్టడీలో, ఇంకో రోజు జ్యుడీషియల్ కస్టడీలో ఉంచారు. తర్వాత నేను బెయిల్ పొందాను. నా బెయిల్ రద్దుకు పోలీసులు అప్లికేషన్ పెట్టారు. జస్టిస్ గొగోయ్‌కి లైంగికంగా సహకరించనందుకే నన్ను, నా కుటుంబ సభ్యుల్నీ ఇబ్బంది పెడుతున్నారు. నా ఆరోపణలపై సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జిలతో ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నాను -
    బాధిత మహిళ


    స్వయంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపైనే ఓ మహిళ ఇంతటి ఆరోపణలు చేయడంతో ఈ అంశం న్యాయవ్యవస్థను కుదిపేస్తోంది ఆమె ఆరోపణలపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని ఇతర న్యాయ నిపుణులు కోరుతున్నారు.

    First published:

    Tags: CJI Ranjan Gogoi, Supreme Court

    ఉత్తమ కథలు