జర్నలిస్టులపై దాడులు రోజురోజుకు పెరుగున్నాయి. జర్నలిస్టులు స్వేచ్ఛగా, నిర్భయంగా పనిచేస్తుంటే తట్టుకోలేని కొందరు..తమ వ్యక్తిగత కక్షలతో దాడులకు దిగుతున్నారు. నిత్యం ఏదో ఒక చోట ఇలాంటి దాడులు జరుగుతూనే ఉండగా.. తాజాగా అలాంటి దారుణ ఘటనే మధ్యప్రదేశ్‌లో జరిగింది. ఒక టీవీ ఛానెల్, ఆన్‌లైన్ న్యూస్ ఔట్‌లెట్‌కు జర్నలిస్ట్‌గా పనిచేస్తున్న ప్రకాశ్ యాదవ్ అనే యువకుడుపై మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్‌లో ఓ గ్యాంగ్ దాడి చేసింది.
गणतंत्र की यह तस्वीर मध्य प्रदेश के माखननगर की है। महान कवि और पत्रकार माखनलाल चतुर्वेदी की जन्मभूमि पर एक पत्रकार को पेड़ से बांधकर गुंडों ने पीटा। एमपी के दुःशासन का अंत होना ज़रूरी है।https://t.co/71JOl9K6gP pic.twitter.com/I40PGcldpw
— Adv.Ravindra Singh Yadav (@ravindra_devv) January 27, 2023
పక్కా స్కెచ్‌తో దాడి:
విధులు ముగించుకున్న ప్రకాశ్ యాదవ్ రోజులానే తన స్వగ్రామమైన కోట్గావ్‌కు బయలుదేరాడు. బైక్‌పై వస్తున్న ప్రకాశ్ యాదవ్‌ను మార్గమధ్యలో నారాయణ్ యాదవ్ అనే యువకుడు అడ్డుకున్నాడు. జనవరి 1న ఇద్దరి మధ్య జరిగిన గొడవను మనసులో పెట్టుకుని ప్రకాశ్‌తో మళ్లీ వాగ్వాదానికి దిగాడు. నారాయణ్‌కు అతడి సోదరుడు ఓం ప్రకాశ్ జత కలవడంతో ఈ గొడవ ఇంకా పెద్దదైంది. మాటామాట పెరగడంతో సహనం కోల్పోయిన నారాయణ్, ఓం ప్రకాశ్.. జర్నలిస్ట్‌పై దాడికి దిగారు. ఇక నిమిషాల్లోనే నారాయణ్ స్నేహితులు మరికొందరు అక్కడికి చేరుకున్నారు. ప్రకాశ్ యాదవ్‌ను చెట్టుకు కట్టేసి విచక్షణ రహితంగా కొట్టారు. ఏదో ఘనకార్యం చేసినట్లు ఈ దాడి దృశ్యాలను ఫోన్‌లో వీడియో తీసుకున్నారు. ఒకరు దానిని సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది వైరల్‌గా మారింది.
బాధితుడు ఫిర్యాదు.. ఆరుగురు అరెస్ట్:
దాడి తర్వాత అక్కడ నుంచి పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న ప్రకాశ్ యాదవ్.. జరిగిన విషయాన్ని పోలీసులకు వివరించాడు. తనపై దాడి చేసిన వారిపై ఫిర్యాదు చేశాడు. వివిధ సెక్షన్ల కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఇక సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. దేశంలో ఇలాంటి ఘటనలు నిత్యం ఎక్కడో అక్కడ జరుగుతూనే ఉంటున్నాయని కామెంట్లు పెడుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Journalist, Madya pradesh