యూపీ సీఎంను ప్రశ్నించిన జర్నలిస్ట్‌పై కేసు.. ఇంతకీ ఏం అడిగారంటే..

అయితే, తన మీద పెట్టిన కేసు రాజకీయ ప్రేరేపితంగా ఉందని సిద్ధార్థ్ వరదరాజన్ అన్నారు.

news18-telugu
Updated: April 2, 2020, 2:29 PM IST
యూపీ సీఎంను ప్రశ్నించిన జర్నలిస్ట్‌పై కేసు.. ఇంతకీ ఏం అడిగారంటే..
యోగి ఆదిత్యనాథ్
  • Share this:
ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను ప్రశ్నించిన ఓ జర్నలిస్టు మీద పోలీసులు కేసు నమోదు చేశారు. దేశంలో లాక్ డౌన్ ఉన్న నేపథ్యంలో రామజన్మభూమి పేరిట ఓ భారీ ఆధ్యాత్మిక కార్యక్రమం చేపట్టాలనుకున్న యోగి ఆదిత్యానాథ్ తీరును ప్రశ్నించిన జర్నలిస్టు మీద కేసు నమోదైంది. ‘ది వైర్’ వెబ్‌సైట్‌కు చెందిన ఎడిటర్ సిద్ధార్ద్ వరదరాజన్ మీద కేసు నమోదైంది. ఆయన చేసిన ట్వీట్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేశారు. వరదరాజన్ చేసిన ట్వీట్‌లో ఏముందంటే.. ‘తబ్లిగి జమాత్ కార్యక్రమం జరిగిన రోజే ఆదిత్యనాథ్ కూడా రామనవమి ఉత్సవం పేరుతో మార్చి 25 నుంచి ఏప్రిల్ 2 వరకు కార్యక్రమం చేపట్టాలనుకున్నారు. కరోనా వైరస్ నుంచి రాముడు కాపాడతాడంటూ ఈ ప్రోగ్రామ్ చేయాలనుకున్నారు.’ అని ట్వీట్‌లో ఉంది. మరో ట్వీట్‌ చేసిన వరద రాజన్ ‘లాక్ డౌన్ నేపథ్యంలో మార్చి 25న యోగి ఆదిత్యనాథ్ భారీ ప్రోగ్రాం నిర్వహిస్తే, భక్తులను కరోనా వైరస్ నుంచి ఆ రాముడు కాపాడతాడు కానీ, యోగిని మాత్రం కాపాడడు అని అయోధ్య ఆలయ ట్రస్ట్‌ అధికారిక హెడ్, హిందుత్వ యోధుడు ఆచార్య పరమహంస చెప్పారు.’ అంటూ మరో ట్వీట్ చేశారు.ఈ ట్వీట్లను సుమోటోగా తీసుకున్న ఫైజాబాద్ పోలీసులు సిద్ధార్ద్ వరదరాజన్ మీద ఐపీసీ సెక్షన్లు 188, 505 (2) కింద కేసులు నమోదు చేశారు. ముఖ్యమంత్రి మీద అగౌరవమైన వ్యాఖ్యలు చేసినందుకు ఆయన మీద కేసులు నమోదు చేశారు. ఈ కేసును ‘ది వైర్’ వ్యవస్థాపక ఎడిటర్స్ ఖండించారు.

అయితే, తన మీద పెట్టిన కేసు రాజకీయ ప్రేరేపితంగా ఉందని సిద్ధార్థ్ వరదరాజన్ అన్నారు.
First published: April 2, 2020, 2:28 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading