హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Joshimath: మరో జోషిమఠ్‌..? కుంగిపోతుందా..? మునిగిపోతుందా..? భయం భయం..!

Joshimath: మరో జోషిమఠ్‌..? కుంగిపోతుందా..? మునిగిపోతుందా..? భయం భయం..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Joshimath: ఉత్తరాఖండ్‌కు వ్యూహాత్మక, కీలకమైన జాతీయ రహదారైన NH-58పై పగుళ్లు రావడంతో సమీప ప్రాంతాల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.ఇది బద్రీనాథ్‌కు వెళ్లే ఏకైక రోడ్‌ మార్గం. ఇక చైనా సరిహద్దు వైపు చివరి భారతీయ గ్రామం మనాకు ఉన్న ఏకైక మార్గం ఇదే. పగుళ్లు ఏర్పడిన ప్రాంతంలో సీబీఆర్‌ఐ టీమ్‌ రంగంలోకి దిగింది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

అశాస్త్రీయత కొంపముంచుతోంది..! అవగాహనలేమి ఓ రాష్ట్రాన్ని పెను ప్రమాదంలో పడేస్తోంది. దైవభూమి ఉత్తరాఖండ్‌ అనుక్షణం భయంతో వణికిపోతోంది. ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందో తెలియదు.. ఎప్పుడు ఏ భూమి కుంగిపోతుందో అర్థంకాదు.. అడుగుతీసి అడుగు వేయాలంటే భయం.. ఏ రోడ్డుకు ఏ పగుళ్లు పుట్టాయోనన్న ఆందోళన..! పర్యాటకులతో,దైవ దర్శనలతో అనునిత్యం రద్ధీగా ఉండే ఉత్తరాఖండ్‌ను ఇప్పుడు టెన్షన్ తరుముతోంది. జోషిమఠ్‌ భూమి కుంగిపోవడం.. ఆ తర్వాత జరిగిన, జరుగుతున్న పరిణామాలు మరింత కలవర పెడుతున్నాయి. ఒక్క జోషిమఠ్‌తోనే ఆగిపోయి ఉంటే మనం ఇప్పటికీ ఆ విషయాన్ని చర్చించుకునేవాళ్లం కాదు కానీ.. ఉత్తరాఖండ్‌ వ్యాప్తంగా మిగిలిన ప్రాంతాల్లో.. ముఖ్యంగా బద్రినాథ్ సరిహద్దు ప్రాంతాల్లో భూమికి పగుళ్లు వస్తుండడం మరింత ఆందోళన కలిగిస్తోంది. తాజాగా బద్రినాథ్‌ జాతీయ రహదారి-58పై పగుళ్లు ఏర్పడడంతో సీబీఆర్‌ఐ బృందం రంగంలోకి దిగింది.

జాతీయ రహదారిపై పగుళ్ల:

ఉత్తరాఖండ్‌కు వ్యూహాత్మక, కీలకమైన జాతీయ రహదారైన NH-58పై పగుళ్లు రావడంతో సమీప ప్రాంతాల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.ఇది బద్రీనాథ్‌కు వెళ్లే ఏకైక రోడ్‌ మార్గం. ఇక చైనా సరిహద్దు వైపు చివరి భారతీయ గ్రామం మనాకు ఉన్న ఏకైక మార్గం ఇదే. పగుళ్లు ఏర్పడిన ప్రాంతంలో సీబీఆర్‌ఐ టీమ్‌ రంగంలోకి దిగింది.రహదారి మరమ్మతు పనులను పర్యవేక్షిస్తోంది.

మరో జోషిమఠ్‌ అంటూ సైంటిస్టుల వార్నింగ్‌:

రహదారిపై పగుళ్లు మరింత పెరిగే అవకాశాలున్నట్లు సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. జోషిమఠ్‌ భూమి కుంగిపోవడాన్ని అధ్యయనం చేస్తున్న శాస్త్రవేత్తలు ఓ స్ట్రాంగ్‌ వార్నింగ్‌ ఇచ్చారు.భారీ వర్షం కురిస్తే పగుళ్లు మరింత పెరిగే ఛాన్స్‌ ఉందంటున్నారు. గ్రౌండ్ సెటిల్‌మెంట్, 'సైడ్ అండ్ సబ్సిడెన్స్' కారణంగా భూమికి పగుళ్లు ఏర్పడినట్లు ప్రాథమికంగా అంచనా వేశారు సైంటిస్టులు. దీని అర్థం రహదారికి దిగువన ఉన్న భూమి అస్థిరంగా ఉండటం. దీనికారణంగా రహదారి ఉపరితలంపై పగుళ్లు కనిపిస్తాయి. అటు రహదారి సామర్థ్యానికి మించి వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయని.. అందుకే భూమి లోపల ఒత్తిడి పెరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది మన సైన్యానికి కూడా ఆందోళన కలిగించే విషయమే..! ఎందుకంటే భద్రత దృష్ట్యా, ఇంకా రెస్క్యూ ఆపరేషన్‌ కోసం ఆర్మీ కూడా వినియోగించే రహదారి ఇదే కావడంతో మరమ్మతు పనులు త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

First published:

Tags: Badrinath, Joshimath, National, Uttarakhand

ఉత్తమ కథలు