Visakhapatnam: నిన్న రిపోర్టర్.. నేడు కలెక్టర్: అసోం ఎన్నికల్లో ఓటు హక్కుపై పిల్లలతో కలిసి అవగాహన కల్పిస్తున్న రోషిణి అపరంజి విశాఖపట్నం అమ్మాయే

జోర్హాట్ జిల్లా కలెక్టర్ రోషిణి అపరంజి

ప్రజలకి సేవచేయాలనే లక్ష్యంతో జర్నలిస్ట్ అవ్వాలి అనుకున్నారు రోషిణి అపరంజి.. దీంతో ఆంధ్ర యూనివర్శిటీ ఎంట్రన్స్ టెస్టులో రెండో ర్యాంక్ తెచ్చుకుని అనుకున్న లక్ష్యం సాధించారు. అయినా ఆ ఆనందం సరిపోలేదు. దీంతో నేరుగా ప్రజలకు సేవ చేయాలి అంటే కలెక్టర్ అవ్వడమే సరైన మార్గం అనుకున్నారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సివిల్స్ పై ఫోకస్.. చేసి కలెక్టర్ గా ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం అసోంలో విధులు నిర్వహిస్తున్న ఆ కలెక్టర్ మన విశాఖపట్నం అమ్మాయే.

  • Share this:
    రోషిణి అపరంజి ( Roshni Aparanji Korati) ప్రస్తుతం అసోంలోని కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు. అసోంలోని జోర్హాట్ (Jorhat) జిల్లా కలెక్టర్ గా ఉన్న రోషిణి మన తెలుగు అమ్మాయే అని చాలమందికి తెలియకపోవచ్చు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ గా అసోం (assam)వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఆమె. విధినిర్వహణలో దేన్నీ లెక్కచేయరని.. రౌండ్ ది క్లాక్ అందరికీ అందుబాటులో ఉంటారని.. జిల్లాలో ఎలాంటి సమస్య ఎదురైనా ముందుకు వచ్చి పరిష్కారానికి ప్రయత్నిస్తారని ఇప్పటికే ఆమె గుర్తింపు తెచ్చుకున్నారు. తాజాగా మరోసారి ఆమె వార్తల్లో నిలిచారు..

    ప్రస్తుతం అసోం, పశ్చిమ బెంగాల్ ల్లో తొలిదశ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆమె ఓటర్లకు అవగాహన కల్పించడానికి వినూత్న ప్రయత్నం చేశారు. తన ఇద్దరి బిడ్డలతో కలిసి.. ఓటు వేయండి అనే ఫ్లెక్సీలు పట్టుకున్నారు. ఆమె I am proud A voter అని ఫ్లెక్సీ పట్టుకోగా.. ఇద్దరు బిడ్డలు my mother is a proud voter అంటూ ఫ్లెక్సీలు పట్టుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బిడ్డలతో కలిసి ఆమె ఇలా ప్రజల్లో అవగాహన కల్పించే ప్రయత్నం చేయడం అందర్నీ ఆకట్టుకుంటోంది.

    కరోనా సమయంలో ఆమె చూపించిన తెగువ సైతం అక్కడి ప్రజలను, అధికారులను, ప్రజా ప్రతినిధులను ఆశ్చర్య పరిచేలా చేసింది. లాక్ డౌన్ సమయంలో క్షణం కూడా తీరిక లేకుండా పని చేశారు. అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ.. కఠిన నిబంధనలు అమలు అయ్యేలా చూశారు. జోర్హాట్ వాసులను కాపాడేందుకు అహర్నిశలు శ్రమించారు. లాక్‌డౌన్‌ను విజయవంతంగా అమలుచేయడం సక్సెస్ అయ్యారు. జిల్లా అంతా విరామం లేకుండా తిరిగారు. ప్రజల బాగోగుల్లో బిజిబిజీగా మారారు. ఎంతలా అంటే.. ఇద్దరు చిన్న బిడ్డలను కనీసం ఎత్తుకునే పరిస్థితి కూడా లేకుండా పని చేశారు.

    కలెక్టర్ రోషిణికి ఇద్దరు కొడుకులు. పెద్ద అబ్బాయికి ఐదేళ్లు, చిన్నోవాడికి రెండున్నర ఏళ్లు ఉంటాయి. అలాగే 65 ఏళ్లు పైబడిన తల్లిదండ్రులూ కూడా ఆమెతోపాటే ఉంటారు. అయితే వీరందరి కోసం ఓ అమ్మాయిలా కాకుండా.. ఇంట్లోనూ కలెక్టరమ్మలా ఆదేశాలు జారీ చేసి ఆశ్చర్యపరిచారు. పిల్లలు, పెద్దలు ఇంట్లో కిందివాటాలో ఉంటే.. ఆమె ఒక్కతే పైఅంతస్తులో ఉండేవారు. చిన్నపిల్లాడు అమ్మ కోసం ఏడ్చినా... ఆ ఏడుపు తన చెవిన పడినా.. గుండెను రాయి చేసుకొని.. మెట్టు దిగి రావడకుండా.. కరోనా నియంత్రణపైనే ఫోకస్ పెట్టేవారు. అది చూసి సిబ్బంది బాబు ఏడుస్తున్నాడమ్మ అని చెప్పినా.. కరోనా టైంలో ఫస్ట్ డ్యూటీ అంటూ.. ఆమె విధుల్లోనే నిమగ్నమయ్యేవారు. చిన్న బిడ్డలు ఇంట్లో ఉన్నా రోజంతా బయటే ఉండేవారు. జిల్లాలో పాజిటివ్ కేసులు పెరగకుండా ఆమె చేసిన ప్రయత్నాలు చాలా వరకు సక్సెస్ అయ్యాయి. ఉన్నతస్థాయి అధికారుల నుంచి మెప్పు కూడా పొందారు. కరోనా అనుమానితులను పర్యవేక్షించడానికి.. జిల్లాలో పరిస్థితి సమీక్షించడానికి ఆమె ఐసోలేషన్‌ సెంటర్లు,క్వారంటైన్‌ సెంటర్‌కి వెళ్లాల్సి వచ్చేది. అలాంటి సమయంలో మరింత బాధ్యతగా ఉండాలనే కారణంతో చిన్న పిల్లలు, వయసు పైబడిన పెద్దలను దూరంగానే పెట్టారు. దాదాపు నాలుగు నెలలు తర్వాత పరిస్థితి అదుపులోకి వచ్చాకే బిడ్డను దగ్గరకి తీసుకుని.. అమ్మ మనసు చాటుకున్నారు. ఇలా ఆమె కలెక్టర్ గా జిల్లాపై తనదైన ముద్ర వేశారు.

    అయితే ప్రస్తుతం జోర్హాట్ లో కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నఆమె విశాఖకు చెందిన అమ్మాయే.. ఆమె ఆంధ్రా యూనివర్శిటీలో జర్నలిజం రెండేళ్ల కోర్స్ పూర్తి చేశారు. ఆ టెస్టులో ఆమెకు ఏయూ వ్యాప్తంగా రెండో ర్యాంక్ రావడం విశేషం. ఆసెట్ లో మంచి ర్యాంక్ సాధించిన ఆమె. ఓ వైపు జర్నలిజం చేస్తూనే.. ఇంటర్నిషిప్ లో భాగంగా స్థానిక ఇంగ్లీష్ పత్రికల్లో జర్నలిస్టుగా కూడా సేవలు అందించారు. ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతోనే జర్నలిస్టుగా మారాను అని ఆమె తరచూ చెప్పేవారు. అయితే ఆనందం అనిపంచకపోవడంతో ఓ వైపు జర్నలిజం చదువుతూనే.. మరోవైపు ఐ.ఎ.ఎస్ పరీక్షలకు సిద్ధమయ్యారు. 2005 -2007లో జర్నలిజం పూర్తి చేసిన ఆమె.. తరువాత హైదరాబాద్ వెళ్లి ఐ.ఎ.ఎస్ పరీక్షల కోసం ప్రత్యేక కోచింగ్ తీసుకున్నారు. పట్టుదలతో పరీక్ష రాసి నేరుగా ఐ.ఎ.ఎస్ కు సెలెక్ట్ అయ్యి సత్తా చాటారు. చదువుతున్న సమయంలో ఎంత కఠినంగా శ్రమిం చారు. కలెక్టర్ అయిన తరువాత కూడా ఆమెలో అదే పట్టుదల కనిపిస్తోంది. నిబద్ధతతో పని చేస్తున్నారనే గుర్తింపు తెచ్చుకున్నారు.
    Published by:Nagesh Paina
    First published: