హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

BYJU'S Young Genius: ఆమె పరిగెడితే అవార్డులు ఎదురు రావాల్సిందే.. తొమ్మిదేళ్లకే అనేక అవార్డులు.. ప్రధాని నుంచి ప్రశంసలు.. చిన్నారి పూజ సక్సెస్ స్టోరీ

BYJU'S Young Genius: ఆమె పరిగెడితే అవార్డులు ఎదురు రావాల్సిందే.. తొమ్మిదేళ్లకే అనేక అవార్డులు.. ప్రధాని నుంచి ప్రశంసలు.. చిన్నారి పూజ సక్సెస్ స్టోరీ

ప్రాక్టీస్ చేస్తున్న పూజ

ప్రాక్టీస్ చేస్తున్న పూజ

నెట్వర్క్ 18 బైజూస్ యంగ్ జీనియస్ కార్యక్రమం ద్వారా వివిధ రంగాల్లో రాణిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న చిన్నారులను అందరికీ పరిచయం చేస్తోంది. జనవరి 23 శనివారం ప్రసారం కానున్న రెండవ ఎపిసోడ్‌లో ప్రేక్షకులు రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో నివసిస్తున్న అథ్లెట్, ఒలింపిక్స్‌కు సిద్ధమవుతున్న పూజా బిష్ణోయిని చూడనున్నారు.

ఇంకా చదవండి ...

  నెట్వర్క్  18 బైజూస్ యంగ్ జీనియస్ కార్యక్రమం ద్వారా వివిధ రంగాల్లో రాణిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న చిన్నారులను అందరికీ పరిచయం చేస్తోంది. ఈ సిరీస్ యొక్క రెండవ ఎపిసోడ్ జనవరి 23 శనివారం ప్రసారం కానుంది. రెండవ ఎపిసోడ్‌లో ప్రేక్షకులు రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో నివసిస్తున్న అథ్లెట్, ఒలింపిక్స్‌కు సిద్ధమవుతున్న పూజా బిష్ణోయిని ప్రేక్షకులు చూడనున్నారు. పూజ బిష్ణోయ్ వయస్సు కేవలం తొమ్మిది సంవత్సరాలు కానీ ఆమె అందుకున్న అభినందనలు మాత్రం అనేకం. దేశ వ్యాప్తంగా ఆమె తన ప్రతిభతో అభిమానులను సంపాధించుకున్నారు. భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లికి చెందిన ఫౌండేషన్ ఆ చిన్నారికి సహాయం కూడా అందిస్తోంది. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ పూజాకు అభిమాని అంటే అతిషయోక్తి కాదు.

  దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఈ చిన్నారిని ఆమె భర్త్ డే రోజు శుభాకాంక్షలు చెప్పి అభినందించారు. ప్రధాని స్థాయి వ్యక్తి నుంచే అభినందనలు అందుకుంది అంటే పూజా ప్రతిభ ఏ స్థాయిదో అర్థం చేసుకోవచ్చు. పశ్చిమ రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ జిల్లాలోని గుడా విష్ణోయన్ గ్రామానికి చెందిన పూజాకు గెలుపు అలవాటైంది. చూడడానికి అమాయకంగా కనిపించే ఈ అథ్లెట్ లక్ష్యాలు చాలా దృఢంగా ఉన్నాయి.

  అనేక రికార్డులు..

  శ్రావణ బుధియా పూజ కోచ్. ఈ వయసులో పూజా 12 నిమిషాల 50 సెకన్లలో 3 కిలోమీటర్లు పూర్తి చేసిన రికార్డు సృష్టించింది. అదే సమయంలో, 10 కిలోమీటర్ల రేసు 48 నిమిషాల్లో పూర్తి చేసింది. ప్రపంచ స్థాయిలో రాణించడమే లక్ష్యంగా పూజా సాధన చేస్తుండడం విశేషం. సూర్యుడు ఉదయించకముందే ఆ చిన్నారి తన సాధన మొదలు పెడతారు. తల్లిదండ్రులు, కోచ్ ప్రోత్సాహంతో తాను ఈ లక్ష్యాన్ని సాధిస్తానని పూజా చెబుతున్నారు. అమితాబ్ బచ్చాన్, విరాట్ కోహ్లీ, ప్రధాని మోదీ  లాంటి అనేక మంది ప్రముఖులు, ఇతర అభిమానులు వివిధ వేదికల ద్వారా అందిస్తున్న ప్రోత్సాహంతో పూజ ముందుకు సాగుతున్నారు. ఆమె తాను అనుకున్న లక్ష్యాలను త్వరగా చేరుకుని విజయవంతం కావాలని ఆశిద్దాం.

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: BYJUS, Network18, Rajasthan

  ఉత్తమ కథలు