విద్యార్థుల ర్యాలీలో ఉద్రిక్తత.. ఢిల్లీలో 3 మెట్రో స్టేషన్‌లు బంద్

జేఎన్‌యూ విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో పార్లమెంట్ సమీపంలోని మెట్రో స్టేషన్‌లను మూసివేశారు. ఉద్యోగ్ భవన్, పటేల్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియెట్‌లో ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లను తాత్కాలికంగా మూసివేశారు.

news18-telugu
Updated: November 18, 2019, 6:20 PM IST
విద్యార్థుల ర్యాలీలో ఉద్రిక్తత.. ఢిల్లీలో 3 మెట్రో స్టేషన్‌లు బంద్
విద్యార్థుల అరెస్ట్
  • Share this:
జేఎన్‌యూ విద్యార్థుల ఆందోళనలతో ఢిల్లీ అట్టుడుకుతోంది. మెస్ ఫీజు తగ్గించడంతో పాటు పలు డిమాండ్లలో యూనివర్సిటీ విద్యార్థులు రోడ్డెక్కారు. భారీ ర్యాలీతో పార్లమెంట్‌ను ముట్టడించేందుకు ప్రయత్నించడంతో సర్దార్‌జంగ్ టూంబ్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దాంతో అక్కడే బైఠాయించి నిరసన తెలిపారు విద్యార్థులు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించడంతో విద్యార్థులు ఎదురు తిరిగారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి అదుపు తప్పడంతో విద్యార్థులపై లాఠీచార్జ్ చేశారు పోలీసులు. ఆందోళనకారులను తరిమి తరిమి కొట్టారు. పోలీసుల లాఠీచార్జ్‌లో పలువురు విద్యార్థులకు గాయలయ్యాయి. జేఎన్‌యూ విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో పార్లమెంట్ సమీపంలోని మెట్రో స్టేషన్‌లను మూసివేశారు. ఉద్యోగ్ భవన్, పటేల్ చౌక్, సెంట్రల్ సెక్రటేరియెట్‌లో ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లను తాత్కాలికంగా మూసివేశారు. విద్యార్థుల ర్యాలీతో లుటిన్స్ ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది. దాంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నెల్సన్ మండేలా మార్గ్, అరబిందో మార్గ్, బాబాగంగ్ నాథ్ మార్గ్‌లో వాహనాలు నత్తనడకన కదులుతున్నాయి. మరోవైపు విద్యార్థుల ఆందోళనలపై కేంద్ర మానవవనరులశాఖ సహాయమంత్రి సంజయ్ ధోత్రే స్పందించారు. ఎంతో మంది నాయకులను జేఎన్‌యూ అందించిందని.. అలాంటి యూనివర్సిటీలో ఇలాంటి ఘటనలు జరగడం కరెక్ట్ కాదన అభిప్రాయప్డడారు.

First published: November 18, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...