హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

JK Encounter: జమ్మూకాశ్మీర్‌లో కాల్పులు మోత.. మరో ముగ్గురు టెర్రరిస్టులు హతం

JK Encounter: జమ్మూకాశ్మీర్‌లో కాల్పులు మోత.. మరో ముగ్గురు టెర్రరిస్టులు హతం

అనంత్ నాగ్ లో ఎన్ కౌంటర్(ప్రతీకాత్మక చిత్రం)

అనంత్ నాగ్ లో ఎన్ కౌంటర్(ప్రతీకాత్మక చిత్రం)

Jammu kashmir Encounter: ఈ ఏడాది ఇప్పటి వరకు మొత్తం 11 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. నాలుగు ఎన్‌కౌంటర్లలో 10 మంది మరణించగా.. ఎల్‌వోసీ మీదుగా భారత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన మరో టెర్రరిస్టును బీఎస్ఎఫ్ దళాలు కాల్చిచంపాయి.

  జమ్మూకాశ్మీర్‌ (Jammu and Kashmir)లో కాల్పుల మోత మోగుతోంది. ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. తాజాగా బుద్గాం జిల్లాలో భీకర కాల్పులు (Budgam Encounter) జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. బుద్గాంలోని జొల్వా క్రాల్పొరా చందూరా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో భద్రతా దళాలు కూంబింగ్ చేపట్టాయి. ఉగ్రవాదులు ఉంటున్న ఇంటిని చుట్టుముట్టి లొంగిపోవాలని సూచించాయి. కానీ వారు వినలేదు. జవాన్లపై కాల్పులు జరపడంతో.. ఆర్మీ కూడా ఎదురు కాల్పులకు దిగింది. ఈ కాల్పుల్లో ముగ్గురు టెర్రరిస్టులు మరణించారు. వారి వద్ద నుంచి మూడు ఏకే 56 రైఫిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. మృతుల్లో ఒకరిని శ్రీనగర్ సిటీకి చెందిన వసీంగా గుర్తించారు. మృతి చెందిన ఉగ్రవాదులంతా జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన వారని పోలీసులు వెల్లడించారు. బుద్గాంలో ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని చెప్పారు.

  India Corona Bulletin: లక్ష దాటిన రోజువారీ కరోనా కేసులు..ఆ రాష్ట్రాల్లో బీభత్సం

  16వేల కిలోల గంజాయి సీజ్.. అంత పెద్దమొత్తంలో ఎక్కడ దొరికింది..?

  అంతకుముందు బుధవారం కూడా కశ్మీర్‌లో భీకర ఎన్‌కౌంటర్ జరిగింది. పుల్వామా జిల్లా చంద్గామ్ ప్రాంతంలో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా దళాలు హతమార్చాయి. వారిని నుంచి రెండు ఎం-4 కార్బైన్, ఒక ఏకే సిరీస్ రైఫిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. కార్డన్ సెర్చ్ చేస్తుండగా ఉగ్రవాదులు కాల్పలు జరిపారని.. దాంతో ఎన్‌కౌంటర్ జరిగిందని పోలీసులు వెల్లడించారు. వారంతా జైషే మహమ్మద్‌కు చెందినవారేనని తెలిపారు.

  ధాని పంజాబ్ పర్యటనలో భద్రత వైఫల్యం..నిర్లక్ష్యమా..! నీచ రాజకీయమా..

  జమ్మూకాశ్మీర్‌లో మళ్లీ కొన్ని రోజులుగా ఎన్‌కౌంటర్‌లు పెరిగాయి. ఇండియన్ ఆర్మీ, జమ్మూకాశ్మీర్ పోలీసులు స్పెషల్ ఆపరేషన్స్ చేపట్టి ఉగ్రవాదులను ఏరివేస్తున్నాయి. ముష్కరులనువరుసగా మట్టుబెడుతూ విజయం సాధిస్తున్నాయి. గత ఏడాది జమ్మూకాశ్మీర్‌లో 171 మంది ఉగ్రవాదులు హతమయ్యారని అక్కడి పోలీసులు తెలిపారు. అందులో 19 మంది పాకిస్తానీ ఉగ్రవాదులు ఉన్నారని పేర్కొన్నారు. ఇక ఈ ఏడాది  ఇప్పటి వరకు మొత్తం 11 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. నాలుగు ఎన్‌కౌంటర్లలో 10 మంది మరణించగా.. ఎల్‌వోసీ మీదుగా భారత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన మరో టెర్రరిస్టును కాల్చి చంపారు. లష్కరే తోయిబా కమాండర్ సలీమ్ పర్రేను కూడా ఆర్మీ బలగాలు చంపేశాయి. ఈ ఏడాది ఇదే పెద్ద విజయంగా ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. కాశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు.

  Published by:Shiva Kumar Addula
  First published:

  Tags: Encounter, Jammu and Kashmir, Terror attack

  ఉత్తమ కథలు