Home /News /national /

JIO SENSATION JIO TOWERS IN MAOIST AFFECTED AREAS WHERE ARE THEY UMG GH

Andhra Pradesh: జియో మరో సంచలనం. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో జియో టవర్లు. అవి ఎక్కడంటే..!

జియో మరో  సంచలనం. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో జియో టవర్లు. అవి ఎక్కడంటే..!

జియో మరో సంచలనం. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో జియో టవర్లు. అవి ఎక్కడంటే..!

ఆంధ్ర ప్రదేశ్‌లో (Andhra Pradesh) జియో (Jio) నెట్‌వర్క్ కంపెనీ సేవలను విస్తరించనుంది. వచ్చే ఏడాదిలోగా అల్లూరి సీతారామరాజు (Alluri Sitarama Raju) జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో భారీగా మొబైల్‌ నెట్‌వర్క్‌ టవర్లను ఏర్పాటు చేయడానికి టెలికాం కంపెనీ సిద్ధమైంది.

ఇంకా చదవండి ...
ఆంధ్ర ప్రదేశ్‌లో (Andhra Pradesh) జియో(Jio) నెట్‌వర్క్ కంపెనీ సేవలను విస్తరించనుంది. వచ్చే ఏడాదిలోగా అల్లూరి సీతారామరాజు (Alluri Sitarama Raju) జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో భారీగా మొబైల్‌ నెట్‌వర్క్‌ టవర్లను ఏర్పాటు చేయడానికి టెలికాం కంపెనీ సిద్ధమైంది. ఈ విషయాన్ని తాజాగా జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SP) సతీష్ కుమార్ వెల్లడించారు. గిరిజనులు ఉన్న కొండ ప్రాంతాల్లో 1,000 కొత్త మొబైల్ టవర్లను స్థాపించడానికి మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లు సిద్ధంగా ఉన్నాయని ఎస్పీ సతీష్ కుమార్ పేర్కొన్నారు. రిలయన్స్ జియో 700 టవర్లను ఏర్పాటు చేయనుందని.. భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) వచ్చే ఏడాదిలో మూడు దశల్లో 300 టవర్లను ఏర్పాటు చేస్తుందని తెలిపారు. కొత్తగా టవర్లు వస్తే కొండ ప్రాంతాల్లో నివసించే గిరిజనులు, ఇతర ప్రజలు మెరుగైన మొబైల్ సిగ్నల్స్‌ పొందుతారు.

ఈ మారుమూల ప్రాంతాల్లో జిల్లా పోలీసు అధికారులు, ఏకీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (Integrated Tribal Development Agency-ఐటీడీఏ) అధికారులు కలిసి నెట్‌వర్క్‌ టవర్లను ఏర్పాటు చేయనున్నారు. అయితే ఏపీలో కొత్తగా ఏర్పాటు అయిన అల్లూరి సీతారామరాజు (ASR) జిల్లాలో మొత్తం 22 మండలాలు ఉన్నాయి. వీటిలో ఎక్కువ భాగం గిరిజన ప్రాంతంలోనే ఉండగా... ఈ ప్రాంతాలలో కేవలం 20 నుంచి 25 శాతం మందికి మాత్రమే మొబైల్ నెట్‌వర్క్ సేవలు అందుబాటులో ఉన్నాయని పోలీసులు తెలిపారు. శనివారం అంటే జులై 9న ఎస్పీ సతీష్ మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని మండలాల ప్రధాన కార్యాలయాల (Headquarters)ను ఇప్పటికే మొబైల్ నెట్‌వర్క్‌లకు కనెక్ట్ చేయడం జరిగిందని వెల్లడించారు. ప్రభుత్వం మొబైల్ కనెక్టివిటీతో గిరిజన ప్రాంతాలకు వైద్య సదుపాయాలను అందించగలదని చెప్పారు.

ఇదీ చదవండి: Liquor Consumption: అయ్యబాబోయ్.. దేశంలో మహిళలు ఎక్కువగా తాగే రాష్ట్రాలు ఏంటో తెలుసా ?.. చదివితే షాక్ అవుతారు.. !

మొబైల్ నెట్‌వర్క్ ఆపరేటర్లు మావోయిస్టులు మొబైల్ టవర్లను ఎక్కడ తగులబెడతారేమోననే భయంతో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో టవర్లను ఏర్పాటు చేయడమే మానేశాయి. 2017లో ధారకొండలో మావోయిస్టులు మొబైల్ టవర్లను తగులబెట్టారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో జీకే వీధి, చింతపల్లి, పెదబయలు, ముంచింగ్‌పుట్‌, జీ మాడుగుల, హుకుంపేట, డుంబ్రిగూడ, కొయ్యూరు వంటివి ఉన్నాయి. ఒక విశ్వసనీయ వర్గాల ప్రకారం... సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన జిల్లాల (Aspirational Districts)లోని మారుమూల గ్రామాల్లో 4G మొబైల్ సేవలను అందించడానికి ప్రభుత్వం రూ.3,683 కోట్లు ఒక ప్రాజెక్టుకి కేటాయించింది. ఈ ప్రాజెక్ట్ కింద జార్ఖండ్, మహారాష్ట్రలో భారతీ ఎయిర్‌టెల్ రూ.847.95 కోట్లతో 1,083 మొబైల్ టవర్లను ఇన్‌స్టాల్ చేస్తుంది. రిలయన్స్ జియో రూ.2,836 కోట్లతో 3,696 టవర్లను ఏర్పాటు చేయనుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మే నెలలో ఈ ప్రాజెక్టును కంపెనీలకు ప్రభుత్వం అప్పగించింది.



ఐదు రాష్ట్రాల్లోని పేద జిల్లాలలోని మారుమూల గ్రామాలలో 4G కవరేజీని అందించే ప్రాజెక్ట్‌కు గత సంవత్సరం క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ గ్రామాల్లో 4G సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి ఎయిర్‌టెల్, జియో సంస్థలకు ప్రభుత్వం 18 నెలల సమయం ఇచ్చిందని ఆ వర్గాలు తెలిపాయి. ఈ ప్రాజెక్ట్ కింద ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మహారాష్ట్ర, ఒడిశా వంటి ఐదు రాష్ట్రాలలోని 44 జిల్లాల్లోని 7,287 గ్రామాల్లో 4G మొబైల్ సేవలను మొబైల్ నెట్‌వర్క్ ఆపరేటర్లు అందిస్తాయి. ఈ టవర్లను ఏర్పాటు చేయడానికి ఐదేళ్ల నిర్వహణ ఖర్చులతో కలిపి సుమారు రూ.6,466 కోట్లు ఖర్చు అవ్వచ్చని అంచనా.
Published by:Mahesh
First published:

Tags: Andhra Pradesh, AP new districts, Jio, Mukesh Ambani

తదుపరి వార్తలు